Aadi Shesha, ఆయన ఆదిశేషుడి అవతారమే !

 Aadi Ahesha

ఆయన ఆదిశేషుడి అవతారమే !
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Aadi Shesha
 
Aadi Shesha ఆయన ఆదిశేషుడి అవతారమే !
 
సాధారణంగా ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి సీతారామాలయంలో సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా దర్శనమిస్తూ వుంటాడు. సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. లోకంలో సీతారాముల దాంపత్యం ఎంతటి ఆదర్శప్రాయమైనదిగా చెప్పబడుతూ వుంటుందో, అన్నదమ్ములుగా రామలక్ష్మణుల అనుబంధం గురించి కూడా అదే విధంగా చెప్పుకుంటూ వుంటారు.
 
కైకేయి కోరినది .. దశరథుడు అడవులకు వెళ్లమన్నది రాముడిని మాత్రమే. అయితే రాముడిని విడిచి క్షణమైనా ఉండలేని లక్ష్మణుడు, అన్నకంటే ముందుగానే సిద్ధమై కూర్చుంటాడు. కొన్ని సంవత్సరాల పాటు భార్యకి దూరంగా ఉండవలసి వస్తుందని తెలిసి కూడా, రాముడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా బయలుదేరుతాడు.

Aadi Shesha

సీతారాముల విశ్రాంతి ప్రదేశాలను ఎంపిక చేస్తూ .. అనుక్షణం వాళ్లని కాపాడుకుంటూ వస్తాడు. అన్నావదినలతో పాటు తాను కూడా కష్టాలు పడుతూ, ఆ కష్టాల గురించిన ప్రస్తావన చేయకుండా సేవలు చేస్తూ ఉండేవాడు. మారీచుడు మాయలేడిగా వచ్చినప్పుడు రాముడి ఆదేశానికి కట్టుబడి సీతకి రక్షణగా వుంటాడు. సీతమ్మ ఆవేదనను అర్థం చేసుకుని రాముడి కోసం వెళతాడు.
సీతమ్మను రావణుడు అపహరించాడని తెలిసి, రాముడితో పాటు ఆమె జాడ తెలుసుకోవడానికి అనేక కష్టాలను అనుభవిస్తాడు.
.
మేఘనాథుడు వంటి వీరులతో లక్ష్మణుడు తలపడతాడు. ఏ శక్తి అయినా ముందుగా తనని దాటుకునే రాముడిదాకా వెళ్లాలనే బలమైన ఉద్దేశం లక్ష్మణుడిలో కనిపిస్తుంది. రాముడికి అండగా ఉండటం కోసమే తాను వెన్నంటి వచ్చినట్టుగా వుండేవాడే తప్ప, రాముడు తీసుకునే ఏ నిర్ణయంలోను జోక్యం చేసుకునేవాడు కాదు. ఎందుకంటే రాముడు చెప్పిందే ధర్మం .. చేసేదే ధర్మమని లక్ష్మణుడికి తెలుసు.
Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?
Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :-
Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం
Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు
Viswamitra విశ్వామిత్రుడు
Yashoda, yaagyavalkudu యశోద యాజ్ఞవల్కుడు

 

Yudhisturudu – యుధిష్టిరుడు

 

అనుక్షణం రాముడిని నీడలా అనుసరించిన లక్ష్మణుడు, సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతుంటాయి. ఇక లక్ష్మణుడు వంటి సోదరుడు లభించడం తన అదృష్టంగా రాముడే స్వయంగా సెలవిచ్చాడు. అందుకే రాముడిచే లక్ష్మణుడు ప్రశంసలు అందుకున్నాడు. ఆయనతో పాటు అశేష భక్తజనావళిచే పూజలు అందుకుంటున్నాడు.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Spread iiQ8

April 26, 2015 8:21 PM

727 total views, 0 today