Telugu Samethalu Telugu Proverbs
న Telugu Samethalu Latest
నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
నలుగురితో నారాయణా
నల్లటి కుక్కకు నాలుగు చెవులు
నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
నవ్విన నాపచేనే పండుతుంది
నాగస్వరానికి లొంగని తాచు
నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
నిండా మునిగిన వానికి చలేంటి
నిండు కుండ తొణకదు
నిఙ౦ నిప్పులా౦టిది
నిజం నిలకడమీద తెలుస్తుంది
నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
నిప్పు ముట్టనిదే చేయి కాలదు
నిప్పులేనిదే పొగరాదు
నివురు గప్పిన నిప్పులా
నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
నీటిలో రాతలు రాసినట్లు
నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు
నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
నూరు చిలుకల ఒకటే ముక్కు
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
నేతిబీరలో నేతి చందంలా
నేల విడిచి సాము చేసినట్లు
నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
నా కొడి కుంపటి లేకపొతే తెల్లారదు అన్నట్టు
ప
పనిఒత్తిడికి వీడ్కోలు, పించనుకు స్వాగతం
పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
పండగ నాడు కూడా పాత మొగుడేనా?
పండిత పుత్ర: పరమ శుంఠ:
పండితపుత్రుడు… కానీ పండితుడే…
పందికేంతెలుసు పన్నీరు వాసన
పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగి నట్లు
పక్కలో బల్లెం
పగలంతా బారెడు నేశా రాత్రికి రారా దిగ నేస్తా అన్నట్టు
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
పట్టుకోక ఇచ్చినమ్మ పీటకోడు పట్టుకు తిరిగిందంట
పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
పాకేటప్పుడు పంది నడిచేటప్పుడు నంది
పావలా కోడికి ముప్పావలా దిష్టి
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేలు లెక్కెసు కుందట
పాలు, నీళ్ళలా కలిసిపోయారు
పిండి కొద్దీ రొట్టె
పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
పిచ్చోడి చేతిలో రాయి
పిచ్చోడికి పింగే లోకం
పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ వుండవచ్చునన్నాడంట
పిల్లికి కూడాబిచ్చం పెట్టనివాడు
పిల్లికి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం
పుండుకు పుల్ల మొగుడు
పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు
పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
పుల్లయ్య వేమారం (వేమవరం) వెళ్ళొచ్చినట్లు
పూజించిన పామే ప్రాణం తీసినట్లు
పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
ప్రేమ గా ఏం వండిపెట్టనూ అంటే వెన్నతో అట్టేయమన్నాడంట
పెరుగుట విరుగుట కొరకే
పెళ్ళాము అంటే బెల్లము తల్లి తండ్రి అల్లము
పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
పైన పటారం, లోన లొటారం
పోనీలే అని పాత చీర ఇస్తే ఇంటెనక్కెళ్లి మూర వేసినట్టు
పొట్టోడికి పుట్టెడు బుద్దులు
పొమ్మనలేక పొగపెట్టినట్లు
పొయ్యి దగ్గర పోలీసు
పొరుగింటి పుల్లకూర రుచి
పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
బ
బతకలేక బడి పంతులని
బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
బతికి పట్నం చూడాలి…చచ్చి స్వర్గం చూడాలి
బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు
బర్రె పావలా బందె ముప్పావల
బ్రతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు
బ్రతికుంటే బలుసాకు తినొచ్చు
బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
బుగ్గ గిల్లి జోల పాడటం
బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
బెల్లం చుట్టూ ఈగల్లా
బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు
భోజరాజు వంటి రాజుంటే.. కాళిదాసు లాంటి కవి అప్పుడే పుడతాడు
బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు
భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
భక్తిలేని పూజ పత్రి చేటు
Telugu Samethalu Latest
మ
మంగలిని చూసి గాడిద కుంటినట్లు
మంగలి కత్తితో మాకుకు నరకగలమా
మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు
మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
మంచి మనిషికొక మాట మంచి గొడ్డుకొక దెబ్బ
మందుకని పంపిస్తే మాసికం నాటికి వచ్చే రకం
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
మాటకు మా ఇంటికి… కూటికి మీ ఇంటికి అన్నట్లు
మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
మింగ లేక మంగళవారం అన్నాడట
మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
ముంజేతి కంకణానికి అద్దమేల ?
మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
ముందు నుయ్యి వెనుక గొయ్యి
ముందుంది ముసళ్ళ పండుగ
ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
ముడ్డిలో పుండు మామగారి వైద్యం
ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు
మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే,.. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్టు
మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
మొండివాడు రాజు కన్నా బలవంతుడు
మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
మొరిగే కుక్క కరవదు
మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
మౌనం అర్ధాంగీకారం
మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట
మంచానికి అడ్డం, మతానికి ఎదురు
ర
రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని
రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది
రాజుల సొమ్ము రాళ్ళ పాలు,దొరల సొమ్ము దొంగల పాలు
రాత రాళ్ళేలమని ఉంటే… రాజ్యాలెలా ఏలుతారు…?
రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు
రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట
రెక్కాడితే గానీ డొక్కాడదు
రెంటికీ చెడిన రేవడి చందాన
రెడ్డొచ్చె మొదలాడు
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే
రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట
రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
రౌతు కొద్ది గుర్రం
Bhagavad Gita Chapter 18 Moksha Sanyas Yog | English Bhagavath Geetha
ల
లంఖణం పరమౌషధం
లంఖణం చెయ్యమంటేనే ఉపవాసానికి ఒప్పుకున్నట్టు
లేడికి లేచిందే పరుగు
లేని దాత కంటే ఉన్న లోభి నయం
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
Telugu Samethalu Latest | iiQ8 Provers in Telugu from Na న to Ksha క్ష
వ
వంగలేక మంగళవారం అన్నాడంట
వండుకు తినేవాడికి ఒక కూర అడుక్కు తినేవాడికి అరవైనాలుగు కూరలు
వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
వాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే, కారెడ్ల కామక్క వంకాయల భారం తూగిందట.
వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ
వస్తే కొండ పోతే వెంట్రుక
వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు
వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
వీపు విమానం మోత మోగుతుంది
వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల దాగిన వాడిని చావ మోదినట్టు
వేపకాయంత వెర్రి
వేగం కన్నా ప్ర్రాణం మిన్న
వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
వేసేటప్పుడు వేప మొక్క తీసేటప్పుడు అమ్మవారు
వాడికి సిగ్గు నరమే లేదు
విగ్రహపుష్టి నైవేద్యనష్టి
వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరు
వంకరటింకర పోతుంది పాము కాదు
వెంట్రుకలున్నమ్మ ఏ కొప్పైనా వేయ గలదు
శ
శంఖులో పోస్తేగాని తీర్థం కాదని
శృతి ముదిరి రాగాన పడింది
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
శతకోటి లింగాలలో బోడిలింగం
శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు
శొంఠి లేని కషాయం లేదు
శ్వాస ఉండేవరకే ఆశ ఉంటుంది
ష
షండునికి రంభ దొరికినట్లు
స
సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట
సంతులేని ఇల్లు చావడి కొట్టం
సంతోషమే సగం బలం
సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
సంపదలో మరపులు ఆపదలో అరుపులు
సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె,ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడింది
సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
సత్రం భోజనం మఠం నిద్ర
సన్నాయి నొక్కులే గానీ… సంగీతం లేదన్నట్లు…
సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
సింగడు అద్దంకి వెళ్లినట్టు
సింగినాదం జీలకర్ర
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
సూది కోసం సోది కెళితే పాత రంకంతా బయట పడిందిట
సొమ్మొకడిది సోకొకడిది
సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట
సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు
సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు
Valmiki Sampoorna Ramayanam Telugu | iiQ8 | వాల్మీకి మహర్షి రామాయణం మొత్తం 6 కాండలు
హ
హనుమంతుడి ముందా కుప్పిగంతులు
హనుమంతుడు… అందగాడు…
హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు
హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు
క్ష
క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం వెయ్యాలి
క్షేమంగా పోయి లాభంగా రండి
క్షీరాబ్ది లంకలో జేరినప్పటికైన, కొంగ తిండికి నత్తగుల్లలేను
Telugu Samethalu Latest | iiQ8 Provers in Telugu from Na న to Ksha క్ష
Bhagavad Gita Chapter 15 Purushottam Yog | English Bhagavath Geetha
Telugu Samethalu Latest | iiQ8 Provers in Telugu from Na న to Ksha క్ష
Top 5 Tools
Telugu Samethalu Latest | iiQ8 Provers in Telugu from Na న to Ksha క్ష Telugu Samethalu Latest | iiQ8 Provers in Telugu from Na న to Ksha క్ష Telugu Samethalu Latest | iiQ8 Provers in Telugu from Na న to Ksha క్ష