School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

మా బడి జీవితం..! ఇప్పుడు అదో జ్ఞాపకం…!

Our school life..! Now that’s a memory…!

 

ఒరేయ్ ఈ రాజు ఇవ్వాలన్నా తొందరగా రారా, లేకుంటే వెంకన్న సార్తో దెబ్బలు రోజు నా వల్ల కావట్లేదురా…!

“ఫోటో సోర్స్ గూగుల్”

School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

 

ఒరేయ్ ఏమన్నా అంటే అన్నానంటావ్ గాని, నిన్న నువ్వు తిన్న కొబ్బరుండ డబ్బులు మా నాన్న నన్ను కొనుక్కు తినరా అంటే నీకో సగం ఇచ్చా..! నా కోసం ఓ నాలుగు దెబ్బలు తినలేవురా..! చి ఛీ ఎం దోస్తూగానివి రా నువ్వు. 😅😅.

“ఓరాజు వాని దోస్తు”

ఒరేయ్ రాజుగా రారా 9 అయ్యింది అసలే చలికాలం చేతులు మంట పుడుతున్నాయి దెబ్బలకు, కనీసం ఒకరితర్వాత ఒకరైనా పొదాంరా అసలే కలిసి తిరుగుతున్నాం అని సార్ కి కోపం..!

రాజు: ఏం కాదులేర్రా మా మామ పోలీస్ ఒక్కసారి చెప్పానంటే వెంకన్న సార్ని జైల్లో పెట్టి కొడతాడు, ఈ సారి కొడితే మా మామయ్యకు చెప్తా, నా చిన్నప్పుడు నన్ను ట్యూషన్ లో కొట్టిండు అని చెప్పా తుపాకీ చూపించి కాల్చి చంపేస్తా అని బెదిరించాడు అప్పటినుంచి నా జోలికి రాలేదు తెల్సా ..!

రాజుగా మీ మామ పోలీసా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా అనవసరంగా భయపడుతున్నా ఇన్నిరోజులు…!

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,

“టైం 9–30, ఫస్ట్ క్లాస్ గంట మోగింది”

వెంకన్నసార్ (ప్రిన్సిపల్) : మీరు ఇక్కడికి రండ్రా,

టైం ఎంతైందిరా..1

బడెన్నింటికీ రా…2

ఎన్నింటికొస్తున్నారు రా…3

ఇంకోసారి లేట్ వస్తారా …4

మీరు చదివేది 4గో తరగతి మీరో బ్యాచ్…5

దానికి ఎవడ్రా లీడర్ రాజుగాడేనా…6

రేపు లేటొస్తే కోదండం వేపిస్తా ఒక్కోడికి…7

నడవండి, నడవండి క్లాస్ కి …8,9,10,11

ఆ అంకెలు ఏంటనుకుంటున్నారా అంకెలు కావవి, ఈత బరిగల అప్పచ్చిలు..!

“ఒరేయ్ రాజుగా వెంకన్న సార్ మీద మీ మామకు ఓసారి చెప్పాల్సిందేరా” 😛

మై ఐ కామేం సార్..!

ఏంట్రా ఈరోజుకూడా లేటు బుద్దిలేదు రోజూ దెబ్బలు తింటానికి..!

సరే రండి లోపలికి అందరూ తలా ఒక్కో పేజీ చింపుకొండి స్లిప్ టెస్ట్ పెడ్తా అన్నగా పోయిన వారం..!

“ఒరేయ్ రాజుగా ఎవరి మొహం చూసామ్రా ఇవ్వాళ. ఇలా అవుతుంది అంతా” 😏🤨😠

పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

రాజు: సార్ పోయిన వారం నేను రాలేదు సార్ నాకు తెలీదు, చదవలేదు..! “సరే పక్కన కూర్చో”

నువ్వు కూడా రాలేదని చెప్పు అడిగితే నేను అవును సార్ అంటా, సార్ కి గుర్తుందా ఏంటి..! మీ: సార్ నేను కూడా పోయిన వారం రాలేదు సార్..! “అవునా ఓసారి ప్తిన్సిపల్ రూంలో

అటెండన్స్ రిజిస్టర్ ఉంటుంది అడిగి తీసుకురాపో”.

“ఎవడైనా వచ్చి వెళ్ళిద్దరిని తీసుకెళ్లి వెంకన్న సార్ కి చెప్పండి అబద్దాలు చెప్పారని”

1,2,3,4,5..! నెంబర్ గుర్తులేదు..!

“జనార్దన్ సార్ మీద కూడా చెప్పాల్రా మీ మామయ్యకు”😆

“రాజుగా ఈ ఆదివారం ఈతకు పొదాంరా..!

నీకు ఈత రాదుగారా..!

నిన్ననే మా గాబులో దూకి నేర్చుకున్నా..!

అవునా ఐతే ఆదివారం పొద్దున్నే మా పొలం కాడికి పోదాం..!”😂😂

“ఈ మద్యే తెలిసింది రాజుగాని మామ పోలీస్ కాదు టైలర్ అని”🥸🥸

“ఇలాంటి ఎన్నో తీపి జ్ఞాపకాలను పంచిన నా చిన్ననాటి బడి ఈ సంవస్సరం నుంచి మూత పడింది..! 😔😞

రాజకియ ఎత్తుగడ అనాలో..!

మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

మా వెంకన్న సార్ మంచితనం అనాలో..!

పిల్లల తల్లిదండ్రుల ఆర్ధిక స్థోమత గురించి అలోచించి, నాలుగు పైసలు వెనకేసుకోలేదనాలో..!

“అర్ధం కాని పరిస్థితి”

1980’s నుంచి 2020 వరకు ఎన్నో వేల మందికి సంస్కారం నేర్పిన బడి మా “క్రాంతి విద్యా మందిర్” ఇక లేదు 😭😭

Grandfather, Telugu Moral Stories తాతా మనవరాలు


Innocent Childhood, Telugu Moral Stories అమాయక బాల్యం


Telugu Moral Stories, Old TV Katha పక్కింటోడి టీవీ …!

Spread iiQ8

February 23, 2023 3:15 PM

230 total views, 0 today