Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

డబ్బుల్లేని ధనికులు..V -2.O

Telugu Moral Stories, Rich people without money

 

డబ్బులేని ధనికులు కు కొనసాగింపు. చదవని వాళ్ళు కింద లింకులో చదవండి.

“తలకు తగిలిన దెబ్బ మానిపోయాక సోమన్న ఇంటికెలతాడని తెలీటంతో, ఓనర్ సోమన్న కిరాయికి ఉండే ఇంటిదగ్గరికి భార్యాపిల్లలతో వచ్చాడు.”

వాళ్ళిద్దరిని చూసిన సోమన్న రండి బాబు అంటూ పక్కనింట్లో నాలుగు కుర్చీలు అడిగి తీసుకొచ్చేసరికి అందరూ చాప మీద కూర్చున్నారు. ఒక కబురు చేపిస్తే మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా బాబూ. మీరెందుకు ఇంత ఎండలో పిల్లల్ని , మేడం గారిని ఇబ్బంది పెట్టడం.

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O 1

అప్పుడు ఓనర్ వాళ్ళ భార్య సోమన్న, మేమంతా మీఇంటికి వూరికే రాలేదు ఈరోజు మేమంతా మీతో కలిసి భోజనం చెయ్యటానికే వచ్చాము. మీరేమి కంగారు పడి వంట ప్రయత్నాలు ఏమీ మొదలెట్టకండి. మీకు మాకు సరిపడా అన్నీ ఇంట్లో చేసుకునే వచ్చా. ముఖ్యంగా ఇక్కడికి రావటానికి ఇంకో కారణం మీ భార్యకు దెబ్బతగిలిన విషయం తెలిసినప్పుడే హాస్పిటల్కి వద్దాం అనుకున్నా. కానీ మీరు కోపంలో ఏమైనా అంటారేమో అని ఆయన వద్దన్నారు. మీరు ఏమీ అనలేదని ఆశ్చర్యం వేసింది. రేపు మీరు ఊరెళ్తున్నారని మళ్ళీ తిరిగి రానన్నారని ఆయన చెప్పారు. అందుకే మేము అందరం ఇలా వస్తే మీరు అంతా మరిచిపోయి సంతోషంగా ఇంటికెళ్తారని ఇలా అందరం వచ్చాము.

Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం

ఇదంతా ఓ పక్కనుండి గమనిస్తున్న సోమన్న భార్య: మాకు మంచి మనసుతో ఉద్యోగాలు ఇచ్చారు, ఉండటానికి ఇల్లు చూపించారు. దగ్గరుండి మంచి చెడ్డా చూసుకుంటున్నారు, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, మీరేం బాధపడకండి అప్పుడు భయంతో వెళ్ళిపోదాం అనుకున్న మాట వాస్తవమే కానీ ఊర్లో మా పరిస్థితి ఏమీ బాలేదండి. అక్కడ మేము చేయటానికి ఏమీ లేదు. ఇక్కడే ఉండి నాలుగు పైసలు సంపాదించుకుని పిల్లలను బాగా చదివిస్తే చాలు. ఊరెళ్ళి పిల్లలతో కొద్ది రోజులు గడిపి మళ్ళీ వచ్చేస్తాం మీదగ్గరే పనిచేసుకుంటాం.

తిరిగి వెళ్తున్న వాళ్ళ కుటుంబాన్ని సాగనంపటానికి సోమన్న కారుదాకా వెళ్ళాడు. వెనకాలే సోమన్న భార్య ఓనర్ భార్య ఏదో మాట్లాడుతూ కారు వైపు నిదానంగా నడుస్తున్నారు. పిల్లలు ఉరుక్కుంటూ వెళ్లి కార్లో ఉన్న రెండు పెద్ద సైజు కవర్లు తెచ్చి వాళ్ళ నాన్నకిచ్చారు. అవి మనకోసం కాదు అంకుల్ వాళ్ళ పిల్లలకోసం సోమన్న చేతికి కవర్లు ఇచ్చి వాళ్ళు కారు ఎక్కి మీకిష్టమొచ్చినన్ని రోజులు ఉండి మళ్ళీ రండి. ఈసారి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాను.

అన్నట్టూ మీ పేరేంటమ్మా అని సోమన్న భార్య వైపు చూస్తూ అడిగిన ఓనర్కు సిగ్గుపడుతున్న భార్యవైపు చూస్తూ పార్వతి బాబు సోమన్న సమాధానం…!

అయ్యా ..! సారువాళ్ల పిల్లలు భలే స్టైల్గా ఉన్నారు కదా. మన పిల్లలు కూడా అలా బాగా చదువుకుని పద్దతిగా ఉండాలి. పైగా అన్ని డబ్బులున్నా ఏమాత్రం దర్పం లేదు చూడు వాళ్లందరికీ. అవునూ మేడం నీకేదో చెప్తుంది ఏంటి..?

Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

ఏమీ లేదయ్యా వాళ్ళు కూడా హైదెరాబాద్కు ఇద్దరే వచ్చారంట. ప్రేమ పెళ్లి వల్ల ఇంట్లో వాళ్ళెవరూ మాట్లాడారట. చాలా సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నారట, ఈమద్యే కుటుంబంలో కొందరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారట.

తెల్లవారుజామునే మన సోమన్న & పార్వతులు బస్టాప్ దగ్గరికి వెళ్లి నిల్చున్నారు. ఓ అరగంటకు వాల్లూరికెళ్లే బస్సును చూసిన వాళ్ళ కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయాయి.

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O 2

తెల్లవారుజామునే మన సోమన్న & పార్వతులు బస్టాప్ దగ్గరికి వెళ్లి నిల్చున్నారు. ఓ అరగంటకు వచ్చిన వాల్లూరికెళ్లే బస్సును చూసి చిన్నపిల్లలైపోయారు. పిల్లల్ని చూడాలి, ఈ కొన్న బొమ్మలు, పెన్నులు, చెప్పులు అన్నీ ఒక్కసారే వాళ్ళకిచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని, ఉబ్బి తబ్బిబై పోతున్నారు. బస్సు ఊరి పొలిమేరకు రాగానే పిల్లల్ని చూడాలన్న ఆత్రం అమాంతం పెరిగిపోయింది. ఆగటమే ఆలస్యం పరుగుపరుగున వాళ్ళ బాబాయ్ వాళ్ళింటికెళ్లారు. ఆరుబయట అమాయకంగా నిల్చున్న అమ్మాయిని దగ్గరకు తీసుకుని పార్వతి ఏడవటం మొదలెట్టింది. కొడుకు కనిపించక పోయేసరికి ఎక్కడికో ఆడుకోటానికి వెళ్లాడనుకుని తెచ్చిన బొమ్మలూ అవీ చూపిస్తుంటే, అమ్మా అనుకుంటూ కాసేపటికి నల్లగా మాసిన చొక్కా , చిరిగిన లాగూ వేసుకుని పరిగెత్తుకుని వస్తున్న కొడుకుని చూసి సోమన్నకు కళ్లు చెమ్మగిల్లాయి. దగ్గరకు తీసుకుని ఎక్కడికెళ్లావ్ ఆడుకోటానికా అనడిగాడు. లేదు నాన్నా అక్కా , నేను కొన్నిరోజులు మిరపకాయలు వేరటానికి వెళ్ళాం ఈరోజు డబ్బులు ఇస్తా అంటే తీసుకురటానికి వెళ్ళా.అక్కకి చెప్పులు లేవని నేనొక్కణ్ణే వెళ్ళా నాన్నా. సమాధానం విన్న సోమన్న గుండె బద్దలైంది. నెల నెలా బాబాయ్కి డబ్బులు పంపిస్తున్నా పిల్లల్ని ఎందుకు కూలికి పంపించాడు. ఎలాగైనా అడగాలి అనుకుంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుని మీరెందుకు పనికి వెళ్లారు, ఎవరెళ్లామన్నారు అనడిగాడు .

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O 3

మీ నాన్న ఇస్తున్న డబ్బులు కూరగాయలకు కూడా చాలట్లేదు, బట్టలు ఉతకడానికి సబ్బులు లేవు, మీ డబ్బుల్తో మీరే తెచ్చుకుని ఉతుక్కోండి అని కోప్పడింది. అందుకే పక్కన అంటీ కూలికి వెళ్తుంటే మేము వస్తాం అంటే తీసుకెళ్లింది. రెండ్రోజులే వెళ్ళాం నాన్నా మీకు తెలిస్తే కోపడతారని ఫోన్ లో చెప్పలేదు.

Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *

సోమన్న బాధపడుతూ ఇదంతా అమ్మకు చెప్పకండి. తెలిస్తే బాధపడుతుంది. పిల్లల మాటలు విన్న సోమన్న ఇద్దర్ని వాళ్ళతో తీసుకెళ్లాల్సిందే అని గట్టిగా నిర్ణయం తీసేసుకున్నాడు. పట్నం తీసుకొచ్చి ఓనర్ సాయంతో ఇద్దరి పిల్లల్ని ఓ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు.

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O 4

సోమన్న ఆ కంపెనీలో ఉన్న అందరు చేసే పనులని నేర్చుకున్నాడు. ఎవరైనా రాకపోతే వాళ్ళ స్థానంలోకి వెళ్లిపోయేవాడు, తలకు దెబ్బ తగిలిన తర్వాత పార్వతిని అకౌంట్స్ అవి నేర్పించమని అకౌంటెంట్ దగ్గర ఉంచారు, దాన్తో పార్వతికి ఫ్యాన్ కింద కూర్చుని చేసే ఉద్యోగం దొరికింది. ఆవిడ సంతోషానికి అవధులు లేవు, అన్నీ జాగ్రత్తగా చూసుకునేది,

(కొన్ని సంవత్సరాల తర్వాత)

సోమన్నా నిన్ను, పార్వతిని సార్ రమ్మంటున్నారు. డ్రైవర్ వచ్చి చెప్పగానే ఇద్దరూ వెళ్లి ఆఫీస్ రూమ్ బయట నిల్చున్నారు. రండి సోమన్నా కూర్చోండి.

సోమన్న : బాబు కొత్తగా మమ్మల్ని మీ రూంలో కూర్చోమంటున్నారు..? ఏమైంది బాబు మాకంతా కొత్తకొత్తగా ఉంది, అందరూ మానేస్తున్నారు, కొత్తవాళ్లకు రోజు డబ్బులు రోజే ఇచ్చి పంపిస్తున్నారు పాత వాళ్ళు వచ్చి మీ కోసం ఆరా తీసి వెళ్తున్నారు ఏమైందండీ..?

ఓనర్ : సోమన్నా ఇదంతా మీ ఇద్దరికీ అర్ధం అవుతుందో లేదో నాకు తెలీదు. కానీ నన్ను నమ్మి నా స్నేహితుడు మిమ్మల్ని నా దగ్గరికి పంపాడు. ఇప్పుడైతే మనం ఈ కంపెనీని నడిపే పరిస్థితిలో లేము. నేను ఇంకో కంపెనీ కోసం ఉన్న డబ్బంతా వాడేసాను. ఇల్లు కూడా పెట్టి లోన్ తీసుకున్నా, పిల్లలకోసం ఉంచిన ఇంటి జాగాలను కూడా అమ్మేసాం, ఇప్పుడు పని 80% అయింది మిగిలిన 20% కి 20–30 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్ని డబ్బులు మా దగ్గర లేవు,

Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం

ఇంకొంచెం పని ఐతే, కొత్త ప్రాజెక్టులు వస్తాయ్ అవి వుంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు. ఈ పరిస్థితిలో కొత్త కంపెనీ పని ఆగిపోతే అప్పులు చుట్టుముట్టి రోడ్డున పడతాము. ఇప్పటికే అయినవాళ్లు మేము ఎక్కడ అప్పు అడుగుతామో అని మా ఫోన్లు ఎత్తట్లేరు. అందుకే మీకు రెనెల్లుగా జీతం కూడా ఇవ్వలేక పోయాను. మిగతా వాళ్లంతా మానేశారు పాత వాళ్లొచ్చేదిపోయేది మిగిలిన జీతం డబ్బులకోసం. అందుకే బైట కూలీలతో ఏరోజు డబ్బులు ఆరోజే ఇచ్చి పని చేపించుకుంటున్నా, ఇప్పుడు జరుగుతున్న పని అయిపోతే వచ్చే డబ్బులతో మీ అందరికి రావాల్సిన జీతాలు ఇచ్చేస్తా. ఆ తరువాత ఈ మిషనరీ అంతా అమ్మేస్తే కొత్త కంపెనీ కంప్లీట్ చెయ్యటానికి సాయంగా ఉంటుంది. సోమన్నా నేను ఎంతగానో నమ్మిన అందరూ ఒక నెల జీతం ఇవ్వకపోయేసరికి వెళ్లిపోయారు. మీకో మంచి ఉద్యోగం చూసి పెడతాను నేను మళ్ళీ కుదురుకున్నాక పిలుస్తాను. అందరూ వెళ్లినా మీరిద్దరు నాకోసం ఉన్నారు అందుకే మీకు ఓ మాట చెబుదాం అని పిలిచాను. వచ్చేనెల లోపు మిమ్మల్ని ఇంకో దగ్గర పెట్టె బాధ్యత నాది మీరేమి బయపడకండి. నేను వెళ్తున్నాను మీరు కూడా ఇవాల్టికి తాళాలు వేసుకుని వెళ్ళండి.

సోమన్న : సరే బాబు..!

“రెండ్రోజుల తర్వాత”

సోమన్న : నేను ఓసారి బాబువాళ్ళింటికెళ్లి మాట్లాడి వస్తా..!

పార్వతి: మనం రెండ్రోజులుగా అనుకుంది అంతా గుర్తుందిగా చెప్పి ఒప్పించి రండి.

బాబు : ఏంటి సోమన్నా పొద్దునే వచ్చావ్, తాళాలు నీ దగ్గరే ఉన్నాయిగా ఏమైనా సమస్యా..!

సోమన్న : బాబు మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను, అలా బైట నిల్చుని మాట్లాడుదాం పిల్లలు చదువుకుంటున్నారు.

బాబు : ఏంటి సోమన్న చెప్పు,

సోమన్న : బాబు ఈ కవర్లో రెండున్నర లక్షలున్నాయి మీ దగ్గరుంచండి, ఇంకో రెండు చిట్టిలు వేస్తున్నాం ఇంకో లక్ష రెండో తారికున వస్తాయ్, ఊర్లో మాకు వ్యవసాయ భూమి ఉంది దాన్ని బేరం పెట్టాను. పది పదుహేను రోజుల్లో డబ్బు చేతికొస్తుంది మీరు కంపెనీ పెట్టాక నాకు కొనిద్దురుగాని నా మాట కాదనకుండా తీసుకోండి.

School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

బాబు: సోమన్నా నీకు పిచ్చిగాని పట్టిందా, నాకోసం ఉన్న భూమిని అమ్మటం ఏంటయ్యా..! అది విడిపించుకోటానికేగా ఇంత దూరం వచ్చి పనికి చేరింది, రేపు మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది. ఇలాంటి ఆలోచనలు ఆపేసి పిల్లల్ని మంచిగా చూసుకోండి. నేను ఏదోలాగా సర్దుకుంటాలే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు మీరేం ఆ భూమిని అమ్మకండి ఫోన్ చేసి చెప్పండి వాళ్లకు అమ్మట్లేదని.

సోమన్న : బాబు ఇక్కడికి రాకముందు మాకు పిల్లలకు ఓ దారంటూ లేదు, భూమిని విడిపించుకుంది మీరిచ్చిన జీతం డబ్బులతోనే, నా మాట కాదనకండి. పిల్లల భవిష్యత్తు అంటారా ఇంకో నాలుగేండ్లకు సరిపడా ఫీజు ఒక్కసారే కట్టేసాము. వాళ్ళ మిగతా అవసరాలకోసం ఇద్దరం ఎంతకష్టమైన పడతాం. బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చే అవకాశం ఉంటె మీరు ఆ మిషన్లు అమ్మే ఆలోచన చెయ్యరు. బాబు మీరేం ఆలోచించకుండా సరే అనండి అంతా మంచే జరుగుతుంది ఇంకేం ఆలోచించకండి ఇవి తీసుకోండి.

బాబు : సోమన్నా నేను ఆలోచించుకుని నీకు సాయంత్రం చెప్తా ఈ డబ్బుల కవరు తీసుకెళ్ళు. ఎలా వచ్చావ్ ..! బండిమీద దింపేసి వస్తా పదా.

సోమన్న : నేను వెళ్తాలెండి పక్కనేగా. మీరు మాత్రం నా మాట కాదనకండి.

ఓనర్ భార్య లక్ష్మి : ఏంటండీ సోమన్న వచ్చాడు ఏంటి అంత సీరియస్ మాట్లాడుతున్నారు ఇద్దరూ. జీతం డబ్బులకోసమా వచ్చింది..?

ఓనర్ విష్ణువర్ధన్ : నీతో ఒక విషయం మాట్లాడాలి కూర్చో, సోమన్న వచ్చింది జీతం అడగటానికి కాదు.

లక్ష్మి : మరి ఎందుకు ఇంతపొద్దునే వచ్చాడు ఏంటండీ కళ్ళలో నీళ్లు ఏమైంది..?

విష్ణు : వాళ్ళు మనం ఇచ్చిన జీతాన్ని రూపాయి రూపాయి కూడబెట్టుకుని అంతా తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఊర్లో ఉన్న భూమి అమ్మి వచ్చి నాకిస్తా అంటున్నాడు. ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా, ఎం చేశాం చెప్పు వాళ్లకు మనం..! అందరిలాగే నెలనెలా జీతం, అందరికి ఇచ్చినట్టే ఇంటి అద్దె కడుతున్నాం. కానీ వీళ్లిద్దరు ఇలా మనమీద అంత అభిమానం పెంచుకున్నారు చూడు, మనం వాళ్లకు ఏదో ఒకటి చెయ్యాలి ..!

లక్ష్మి : మీరు వింటా అంటే నేనో సలహా చెప్తాను, అది చెయ్యండి, లేకపోతే మనకోసం వీళ్ళు చేసిన ఈ పనివల్ల పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది.

Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం

కొన్నాళ్ళకు అనుకున్నట్టే సోమన్న భూమి అమ్మిన డబ్బులు తెచ్చి ఓనర్ కు ఇచ్చేసాడు. బ్యాంకు కొంచెం లోన్ ఇవ్వడంతో కొత్త కంపెనీకి కావాల్సిన డబ్బు అంతా సమకూరింది.

సోమన్నా , పార్వతి మీరిద్దరూ వచ్చి కారెక్కండి సార్ బైట ఉన్నారు మిమ్మల్ని ఇద్దరినీ అక్కడికి తీసుకురమ్మన్నారు.

“వెళ్లేసరికి భార్యాభర్తలు ఇద్దరూ ఒక దగ్గరే ఉన్నారు, వీళ్లను చూసి లేచి దగ్గరకొచ్చారు”

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O 5

బాబు : కూర్చోండి ..! మీరిద్దరూ కూడబలుక్కుని నాకు డబ్బిద్దాం అనుకున్నారని తెలుసు. అందుకే ఇక్కడికి ఇద్దరినీ పిలిచా. అంత పెద్ద నిర్ణయం తీసుకునేప్పుడు నేను మీకు తిరిగి డబ్బు ఇవ్వగలనా అని ఆలోచించారా.

పార్వతి : ఆలోచించలేదుసార్ మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మాకు పనిచ్చి ఆదుకున్నారు. మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసాక మా వల్ల ఏమవుతుందని ఆలోచించగా భూమి గుర్తొచ్చింది రెండింతలు ధర ఇస్తే అమ్ముతాం అని ఊర్లో ఉన్న సేటుకు ఫోన్ చేశాం ఇస్తా అన్నాడు. డబ్బు వారంలోసర్ధాలి అన్నాం సరే అన్నాడు. మీకు సాయం చెయ్యటానికి మాకొ అవకాశం దొరికింది అని సంబరపడిపోయాం. సార్ మీ దగ్గరికి వచ్చేప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చాము అప్పుడు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా పిల్లలు మంచి బట్టలు వేసుకుని ఇంగ్లీష్ స్కూల్లో చదువుతూ, చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడగల్గుతున్నారు రేపు వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది ఇదంతాా వల్లనే.

బాబు : మరి మీరు చేసిన పని..! పడ్డ కష్టాలు..! వాటికేం విలువ లేదా..?

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O 6

సోమన్న : నేనో రైతుని బాబు, చిన్నపట్నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నా..! పంట చేతికొచ్చి పది రూపాయలు కనపడే లోపే పోయిన యేడు పంట మీద తీసుకున్న అప్పు కట్టాల్సొచ్చేది, నాలుగు చినుకులు పడగానే ఎరువులకనీ, విత్తనాలకని, మందులకనీ, కూలీలకనీ, పిల్లల పీజులకనీ, ఇంట్లో తిండికనీ, ఫంక్షన్లకనీ, ఆసుపత్రులకనీ అన్నింటికీ అప్పిచ్చేవాళ్ళింటికేనాయే మా పరుగులు..! మళ్ళీ ఆపంట చేతికి రాగానే వచ్చిన డబ్బులు అప్పులకు కట్టుడు కొత్త తిప్పలు పడుడు, ఏదో ఒకసారి బాగా పండి డబ్బులు మిగిలితే తర్వాత పంటకు పిడుగో, గాలిదుమ్మో వచ్చి ఆగం చేసుడేనాయే..! ఇంక రైతు కష్టానికి విలువెక్కడుంది బాబు..!

Day Dream, Telugu Moral Stories పగటి కల

మేము నాలుగు పైసలు చూడగలిగాం అంటే అది మీ దగ్గరకొచ్చాకనే, మళ్ళీ అవి మా దగ్గరనుంచి ఎప్పుడు వెళ్ళిపోయి మమ్మల్ని కష్టాల్లోకి తోస్తాయని భయంతో రూపాయ్ రూపాయ్ అలాగె దాచిపెట్టాం, మీదగ్గరుంటే అవి మాలాంటి నలుగురికి ఉపయోగపడతాయ్. మీరన్నారు చూడండి మళ్ళి తిరిగిస్తానో లేదో ఆలోచించుకున్నారా అని. పంట వేసేముందు ఏ రైతూ ఎంత లాభం వస్తుందని ఆలోచించడు బాబు, ఖచ్చితంగా పంట బాగా పండుద్ది అనే నమ్మకంతో మొదలెడతాడు. మాకు మీమీద నమ్మకం ఉంది.

లక్ష్మి : మీకు మా మీద ఎంత నమ్మకం ఉన్నా కొన్ని కొన్ని పద్ధతులు ఒప్పుకోవు సోమన్నా. ఇన్నిరోజులు మీరు చెప్పారు మేము సరే అన్నాం కదా, ఇప్పుడు మేం చెప్పేది మీరు వినండి. ఇప్పుడు కంపెనీలో వాడుతున్న మిషన్లు అన్ని మేం సొంత డబ్బుల్తో కొన్నవి. ఉన్న బిల్డింగుకు ఇంకా పదేండ్లకు అగ్గ్రిమెంట్ రాసుంది, మేము ఆ కంపెనీని మీకు అమ్మేసినట్టు అగ్గ్రిమెంట్ చేపించాం. ఇవాళ ఇక్కడ దానికి సంబంధించిన రెజిస్ట్రేషన్ జరుగుతుంది ముందే చెపితే మీరు కంగారు పడతారని మీకు చెప్పలేదు,

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

“అదివిన్న సోమన్న & పార్వతులకు చెమట్లు పట్టేసాయి”

సోమన్న & పార్వతి ఇద్దరూ : బాబు ఇవ్వన్నీ మాకేం వద్దండి, మాకు భయమేస్తుంది ఇలా చెయ్యకండి. మీకు డబ్బులొచ్చినప్పుడు మాకివ్వండి అంతే..!! కావాలంటే అప్పు తీసుకున్నటు కాగితం రాసివ్వండి చాలు. దయచేసి ఇంతమంది వర్కర్ల భవిష్యత్తు మా చేతుల్లో పెట్టకండి.

విష్ణు : మీరేం బయపడక్కర్లేదు ఎప్పట్లాగే ప్రాజెక్టులు ఆ కంపెనీ పేరు మీదనే వస్తాయ్. నా కొత్త ఫ్యాక్టరీ ఓపెనింగుకు ఇంకా ఆరునెలలకు పైనే పడుతుంది అప్పటివరకు నేను దగ్గరుండి మీ ఇద్దరికీ నేర్పిస్తా.

ఇంకో విషయం ఏంటంటే మీ ఇద్దరికీ అన్ని పనులూ తెలుసు. కొద్ది రోజులు పార్వతికి తోడుగా లక్ష్మి ఉంటుంది. దీనికి ఒప్పుకుంటేనే మీ డబ్బు తీసుకునేది. లేదంటే మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి.

అలోచించి సోమన్న: సరే బాబు మీ ఇష్టం అలాగే కానివ్వండి. కానీ దానిమీద వచ్చే డబ్బులు మాత్రం మీరే తీసుకోవాలి.

Rich people without Money, Telugu Moral Stories, డబ్బుల్లేని ధనికులు

విష్ణు : ఎడిసినట్టే ఉంది నీ యవ్వారం. ఆమాత్రం దానికి నీకెందుకు రాసిచ్చుడు. నష్టం అనేది ఇన్నెండ్లలో నేను ఒకసారి కూడా చూడలేదు నువ్వేం దాని గురించి బయపడకు. లాభం మీకు ఖచ్చితంగా ఉంటుంది. నష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది 👍 మీరేం ఆలోచించకుండా రిజిస్ట్రేషన్ కాగితాలు ఓసారి చదువుకుని సంతకాలు పెట్టండి.

“అనుకున్నట్టే విష్ణువాళ్ళ కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యింది మంచి ప్రాజెక్టులతో బాగా నడుస్తుంది”

ఇకపోతే సోమన్న కంపెనీలో పనిచేసి మానేసిన పాత వాళ్ళను అందరిని పిలిచి

వాళ్లకు సూపర్వైజర్గా మళ్ళీ శ్రీనివాసునే పెట్టేసి బాగానే పనులు తెచ్చుకుని చేసుకుంటున్నాడు. పక్కనే స్థలం అమ్ముతుంటే తీసుకుని ఇంకొన్ని కొత్త మిషన్లు కొని కంపెనీని నాలుగింతలు పెద్దది చేసేసి,ఊర్లో అమ్మేసిన అదే భూమిని కొనుక్కున్నాడు.

విష్ణు ఇచ్చిన సలహాతో ఒక మంచి “జ్ఞానా” లాంటి సేల్స్ మేనేజర్ని పెట్టుకుని 😆😜.ఆరు ప్రాజెక్టులు ముప్పైఆరు చెక్కులతో కళకళలాడుతుండగా..!

“ఊర్లో నుంచి శాస్త్రి గారి ఫోన్”

శాస్త్రి : సోమన్న ఎలా ఉన్నావ్రా..?

సోమన్న : అయ్యా..! బావున్నాను, మీరెలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు..?

శాస్త్రి : అందరూ బావున్నార్రా, చదువులు అయిపోయాయి, అమెరికా వెళ్ళిపోయాక రావటమే తగ్గించేశారు, అన్నట్టు ఓ సాయం కావాలి, మాకు తెలిసిన ఒక సన్నకారు రైతు కుటుంభం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకేమైనా పనిపిస్తావేమోనని ఫోన్ చేశా ఏమంటావ్..!

సోమన్న : నేను చూసుకుంటాను పంపడయ్యా,

శాస్త్రి : సంతోషం సోమన్నా.. ! ఒప్పుకుంటావో లేదో అనుకున్నా..!

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

సోమన్న : ఆరోజు మీరు మీ బాబుకు చెప్పి నన్ను ఇక్కడికి పంపకపోతే ఎలా ఉండేవాళ్ళమో కదా, వాళ్ళిచ్చిన ధైర్యంతోనే బస్సెక్కాo ఇవాళ ఇలా ఉన్నామంటే కారణం మీ కుటుంబమేగా అదీకాక మీరు చెప్పాక కాదని ఎలా అనగలను.!

వాళ్లను జాగర్తగా చూసుకునే బాధ్యత నాది, ఫోన్ నెంబర్ రాసిచ్చి ఆదివారం రమ్మనండి ఇంటిదగ్గరే ఉంటాను..!

Rich people without Money, Telugu Moral Stories, డబ్బుల్లేని ధనికులు

సోమన్న గారాండీ…!!

శాస్త్రి గారు మీ నెంబర్ ఇచ్చారు..!!!

మేమిక్కడ అంబేత్కర్ బొమ్మ దగ్గరున్నం..!!!!

పక్కన టీ బండి ఉంది..!!!!!

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

టీ బండాయనకి ఇవ్వనా, ఓసారి మాట్లాడుతారా అడ్రస్ చెప్తాడు.

నవ్వుతూ..!

“వద్దులే నాకు ఆ అడ్రస్ బాగా తెలుసు..! అక్కడే ఉండండి వస్తున్నాను.!”

సర్వేజనా సుఖినోభవంతు…!! 🙏🏻

“శుభం”

ఇట్లు

మీ జ్ఞానా చారి.

మేనేజర్ సేల్స్ & మార్కెటింగ్

సోమన్నా గ్రూప్ అఫ్ కంపెనీస్ 😜🤣

“Images source google mom”

School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

Spread iiQ8

February 23, 2023 4:03 PM

165 total views, 0 today