Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)

Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)

ఉపవాసము – దాని ప్రాముఖ్యత (Fasting and its Virtues)
సియాం :
ధార్మికపరమైన అర్థము (తర్క తాత్పర్యం):  వేకువ ఝాము నుండి (ఫజ్ర్ అదాన్ కు కొంచెం ముందు నుండి) సూర్యుడు అస్తమించే వరకు (మగ్రిబ్ అదాన్ వరకు) తినడం, త్రాగడం మరియు భార్యతో కలవడంనుండి ఆగి ఉండుట.
అల్లాహ్ సియాంని విధిగావించెను:
“ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసాలు (సియామ్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా నైతే మీకు పూర్వం వారిపై కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.”
“ఖుర్’ఆన్ రమదాన్ నెలలో అవతరించబడింది. మానవులందరికీ మార్గదర్శకం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్ఠమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇకనుండి రమదాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా ఉపవాసం ఉండాలి.” (2:185)

Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)

బుఖారీ – ముస్లిం హదీథ్ గ్రంథాలు : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు:
”ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది 1). ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, 2) సలాహ్ ని స్థాపించుట, 3) జకాహ్ (విధి దానం) చెల్లించుట, 4) హజ్ చేయుట, 5) రమదాన్ నెల ఉపవాసములు ఉండుట.”
ఉపవాసము ఉండుట వలన కలిగే లాభములు:
ఎన్నో విశ్వాసపు లాభములు మరియు ఆరోగ్య లాభములు కలవు.
1. చెడు అలవాట్లనుండి దూరం కాగలము. దైవ భక్తి పెంపొందును.
2. పరలోక భీతి
3. సహనం ఓపిక పెంపొందుట
4. బీదలపై కరుణాకటాక్షాలు పెరిగి, మానవత్వ ఏకీభావం పెంపొందుట.
5. అతిగా భుజించడాన్ని తగ్గించి, జీర్ణశక్తి పెంపొందును.
6. అల్లాహ్ యొక్క భయభక్తులు పెంపొందును.
బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
“ఉపవాసము నరకమునుండి రక్షించు ఢాలు.”
బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:

Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues) Google bans dozens of Muslim prayer apps, iiQ8 info


Ramadan Mubarak! ,100 Ramadan Wishes and Greetings to Honor the Holy Month

అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖన “ఎవరైతే రమదాన్ యొక్క ఉపవాసాలు అల్లాహ్ స్వీకరణ కొరకు మాత్రమే పాటించారో అతని మునుపటి పాపాలన్నీ క్షమించబడును” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఉద్బొధించారు” Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)
బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బొధించారు: “ఎవరైతే రమదాన్ నెలలో ఖియాం చేసారో (అంటే తరావీహ్ గానీ తహజ్జుద్ గాని చదివారో) అల్లాహ్ యొక్క స్వీకరణ యొక్క సంకల్పంతోనే వారి మునుపటి పాపములు క్షమించబడును.”
బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు: “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న యెడల అతను భార్యతో కలువరాదు, తప్పుడు మాటలు పలుకరాదు, ఎవరైన వచ్చి అతనిని తిట్టినా, పోట్లాడినా అతనితో “నేను ఉపవాసము ఉన్నాను” అని చెప్పి తప్పించుకోవాలి. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఆయన (అల్లాహ్) సాక్షిగా, ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహ్ దగ్గర కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది. ఉపవాసి రెండు సౌఖ్యాలు పొందుతాడు. ఒక సౌఖ్యం ఇఫ్తార్ సమయంలో పొందుతాడు, రెండవది తన ప్రభువును కలుసుకున్నపుడు.”
బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “రమదాన్ మాసపు ప్రారంభముతో స్వర్గ ద్వారములన్నీ తెరువబడును.”
రమదాన్ నెల ప్రారంభమును తెలుసుకునే విధానము :
రమదాన్ మాసపు క్రొత్త నెలవంకను చూడటం, లేదా ఎవరైనా చూసిన వ్యక్తి సాక్ష్యం పలకటం ద్వారా రమదాన్ మాసము ప్రారంభమగును.  (సూరా 2:185)
 “ఎవరైతే రమదాన్ మాసాన్ని పొందుతారో, వారు ఉపవాసం ఉండాలి.” (2:185)
Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)
బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “రమదాన్ మాసపు ఉపవాసములు నెలవంకను చూసి ప్రారంభించండి, మరియు వేరే మాసపు నెలవంకను చూసిన తరువాత విరమించుకండి.”
ముస్లిం హదీసు హదీథ్ గ్రంథం:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “ఆకాశములో మేఘాలు కమ్ముకుని ఉండి మీకు నెలవంక కానరాని యెడల మాసపు 30 రోజులు పూర్తి చేయండి.”(ఇది షాబాన్ మరియు రమదాన్ నెలలకు వర్తిస్తుంది)
రమదాన్ మాసము పూర్తి అగుటకు 30 రోజులైనా పూర్తి అవ్వాలి లేదా 29 రోజుల తరువాత కొత్త నెలవంకనైనా చూడాలి, లేదా కనీసం ఇద్దరు సత్యవంతులైన ముస్లింలు చంద్రుడిని స్పష్టంగా చూచినట్లు సాక్ష్యం అయినా ఇవ్వాలి.
Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)

అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా
Ramadan Ramzan Fasting, ఉపవాసము – దాని ప్రాముఖ్యత, (Fasting and its Virtues)
Spread iiQ8

June 27, 2015 5:23 PM

702 total views, 1 today