Ashwamedha Yaagam, అశ్వమేధ యాగం !

అశ్వమేధ యాగం ! Ashwamedha Yaagam !

శంకర్ చౌదరి అనే మిత్రుడు అశ్వమేధ యాగం గురించి తెలియజేయమని కోరాడు.
అశ్వమేధ యాగం….

Ashwamedha Yaagam,  అశ్వమేధ యాగం !



అశ్వమేధ యాగం వేద కాలంనుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. ఈ యాగము వివరముగా యజుర్వేదము లో చెప్పబడినది. ఋగ్వేదములో గుర్రపు బలి గురించి శ్లోకాలలో కొంత ప్రస్తావన ఉన్నా… యజుర్వేదములో చెప్పినంత వివరముగా చెప్పబడిలేదు.

గాయత్రీ పరివార్ 1991 నాటి నుండి జంతు బలి లేకుండా, అశ్వ మేధ యజ్ణాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు.



వేద కాలం నాటి యాగం….!

అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశ్యం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృడంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. 

ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగడనికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వము శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు.
గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందులనుండి కాపాడడానికి తోడుగా రాజ కుమారులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ణ యాగాదులు జరుపుతారు.

గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్నిపఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ మరియు తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణీ ముందు కాళ్ళను, పరిచారికలు కడుపు భాగాన్ని, వెనుక కాళ్ళను అభ్యంగనమాచరిస్తారు. అశ్వము తల, మెడ, తొకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు.

ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములులేని మగ మేకను, ఒక గోమృగాన్ని(అడవి బర్రె)ని అగ్ని గుండానికి దగ్గరగా బలి పీఠానికి కట్టి వేస్తారు. ఇంకా 17 జంతువులను గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు మరియు అడవి జంతువులను (ఒక వ్యాఖ్యాత ప్రకారం మొత్తం 609 జంతువులు) వేర్వేరు బలి పీఠాలకు కట్టి వేస్తారు.
అప్పుడు ఆ గుర్రాన్ని బలి ఇస్తారు..!

ముగ్గురు రాణులు ఒక వంద బంగారు, వెండి, రాగి సూదులతో గుర్రపు శరీరం పై కోయవలసిన భాగాలపై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్ళకు నైవేద్యంగా స్వాహా అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వ స్తుతితో యాగం ముగుస్తుంది.

లిఖిత చరిత్ర లో అశ్వమేధ యాగ నిర్వహణ రెండవ చంద్రగుప్త మౌర్యుని తండ్రి మొదటి సముద్ర గుప్తుని హయాంలో జరిగింది. అశ్వమేధ యాగానికి గుర్తుగా ప్రత్యేక నాణాలను పోత పోయించాడు.

 

నిర్వహణ విజయవంతమైన తర్వాత ఈతనికి మహారాజాధిరాజ బిరుదు లభించింది. ఆ తర్వాతి నిర్వహణలు చాలా తక్కువ. 12 వ శతాబ్ధంలో కన్నౌజ్ రాజా అశ్వమేధాన్ని తల పెట్టిన, దానిని పృథ్వీరాజ్ చౌహాన్ భంగము చేసి ఆ తర్వాత కన్నౌజ్ రాజు కూతురుని పెండ్లియాడాడు.

Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

 

అశ్వమేధ యాగ సంధర్బంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడు – రజ్మ్‌నామా నుండి ఒక దృశ్యం !

కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు, అశ్వమేధం నిర్వహించి, పురుషత్వాన్ని తిరిగి పొందాడు.

శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడై అశ్వమేధ యాగాన్ని నిర్వహించారు.

Rama was crowned at Ayodhya and performed the Ashvamedha Yaga, after the slaying of Ravana,
Spread iiQ8

April 14, 2015 8:27 PM

737 total views, 0 today