General doubts Telugu అయిదో తనమంటే ?
అయిదో తనమంటే ?
అయిదో తనమంటేముత్తయిదువ అని అర్థం.
పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం.
స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.
స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకున్డరాదు?
దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది.
తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు కూడా ఆహ్వానమే.
దీనికి ఉదాహరణే రామాయణంలో దితి జుట్టుని విరబోసుకొని, బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకి వంగి, జుట్టు పాదాలకి తగిలి సౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే.
వృత్తాంతం:
ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అను మహర్షి తనమన భేదాలు లేకుండా దేవతలకి ఇచ్చే హవిస్సులలో కొంతభాగం రాక్షసులకు ఇస్తున్నాడనే విషయం తెలుసుకొన్న ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ మరచి తన చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను(సురాపానం, సోమపానం,అన్నం తింటున్న శిరస్సు) నరికి వేస్తాడు.
అనంతరం సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్ట(తీతువు పిట్ట)గా మారిపోయాయి. ఆ మూడు పక్షులు ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు.
భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాలయందు కొద్దిపాళ్ళు ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం. అందుకని కేవలం స్త్రీలకు మాత్రమే జుట్టు విరబోసుకు తిరగడం నిషిద్ధం.
స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు, మూర్తులలో ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?
ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము. సత్వ,రజో,తమో (స్త్రీ)గుణములు ఆమె యందు ఉండవు. అమ్మవారు కామారి(కామాన్ని హరించేది). కాబట్టి స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు.
అందుచేత ఛాందస్సవాదులు ఇటువంటి ప్రశ్నలని కట్టిపెట్టి శాస్త్రాల్ని అనుసరించండి మంచిది.
భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు:
జడ వేసుకొని ఆలయ దర్శనం చేయుట
సిగలో(తలలో) పుష్పములను ధరించుట
వృద్ధ మహిళలు సాంప్రదాయంగా కొప్పును వేసుకొనుట
గమనిక: పై సమాచారం కేవలం శాస్త్రంలో చెప్పిన విషయాలను ప్రస్తావన చేసే ప్రయత్నం మాత్రమే. ఎవరిని విమర్శించి, వారి ఇష్టాయిష్టములను తిరస్కరించుట కొరకు కాదని మనవి.
ధర్మ, న్యాయ శాస్త్రాల్లో గర్భ స్రావం :
కాబట్టి దానికి కారణమైన మగవానికి నాలుగు రెట్లు పాపాము.
Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021
Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE