Kauravulu Kedaareswarudu Kaikeyi kuberudu, కౌరవులు, కేదారేశ్వరుడు

Kauravulu Kedaareswarudu Kaikeyi kuberudu, కౌరవులు, కేదారేశ్వరుడు
 
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు –..
 
Kauravulu : కౌరవులు —
కురువంశరాజులు . మహాభారతం లో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.
 
Kedaareswarudu : కేదారేశ్వరుడు –
శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ – మందాకినీ నదీ సమీపంలో ఉన్నది , మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.

 
Kaikeyi : కైకేయి —
అశ్వపతి కూతురు . దశరధమహారాజు ముడో భార్య . భరతుని తల్లి .
 
Kuberudu : కుబేరుడు —
హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.

 

 
Kumbhakarna : కుంభకర్ణుడు —
రామాయణం కావ్యంలో రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు.
అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు కైకసికి అసురసంధ్యవేళలొ సంభోగం వల్ల జన్మించిన సంతానం.
ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు”.



Spread iiQ8

May 2, 2015 7:46 PM

341 total views, 0 today