Revathi Rukmini Rushyam Sambudu, రేవతి, రుక్మిణి,ఋష్యమూకము, శక్తి

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా
Revathi Rukmini Rushyam Sambudu, రేవతి, రుక్మిణి,ఋష్యమూకము, శక్తి
 
 
 Revathi : రేవతి —
ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య , భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ .
 
Rukmini : రుక్మిణి –
రుక్మము(బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యల లొ పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు.
రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందము లొ వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజు కి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు.
వీరికి రుక్మిణీ అనే సోదరి ఉన్నది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు .
 
RushyamUkamu : ఋష్యమూకము —
అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ .
తన తల వేయి ముక్కలవును అనే ముని శాపము తో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు .
 

Shakti : శక్తి —
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు.
భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది.
వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
 
Sambudu : సాంబుడు —
జాంబవతి , శ్రీక్రిష్ణులకు జన్మించిన కుమారుడు .


Spread iiQ8

May 3, 2015 6:52 PM

252 total views, 0 today