పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం), Purushothama Prapthi Yogam

పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం) 

Purushothama prapti yogam telugu bhagavad gita 
 
పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం)

శ్రీకృష్ణుడు:
 
వ్రేళ్ళు పైకీ , కొమ్మలు దిగువకూ ఉన్నదీ,వేద అనువాకాలే ఆకులు కలదీ ఐన అశ్వత్థవృక్షం ఒక్కటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసినవాడే వేదవిదుడని తెలుసుకో.
 
దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళు గా కల్గి, క్రిందికీ మీదికీ వ్యాపించి ఉన్నాయి. కాని మనుష్య లోకంలో కర్మానుబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి.

సంసారం లోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఈ సంసారవృక్షాన్ని మూలం తో పాటు వైరాగ్యంతోనే ఛేదించాలి. దేనిని పొందితే తిరిగి సంసారం లోనికి రామో ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి.
బ్రహ్మజ్ఞానులై దురహంకారం,చెడుస్నేహాలు, చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు.


చంద్ర, సూర్య,అగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరో, దేనిని పొందితే తిరిగి రానక్కరలేదో అలాంటి స్వయంప్రకాశమైనదే నా పరమపదం. నా పురాతన అంశయే జీవుడుగా మారి,జ్ఞానేంద్రియాలను మనసుగ్నూ ఆకర్షిస్తున్నారు. గాలి సువాసన తీసుకుపోయేట్లు జీవుడు కొత్త శరీరం పొందేటప్పుడు పూర్వశరీర భావాలను తీసుకెలుతున్నాడు.

Gita 06

 

మనసు సహాయంతో ఇంద్రియ విషయాలను జీవుడు అనుభవిస్తున్నాడు.

జీవుడి దేహాన్ని త్యజించడం, గుణప్రభావం చే మరో కొత్త దేహాన్ని పొందడం మూర్ఖులు తెలుసుకోలేరు.జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు.

ఆత్మానుభవం చేత తమ బుద్ధిలో దీనిని చూడగలుతారు.కాని చిత్తశుద్ది లేని సాధన చేత కనిపించదు. సూర్య,చంద్ర,అగ్నుల తేజస్సు నాదే.

నా శక్తి చే, నేనే భూమియందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను.రసస్వరూపుడైన చంద్రూడినై అన్ని సస్యాలను పోషిస్తున్నాను. జీవుల జఠరాగ్ని స్వరూపంతో అవి తినే నాలుగురకాల ఆహారాలను ప్రాణ, అపాన వాయువులతో కూడి నేనే జీర్ణం చేస్తున్నాను.

నేనే అందరి అంతరాత్మను. జ్ఞాపకం, జ్ఞానం, మరుపు నావలనే కలుగుతున్నాయి. నేనే వేదవేద్యుడను, వేదాంతకర్తను, వేదవేత్తనూ కూడా అయి ఉన్నాను. 

క్షర,అక్షర అని రెండు రకాలు.ప్రపంచభూతాలన్నీ క్షరులనీ,కూటస్థుడైన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు.

వీరిద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.అతడే మూడు లోకాలను పోషిస్తోన్న అక్షయుడూ,నాశనం లేనివాడు.



 

అందువలనే పరమాత్మ వేదాలలో పురుషోత్తమునిగా కీర్తింపబడ్డాడు. భ్రాంతిని వదిలి,నన్నే పరమాత్మగా తెలుసుకొన్నవాడు సర్వజ్ఞుడై,అన్నివిధాలా నన్నే సేవిస్తాడు.
 
అర్జునా!అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీ నిమిత్తమై చెప్పాను.దీనిని గ్రహించినవాడు జ్ఞానియై,కృతార్థుడవుతాడు.
Spread iiQ8

September 25, 2015 1:41 PM

1016 total views, 1 today