అది ఒక మారుమూల గ్రామం. అక్కడ నుండి పట్నం వెళ్ళాలంటే ఎన్ని రోజులైనా కాలి నడకన పోవల్సిందే మరి! అలాంటి మారుమూల గ్రామంలో ఉండేవాడు అంజి.
చిన్నతనం లోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటినుండీ తినటానికి తిండి లేక, బ్రతుకు బండిని తోసుకు పోలేక అతను నానా కష్టాలు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పవన్ అనే పిల్లవాడు పరిచయం అయ్యాడు.
అంజి వేసుకునేందుకు బట్టలు, తినేందుకు ఆహారం, స్కూలు ఫీజులకు డబ్బులు- ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాడు. పవన్ వాళ్ళ అమ్మ-నాన్న కూడా దీనికి అడ్డుచెప్పలేదు. పవన్ చేసే మంచి పనులను వాళ్ళూ ప్రోత్సహించేవాళ్లు.
మొదట్లో ఆ సంగతిని అంజి కూడా పట్టించుకోలేదు. అయితే చెడు స్నేహాలు మప్పిన వాళ్ళంతా రాను రాను ముఖం చాటు చేశారు. దొంగతనాలు తనకు తిండి పెట్టవని అంజికి త్వరలోనే తెలిసి వచ్చింది.
కానీ ఇప్పుడు ఆ సంగతిని గుర్తించీ ఏమి ప్రయోజనం?
పవన్‌కి ముఖం చూపించాలంటే కూడా సిగ్గు వేసింది అంజికి. దాంతోబాటు తిండి తిప్పలకూ కష్టమైంది మళ్ళీ. అందుకని అంజి ఆ ఊరిని వదిలి, దగ్గరలోనే ఉన్న మరో ఊరికి వలస వెళ్ళిపోయాడు. అతని అదృష్టంకొద్దీ ఆ ఊళ్ళో ప్రభుత్వ బడి, ప్రభుత్వ వసతి గృహం చక్కగా పనిచేసేవి! అట్లా అంజికి చదువుకునేందుకు కనీస వసతులు లభించాయి.
దురలవాట్లనుండి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు గనక, ఇప్పుడు అతను మానసికంగా గట్టి పడ్డాడు కూడాను. దాంతో అంతవరకూ బయటపడని అతని తెలివి తేటలు బయటపడటమూ మొదలైంది! సంవత్సరం తిరిగే సరికి, ఆ ఊళ్ళో అందరిలోకీ చక్కగా చదివే పిల్లవాడుగా పేరు తెచ్చుకున్నాడు అంజి.
పదవ తరగతిలో మంచిమార్కులతో పాసైన అంజికి పై చదువులు ఉచితంగా చదువుకునేందుకు తగిన స్కాలర్షిప్పులు దొరికాయి.
ఇక అతను ఆ పైన దేశం మొత్తానికీ పేరెన్నిక గన్న విశ్వవిద్యాలయాల్లో చదివి, గొప్ప అర్హతలు సంపాదించు-కున్నాడు. చివరికి అంజి, తన చిరకాల స్వప్నమైన ఐఏఎస్‌ను సాధించగలిగాడు కూడా. అలా తను పుట్టిన జిల్లాకే అంజి కలెక్టరుగా వచ్చాడు.
బాధ్యతలు చేపట్టిన కొన్ని నాళ్ళకు అంజి ‘త్రాగునీటి సౌకర్యం’ కార్యక్రమం సందర్భంగా తను పుట్టిన ఊరికి వెళ్ళాడు. గ్రామంలోని ప్రజలంతా అతన్ని చూసి “ఓరి ఓరి! ఎంత పెద్దోడివైనావు” అన్నారు సంతోషంగా. కానీ అంజి కళ్ళు మాత్రం పవన్ కోసం వెతికాయి. ఎక్కడా పవన్ జాడలేదు! చివరికి ఉండబట్టలేక, కలెక్టరు గారు అంజిని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
అక్కడ పవన్ కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అంజి వెళ్ళి అతన్ని ఆప్యాయంగా పలకరించి, “నువ్వెందుకు, ఇంకా నన్ను శిక్షిస్తున్నావు? నేను ఆనాటి చెడ్డ అంజిని కాదు. నువ్వు నన్ను విడచిన కొన్నాళ్ళకే నా కళ్ళు తెరచుకున్నాయి. అప్పటినుండీ నీ చలవ వల్ల, మంచి మార్గంలోనే నడిచాను.
నువ్వు మంచి సామాజిక కార్యకర్తవని విన్నాను- ఇప్పటికైనా, నీకు అభ్యంతరం లేకపోతే, మనం కలసి పనిచేద్దాం. మన దేశంలో పేదరికం అన్నదే లేకుండా చేద్దాం. మన గ్రామం నుండే మన పనిని ప్రారంభిద్దాం ” అన్నాడు.
PACI Website – Civil ID Appointment
Digital Civil ID – How to Install in Mobile