Husbands and wives to be reciprocal – భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండటానికి.
భార్యా భర్తలు తరచూ పోట్లాడుకుంటున్న, అన్యోన్యత లోపించినా ఆ ఇల్లు నరకంలా ఉంటుంది. పరస్పరం అన్యోన్యంగా ఉండకపోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు.
మారుతున్న జీవన శైలి, కాలంతో పరిగెత్తడం, ఇద్దరూ ఉద్యోగం చేయడం ఇలా అనేక రకాలు ….
పెళ్ళిలో పురోహితుడు అరుంధతిని చూపించి సృష్టిలో అందరికన్నా అన్యోన్యంగా ఉండేవారు అరుంధతీ వసిష్ఠులు, వారిలా మీరూ అన్యోన్యంగా ఉండాలని చెప్తారు. కానీ వివాహం అయిన దంపతుల మధ్య కొంత కాలానికే భేదాభిప్రాయాలు రావడం, ఒకరినొకరు అర్ధం చేసుకోక పోవడం జరుగుతున్నాయి. ఫలితంగా విడాకులు …..
ఇలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఈ క్రింది మంత్రాన్ని శ్రద్ధగా ప్రతి రోజు 1008 సార్లు ( 40 రోజులు) జపిస్తే అపోహలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది.
శ్లో!! ఓం హరివల్లభాయై విష్ణు మనోనుకూలాయై !
దివ్యాయై సౌభాగ్యదాయిన్యై ప్రసీదప్రసీద నమః !!
విధానం.
ప్రతి రోజు ఉదయం 5.30 కు లక్ష్మీనారాయనుల చిత్రపటం ముందు ఆవు నేతితో దీపారాధన చేసి, తులసీ దళములతో అర్చించి యధా శక్తి నైవేద్యం సమర్పించి జపం ప్రారంభించాలి.
శ్రద్ధా భక్తీ లోపం జరుగకుండా చూసుకోవాలి.
జై హింద్.
Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE
Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care