Vidhata Talapuna Song Lyrics, Sirivennela Movie,విధాత తలపున Song
Vidhata Talapuna Song Lyrics penned by Sirivennela Seetharama Sastry from the Telugu cinema ‘Sirivennela‘, music composed by KV Mahadevan and sung by S P Balu & Susheela.
Vidhatha Thalapuna Song Credits
Sirivennela Movie Released Date – 20 May 1986 | |
Director | K Viswanath |
Producers | Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, Ujjuri Chinaveerraju |
Singers | S P Balasubramanyam, Suseela |
Music | KV Mahadevan |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena |
Video Source |
విధాత తలపున Song Lyrics in Telugu:
Jajimogulali Song Lyrics, Rudrangi Movie, జాజిమొగులాలి
విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం… ఓ ఓ ఓం
ప్రాణనాడులకు స్పందననొసగిన
ఆది ప్రణవనాదం…ఓ ఓ ఓం
కనుల కొలనులొ ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం
ఊఊ ఊ ఊఊఊ… ఆఆ ఆ ఆఆ
సరసస్వర సుర ఝరీగమనమౌ
సామవేద సారమిది
సరసస్వర సురఝరీగమనమౌ
సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం… ఈ గీతం
విరించినై విరచించితిని… ఈ కవనం
విపంచినై వినిపించితిని… ఈ గీతం
ప్రాగ్దిశ వీణియ పైన
దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైన
ప్రాగ్దిశ వీణియ పైన
దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల
స్వరగతి జగతికి శ్రీకారము కాగ
విశ్వకార్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని… ఈ కవనం
విపంచినై వినిపించితిని… ఈ గీతం
జనించు ప్రతి శిశు గళమున
పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున
పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున
అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని… ఈ కవనం
విపంచినై వినిపించితిని… ఈ గీతం
నా ఉచ్చ్వాసం కవనం… నా నిశ్వాసం గానం
నా ఉచ్చ్వాసం కవనం… నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం… ఈ గీతం
Chittigumma Padave Song Lyrics, Tholi Muddhu Movie చిట్టిగుమ్మ పదవే Song