పాలు త్రాగని పిల్లి 5 (Tenali Ramakrishna stories in Telugu)
Greetings of the day! Here we will read Tenali Ramakrishna stories in Telugu.
విజయనగర సామ్రాజ్యంలో నివాసిస్తున్న ప్రజలకు ఒకనాడు ఒక గడ్డు సమస్య వచ్చిపడింది. నగరంలో ఎలుకల బెడద ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఎలుకలు ఇండ్లలోని ఆహారపదార్ధలను మరియు ధాన్యం బస్తాలను నాశనం చేయసాగినవి.ఈ సమస్య నుంచి ఎలా అయిన బయటపడాలని ఆలోచించిన ప్రభుత్వం నగరంలోని ప్రజలకు పిల్లులను పెంచమని చెప్పింది. రాయల వారు కూడా తమ ఆస్థానంలోని ఉద్యోగులకు మరియు కవులకు పిల్లులను ఉచితంగా ఇచ్చి పెంచమని చెప్పెను.
పిల్లులను పెంచదానికి అవసరమయ్యే పాలు కోసం ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ఆవును కూడా ఇచ్చెను. ఇలా ఆస్థానంలో ఉన్న ఉద్యోగులందరికి ఒక పిల్లిని మరియు దాని పోషణ కోసం ఒక ఆవును పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను.
అలా ఆస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు కూడా ఒక్క పిల్లిని మరియు ఒక ఆవుని పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను. అందరి కవులతో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక ఆవు మరియు ఒక పిల్లిని పెంచమని అప్పగించెను.
Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు
రామకృష్ణుడు పిల్లికి సరిగా పాలు త్రాగించక, తిండి పెట్టక, ఆవు ఇచ్చిన పాలను తమ కుటుంబ అవసరాలకు వినియోగించసాగేను. కొన్నాళ్ళకు సరైన ఆహారం లేక పిల్లి బక్కచిక్కి పోయింది . దాని ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పిల్లి రాత్రంతా మేల్కొని రామకృష్ణుడి ఇంట్లో ఉన్న ఎలుకాలనే కాక అతని ఇంటి చుట్టుపక్కన ఇళ్ళలో ఉన్న ఎలుకలను కూడా తినేస్తూ వచ్చింది.
అందు వల్ల రామ కృష్ణుడు ఇంట్లో గాని మరియు రామకృష్ణుడు ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ ఒక్క ఎలుక కూడా కనిపించేది కాదు. కొన్నాళ్ళకి ఆ ప్రాంతంలో ఒక్క ఎలుక కూడా కనిపించకుండా పోవడంతో ఆ పిల్లకి తినుటకు ఆహారం లేక బక్కచిక్కి పోయి నడవలేని పరిస్థితుల్లోకి వచ్చింది.
Tenali Ramakrishna stories in Telugu
ఒక రోజు కృష్ణదేవరాయలగారు తమ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కవులకు ఇచ్చిన పిల్లులను ఎవరైతే బాగా పెంచారో వారికి తగిన బహుమతి ఇచ్చి సత్కరింపబడును అని ప్రకటించారు. పిల్లులను పెంచుతున్న వారంతా పౌర్ణమి నాటికి తమ పిల్లులను తీసుకొని రాయలవారి ఆస్థానానికి రావలసిందిగా ఆజ్ఞాపించింది ప్రభుత్వం.
MAHABHARATA Day 2 | Episode 2 – Bhishma’s Arrogance |
ఈ ప్రకటనను విన్న రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు.” ఆవు ఇచ్చిన పాలను నేను నా కుటుంబ సభ్యులు హాయిగా తాగేశాము.ఈ పిల్లకి ఒక్క రోజు కూడా పాలు పోయాలేదు. ఈ పిల్లి ఇప్పుడు ఆకలికి అలమటిస్తూ బక్కచిక్కి పోయి చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగ్గా పెంచలేదని రాయలవారు నన్ను శిక్షించవచ్చు, జరిమానా కూడా విధించవచ్చు.
పౌర్ణమికి ఇంకా వారం ఉన్నది , ఈ లోగా ఈ గండం నుంచి ఎలాగైనా బయట పడాలి అని రామకృష్ణుడు ఆలోచించసాగేను.
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
చాలాసేపు ఆలోచించగా రామకృష్ణునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన భార్యకు ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకురమ్మని చెప్పను. చెప్పిన విధంగానే ఆమె ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొని వచ్చింది .రామకృష్ణుడు ఆ పాల గిన్నె ఒక చోట పెట్టి పిల్లిని తీసుకువచ్చి ఆ పాలు తాగించాలి అని ప్రయత్నించ సాగెను.
పాలును చూసిన వెంటనే పిల్లి ఎంతో ఆనందంతో తాగడానికి ముందుకు వచ్చింది. పాలు వేడి వేడిగా ఉండడం వలన పిల్లి మూతి కాలిపోయి అక్కడనుంచి అరుస్తూ పారిపోయింది.దానిని మళ్లీ తీసుకువచ్చి పాల దగ్గర విడిచిపెట్టెను ,ఎంత ప్రయత్నించినా ఆ పిల్లి పాలు తాగుటకు ఇష్టపడలేదు .ఆ విధంగా దాని చేత ఆ పాలు త్రాగించుటకు ప్రయత్నించేను. మొత్తానికి ఆ పిల్ల పాలు మాత్రం త్రాగలేదు.
అది పాలను చూసి ముఖం తిప్పుకుని రామకృష్ణుని నుండి తప్పించుకునుటకు ప్రయత్నించింది . ఇదంతా చూసిన రామకృష్ణుడు తన పన్నాగం పనిచేసిందని ఎంతో సంతోషించి, హామయ్య …..!గండం తప్పింది అనుకొని గట్టిగా గాలి పీల్చుకున్నాడు.
రాయలవారు చెప్పినా పౌర్ణమి రోజు రానే వచ్చింది. అందరూ తమ పిల్లులను తీసుకుని సభలో హాజరు అయ్యారు. ఒక పిల్లి కంటే ఇంకొక పిల్లి బాగా బలిసి అడుగు తీసి అడుగు పెట్టే లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎలుక కనబడినా సరే పరుగెత్తి పట్టుకోలేనంత లావుగా ఉన్నాయి. ఆ సమయంలో రామకృష్ణుడి దగ్గర ఉన్న పిల్లి కుంగి కృశించి , బక్కచిక్కి పోయి రేపోమాపో చనిపోయేలా ఉండటాన్ని గమనిస్తారు రాయులవారు.
ఆ పిల్లి ని చూడగానే శ్రీ కృష్ణదేవరాయల కి కోపం వచ్చింది మరియు ఆశ్చర్యం కూడా కలిగింది . రామకృష్ణ కవి ..! మీ పిల్లి ఇంత బలహీన పడిపోవడానికి కారణం ఏమిటి …?ఇది ఇంతగా బక్కచిక్కి పోయి రేపోమాపో చచ్చేలా ఉంది .మేము ఇచ్చిన ఆవుపాలను నీవు దీనికి తాగించలేదా..? అని అడుగగా.
రామకృష్ణుడు వినయంగా” మహాప్రభు…! ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు , ఈ పిల్లి అసలు పాలను ముట్టదు,కొంచెం పప్పు అన్నం తింటుంది .ఎప్పుడూ దీని దృష్టి ఎలుకలు మీదే ఉంటుంది. దీని పుణ్యమా అని మా ఇంట్లో మా చుట్టుపక్కల ఒక్క ఎలుక కూడా లేదు కావున మేము అందరం హాయిగా నివసిస్తున్నాము”.
రామకృష్ణుడి మాటలు విని ఆ సభలో ఉన్న మంత్రులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. రాయలవారు ఆయన మాటలు నమ్మకుండా ఒక భటుడుని పిలిచి ఒక గిన్నెలో పాలు తెప్పించి ఒక చోట పెట్టి రామకృష్ణుడి పిల్లి తో పాలను తాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకున్న పిల్లిని తీసుకుని వెళ్లి పాల ముందు నిలబెట్టారు. అది పాలు చూడగానే వెనుకకు పరిగెత్తసాగింది . అది చూచి అందరూ ఆశ్చర్య పడసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమేనని అంతా నమ్మారు.
కానీ రాయల వారికి మాత్రం ఈ విషయం కొంచెం వింతగానే తోచింది. లోకంలో ఎక్కడైనా పాలు త్రాగని పిల్లి ఉంటుందా..? రామకృష్ణుడు ఏదో కొంటె పని చేసి ఉంటాడు . అందువల్లనే ఈ పిల్లి పాలు తాగడానికి భయపడుతున్నది. అనుకొని ఆ పిల్లిని తన దగ్గరకు తెప్పించుకుని దాని నోరు పరీక్షించగా దాని మూతి కాలిన మచ్చలు కనబడతాయి.అంతేకాక పిల్లి నాలుక చివర వాతలు పడినట్లు కనిపిస్తుంది. వాటిని చూసిన రాయలవారు కోపించి ,”రామకృష్ణ కవి ..!
Swan and Owl , హంస మరియు గుడ్లగూబ , Panchatantra Telugu Friendship stories
Snake and Crows, పాము మరియు కాకులు ,Panchatantra Telugu Friendship stories
మీరు పిల్లి పాలు తాగకుండా ఏదో చమత్కారం చేసినట్లు గ్రహించాము” . మీరు నిజం చెప్తే క్షమించి విడిచి పెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా .రామకృష్ణుడు జరిగిన విషయం అంతా చెప్తాడు .
మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని మాకిస్తిరి, ఈ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాదే కాక మా ఇరుగు పొరుగుల ఇళ్ళ యందు ఎలుకల బాధ కూడా పోయినది. మీకు అనుమానం గా ఉన్నచో మీరు ఎవరినైనా పంపి మా ఇంటిలో కానీ ఇంటి పరిసరాలలో కానీ ఎక్కడైనా ఒక్క ఎలుక కనపడుతుందేమో తెలుసుకొని రమ్మనండి.
నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టడమే కాక మాకు నిత్యమూ కావాల్సిన పాలు, పెరుగు ,నెయ్యి మొదలగు వాటికి లోటు కలగకుండా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు .
నా పిల్లివలె ఇచ్చట ఉన్న ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టి చంపగలదేమో పరీక్ష పెట్టి చూడండీ. కడుపునిండా తిని బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా ..?ఇక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకుని నన్ను శిక్షించడమో, రక్షించడమో చేయడు అని చెప్పెను .
రామకృష్ణుని మాటలు విని రాయలవారు అధికంగా బలిసిన పిల్లులు తెచ్చిన వారిని విచారించగా వారి ఇళ్లలో ఇంకనూ ఎలుకల బాధ పూర్తిగా పోలేదు అని తెలుసుకుంటాడు. రామకృష్ణుని ఇంటి యందు మరియు ఇంటి పరిసరాలులో విచారించగా. తమకు ఎలుకల బెడద ఏమాత్రం లేదని వాళ్ళు తెలియజేస్తారు.
ఈ సమాధానం విన్న రాయలవారు రామకృష్ణుడు చేసిన పని మంచిదే అని తలచి రామకృష్ణుని తెలివికి మరియు సమయస్ఫూర్తికి మెచ్చుకుని అతనికి పదివేల వరహాలు బహుమతిగా ఇచ్చి పంపెను.
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Snake and Crows, పాము మరియు కాకులు ,Panchatantra Telugu Friendship stories
Greedy Fox అత్యాశ నక్క, Panchatantra Telugu Friendship stories