వర్షం – వర్షిణి – వర్ష | Varṣaṁ – Varṣiṇi – Varṣa | Telugu Lo Stories
స్వర్గం నరకం ఉన్నది ఎంత నిజమో, దేవుడు దయ్యం ఉన్నది కూడ అంతే నిజం. దేవుడు కరుణిస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది, దయ్యం కనికరిస్తే నరకం సిద్ధిస్తుంది. దేవుడు అంటే మంచితనం దయ్యం అంటే చెడు తనం. పురాణాల్లో ఇతిహాసాలు నుండి ఇప్పటి కలియుగం దాక మంచి ముందు చెడు ఎప్పుడు నిలబడలేదు.
అందమైన వనం అందులో ఆనందంగా బ్రతికే ఒక సాధువు జీవితం. అక్కడ వనంలో ఉన్న వృక్షాలను పెంచుతూ మరియు వన్యప్రాణులను కాపాడుతూ ఆ సాధువు సంతోషంగా ఉండేవాడు. సాధువు దగ్గర ఎన్ని శక్తులు ఉన్న ఎప్పుడు వాడేవారు కాదు, అక్కడ ఉన్న ఫలాల్ని తింటూ పారే కాలువల నుండి తన దాహార్తిని తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సాధువు ఒక్కరే అడవి మొత్తానికి ఉన్న మనిషి , ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటూ వనం అభివృద్ధి కోసం పరితపిస్తూ ఉండేవారు. ఒకరోజు సాధువు ఉండే అడవిలో రక్తపు మరకలతో ఉన్న అప్పుడే పుట్టిన చిన్న బాలుడిని కోతులు సాధువు దగ్గర పడేసి సాదువుకు నమస్కరించి వెళ్లిపోయాయి.
Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష
బాలుడిని చూస్తూ ఉన్న ఆ సాధువు ఏమి చేయాలో తెలియక అక్కడే ఉన్న తన కుటిరంలోకి తీసుకుని వెళ్ళి, బాలుడి శరీరం మీద ఉన్న రక్తపు మరకలు తుడిచి బాలుడి నుదిటి మీద చేయి వేసి బాలుడు ఎక్కడ నుండి వచ్చాడో తెలుసుకోవాలని మనో నేత్రంతో చూస్తున్నాడు. ఎంత చేసిన ఎంత వెతికిన ఆ బాలుడు ఎక్కడ నుండి వచ్చాడో తెలియడం లేదు ఆ సాదువుకు.
శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన పుట్టాదు అంటారు కదా, మరి ఈ బాలుడు ఎలా పుట్టాడు. నిత్యం శివుణ్ణి పూజించే నాకే పరీక్ష పెట్టావ స్వామి అని మనసులో అనుకుని బాలుడిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెట్టాడు ఆ సాధువు.
బాలుడుకి నామకరణం చేయాలి అని నిశ్చయించుకున్నాడు సాధువు దాని కోసం తనకు తెలిసిన సాదువులను తీసుకువచ్చాడు. అందరి మొహంలో ఆశ్చర్యం బాలుడిని చూడగానే దివ్యమైన బాలుడు ఈ బాలుడు లోక కళ్యాణం కోసం పుట్టాడు అని వర్ష అని నామకరణం చేశారు.
సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories
బాలుడి ఆలనాపాలనా చూసుకోవడానికి సాధువు చాలా కష్టాలు పడుతున్నాడు, దానికి తోడు వృద్ధాప్యం బాధిస్తుంది. అలా ఒక సంవత్సరం కాగానే బాలుడు చిన్ని చిన్ని అడుగులు వేయడం మొదలుపెట్టాడు, వర్ష ఎప్పుడూ ఆ కుటిరంలో తిరుగుతూ నెమళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడు. సాధువు కూడ చాల ఆనందంతో వర్ష ని కన్న కొడుకు లాగా చూసుకుంటూ వనం మొత్తం తిప్పుతూ జీవిస్తున్నాడు.
సాధువుకు వన దేవత ప్రత్యక్షమై స్వామి నువ్వు నా కోసం నా వనంలో ఉన్న జీవుల కోసం ఎంతో కష్టం చేస్తున్నావు. ఇక్కడ ఉన్న కొన్ని లక్షల వృక్షాలను నీ చేతితో నాటావు. కాని ప్రకృతి వైపరీత్యం త్వరలోనే వస్తుంది, నేను నేనుగా ఇక్కడే ఉంటాను కానీ నా వల్ల ఇక్కడ ఏ ప్రాణి బాదించకూడదు. ఇక్కడ ఉన్న వన్య ప్రాణులను ఇక్కడ నుండి దూరంగా తీసుకు వెళ్లిపోండి స్వామి, మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఇక్కడికి రండి అని వనదేవత చెప్పగానే. ఆ సమయానికి నేను బ్రతికి ఉంటానో తెలియదు కదా తల్లి ఉంటే నా దత్త పుత్రుడు వర్ష తో కలిసి వస్తా అని చెప్పగానే తదాస్తూ అని చెప్పి వనదేవత మాయం అయిపోయింది.
ఎలా అయిన ఈ విపత్తుని ఆపాలి అనుకుని ఒక మహా యజ్ఞం చేసి ఈ వనాన్ని వనంలో ఉన్న ప్రాణులను కాపాడాలి అని యజ్ఞము ప్రారంభించారు సాధువు. మహాయజ్ఞం కోసం హోమము వేసి అందులో అగ్నిని పుట్టించి వేద మంత్రాలతో వన క్షేమం కోసం మంత్రాలు చదువుతూ ఉండగా ఒక అఘోరా వచ్చి ఈ యజ్ఞం సాగదు, నువ్వు ఎంత చేసినా వృథా నీ ప్రయత్నం పక్కన పెట్టు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇవేమీ పట్టించుకోకుండా యజ్ఞము కొనసాగిస్తూ ఉన్నాడు సాధువు.
ఇంతలో వనం మొత్తం మేఘాలు గర్జిస్తున్నాయి. మేఘాలను ప్రాధేయ పడ్డాడు వర్షించవద్దు అని, మేఘాలు సాధువు మాటలు పట్టించుకోకుండా వర్షించడం మొదలు పెట్టాయి. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఈ వర్షం ఏంటి అని ఆగకుండా చేస్తున్నాడు, హోమం లో ఉన్న మంటలు మీదకు నీరు వచ్చి చేరి హోమం మొత్తం నీటితో నిండిపోయింది. వనం మొత్తం కొంచెం కొంచెం నీరు చేరుతూ వరద ప్రవాహం ముంచెత్తుతూ ఉంది. ఇక సాధువుకి ఏమి చేయాలో తెలియక వరుణ దేవుడిని ఇంతకు ఇంత అనుభవిస్తావు అని శాపం ఇచ్చి వనం నుండి మెల్లగా బయటకు వెళ్లిపోతున్నారు వర్ష ని మరియు జంతువులను తీసుకుని వనం మొత్తం వదిలి వెళ్ళిపోయాడు. వన దేవత చెప్పింది వాన దేవుడు నాశనం చేసాడు వరద ప్రవాహం తగ్గాక మళ్ళీ వనంలోకి వెళ్దాం అని వర్ష ని తనకి తెలిసిన సాధువు కు ఇచ్చి వర్ష మెడలో ఒక రుద్రాక్ష ఇచ్చి ఎప్పుడు ఇది ఈ బాబు మెడలో ఉండాలి అని పంపించేసాడు.
వనం మొత్తం సముద్రంలాగా నిండిపోయింది, నీరు ఎప్పుడు వెళ్లిపోతాయి అని ఆ సాధువు వనం చుట్టుపక్కల నివసిస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు. వర్ష ని తీసుకుని వెళ్లిన సాధువు అలా కొన్ని వందల మైళ్ళు నడుచుకుంటూ ఒక పట్నం దగ్గరకి వచ్చాడు.
ఆ పట్నంలో శివుని గుడి ఎక్కడో ఉందొ తెలుసుకుని వర్ష బాబుని గుడి మెట్ల దగ్గర కూర్చోపెట్టి అక్కడ ఉన్న ఆ గుడి పూజరికి బాబు జాగ్రత్త బాబు మెడలో ఉన్న రుద్రాక్ష ఎప్పుడు బాబు మెడలో ఉండేలా చూడండి నేను ఒక రోజులో వస్తాను అని చెప్పి సాధువు వెళ్ళిపోయాడు.
వెళ్లిన సాధువు ఎన్ని రోజులు అయిన తిరిగి రాలేదు, వర్ష బాబు పూజారి తోనే ఉన్నాడు. శివుని గుడిలో బుడి బుడి అడుగులతో తిరుగుతూ, పూజారి ఇంట్లోనే ఆ పిల్లవాడు తిరుగుతున్నాడు. బాలుని మొహంలో దివ్య కళ ఉట్టిపడుతుంది, వర్షని కన్న కొడుకు కన్నా ఎక్కువగా పూజారి చూసుకుంటున్నాడు.
ఊరికి దక్షిణాన శివుని గుడికి 200 అడుగుల దూరంలో పూజారి గారి చెల్లెలు ఇల్లు ఉంది. పూజారి గారి చెల్లెలకు పిల్లలు లేరు, పిల్లలు కావాలని తొక్కని గుడి లేదు, చేయని పూజలు లేవు. వర్ష ని పెంచుకుంటాం అని పూజారి గారి చెల్లెలు పూజారి గారిని అడిగితే ఇవ్వడానికి ఇష్టపడలేదు పూజారి గారు. వీడు నా బిడ్డ నేను ఉన్నంత కాలం నాతోనే ఉంటాడు అని ముక్కు సూటిగా చెప్పేసాడు.
వర్ష కి మూడు సంవత్సరాలు వచ్చాయి, గుడిలో వచ్చే అందరి భక్తులతో నవ్వుతూ అందరి దగ్గరకి వెళ్లేవాడు. బాబు వచ్చిన వేళా విశేషం ఏమో ఏంటో గాని శివుని గుడికి భక్తులు చాలా పెరిగారు అని పూజారి గారికి నమ్మకం కుదిరింది.
ఒకరోజు ఆ ఊరిలో జోరున వర్షం పడుతుంది, బయటకు వెళ్లిన పూజారి గారి చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు.ఒకటే వాన ఊరు మొత్తం నీటితో నిండిపోయింది. పూజారి చెల్లెలును వెతకడానికి పూజారి మరియు వారి బావ గారు కలిసి వెళ్లారు. ఊరు మొత్తం వెతికిన పూజారి చెల్లెలు కనపడడం లేదు.
వర్షం ఎక్కువగా కురవడం వలన పూజారి చెల్లెలు ఊరి మధ్యలో ఉన్న ఒక పూరి గుడిసె బయట వర్షం పడని చోట కూర్చొని ఉంది. అంతలోనే ఉరుములు మెరుపులు ఎక్కువ అయ్యాయి పూజారి చెల్లెలు ఉన్న చోట. ఆ ఉరుములు శబ్దం లో మెరుపుల అలజడిలో పూజారి చెల్లెలు కళ్ళ ముందు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. తూనీగలు ఒక సమూహంలా వచ్చి పూజారి చెల్లెలు పక్కన ఒక చిన్న ఆడ బిడ్డను వదిలి ఎగిరిపోయాయి ఆమె పక్కన వదిలేసి.
ఇంతలో పూజారి తన చెల్లెలు ఉన్న చోటుకు వచ్చాడు, తడిసి ముద్ద అయిన చెల్లెలు స్పృహ తప్పిపడిపోయింది, పక్కన ఒక చిన్న పసికందు ఉన్నది. పూజరికి ఏమి అర్థం కావడం లేదు, వర్షం తగ్గింది ఇంతలో పూజారి చెల్లెలు స్పృహలోకి వచ్చింది, ఏమిటి అని చెల్లెలును అడగకుండా ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.
పూజారి గారు మనసులో దైవాన్ని తలుచుకుని నా చెల్లెలకు బిడ్డని ఇచ్చినందుకు కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తన చెల్లెలుకి దేవుడు ప్రసాదించిన అమ్మాయికి వర్షిణి అని నామకరణం చేశారు.వర్షిణి ఇంటికి వచ్చిన వేళా విశేషం పూజారి చెల్లెలు ఇన్ని రోజులు పిల్లలు లేక మదన పడి పాడు చేసుకున్న ఆరోగ్యం కుదుట పడింది. వర్షిణి రాకతో వర్ష కి ఆడుకోవడానికి ఒక తోడు దొరికింది. ఇద్దరి పిల్లల మధ్యన పూజారి గారి ఇల్లు కళకళలాడిపోతుంది.
కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story
వర్ష ఎప్పుడూ వర్షిణితో ఉండేవాడు, ఆటలు పాటలు గుడిలో పూజలు ఇలా ఒకటేంటి అలా కాలం గడిచిపోతుంది. వర్షకి పదిహేను సంవత్సరాలు వచ్చాయి, వర్షిణికి 12 సంవత్సరాలు వచ్చాయి. ఎప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లని వీరికి ఒకసారి ఊరు మొత్తం తిరగాలి అని ఆశ పుట్టింది. ఇంట్లో వాళ్ళని అడిగి అడిగి విసుగు చెంది ఎలాగైనా బయటకు వెళ్ళాలి అని ఇద్దరు అనుకున్నారు.
ఇంట్లో అందరూ ఉదయాన్నే పూజలు చేసుకునే సమయంలో వర్ష మరియు వర్షిణి కలిసి మెల్లగా ఇంటి నుండి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చారు. ఎప్పుడూ ఒకసారి కూడ ఊరు చూడలేదు అని ఊరు అంత తిరుగుతూ ఎంతో ఆనందంతో ఇంత ఆనందాన్ని మనం కోల్పోయాము మనము వర్షిణి, ఎప్పుడు పూజలు ప్రసాదాలు మంత్రాలు అని చెప్పి ఇంట్లోనే ఉంచేసేవారు. బ్రాహ్మణ కుటుంబంలో ఉండడం వల్ల ఎటు వెళ్ళడానికి లేకుండా ఇన్ని రోజులు ఆ ఇంట్లో స్వేచ్ఛ లేని జీవులు క్రింద బ్రతికాం అని అని వర్ష చెప్తున్నాడు.
వర్షిణి అక్కడ ఊరిలో ఉన్న ప్రకృతి ఆనందాన్ని చూసాక తన మొహం మొత్తం రంగులు రంగులు మారిపోతుంది, ఇలా వర్షిణి ని చూస్తూ ఉన్న వర్షకి చెమటలు పడుతున్నాయి. వర్షిణి నడుస్తూ ఉంటే తాను వేసిన పాదాలు చోట నీళ్లు వస్తున్నాయి, వర్షిణి చుట్టు మొత్తం తూనీగాలు చేరిపోతున్నాయి. వర్షిణి పక్కన ఉన్న వర్ష ని కూడ మర్చిపోయి వింత వింతగా మారిపోతుంది, వర్ష వెళ్లి వర్షిణి ని పట్టుకుంటే నీళ్లు తప్ప వర్షిణి శరీరం దొరకడం లేదు. వర్షిణి మొత్తం చిన్న చిన్న నీటి బొట్లు లాగా అయ్యి ఆకాశం వైపు చేయి చూపి రెండు చేతులు చాపి రా అమ్మ రా అంటుంటే వర్షం జోరున పడుతుంది, మేఘాల గర్జిస్తున్నాయి, ఉరుముల మెరుపులు ఎక్కువ అవుతున్నాయి ఏదో తెలియని అలజడి మొదలు అయింది. వర్ష ఒక్కసారిగా మేఘము క్రింద మారడం చూసిన వర్ష ఇంకేమి మాట్లాడకుండా తన మెడలో ఉన్న రుద్రాక్ష ని తీసి వర్ష మెడలో వేసాడు.
వర్ష తన యదా స్థితికి వచ్చేసింది, ఇక ఇక్కడ ఉంటే ప్రమాదం అనుకుని వర్ష వర్షిణిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. వర్షిణి ని వెళ్ళకుండా తూనీగలు అడకుంటున్నాయి. ఏమైంది బావ ఇక్కడ ఇంత వర్షం పడింది నేను ఏంటి ఇలా తడిచిపోయాను అని కళ్ళు తిరిగి పడిపోయింది, మెల్లగా వర్షిణి ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక మొత్తం విషయం పూజారి గారికి చెప్పాడు వర్ష.
వర్ష నీకు ఒక నిజం చెప్పాలి, వర్షిణి ని ఎప్పుడూ మన ఆలయ పరిసరాలు దాటి తీసుకుని వెళ్లవద్దు, ప్రమాదం పొంచి ఉంది. తనని మన ఇంటికి తీసుకు వచ్చిన దగ్గర నుండి తూనీగలు ఎప్పుడూ వర్షిణి పక్కనే ఉండేవి, ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్తే తన శరీరం మొత్తం నీళ్లు క్రింద అయిపోయేది. వర్షిణిని బయటకు తీసుకు వెళ్తే ఒక్కసారిగా మేఘాలు ఊరు మొత్తం కమ్మేస్తున్నాయి, అందుకే తనని బయటకు పంపకుండా ఇంటికే పరిమితం చేసాము వర్ష. ఇంకెప్పుడు ఇల్లు వదిలి బయటకు వెళ్లవద్దు అని చెప్పాడు.
వర్షిణి ఎప్పుడు కిటికీ దగ్గర కూర్చుని నేను మా ఇంటికి వెళ్ళాలి మా అమ్మ నాకు కావాలి అంటున్నది ఆకాశం వైపు చూస్తూ వర్ష తో. నీ ఇల్లు ఇక్కడే వర్షిణి మనం అందరం కలిసి ఉండేది ఇక్కడే అని చెప్పి ఆ కిటికిని పూర్తిగా మూసేసి తనని పూర్తిగా ఇంటికి పరిమితం చేసేసాడు వర్ష.
అలా పది సంవత్సరాలు గడిచాయి, వర్షకి 26 సంవత్సరాలు వచ్చాయి. వర్ష కి వర్షిణికి ఇద్దరికి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. ఇంతలో పూజారి దగ్గరకు ఒక సాధువు వచ్చాడు. మీకు 25 సంవత్సరాల క్రిందట ఒక బాబును ఇచ్చాను ఆ బాబు ఎక్కడ ఉన్నాడు మాకు కావాలి అని అడగగానే, పూజారి వెంటనే సాదువుతో స్వామి మాకు దైవం ఇచ్చిన బిడ్డ అనుకున్నాం ఒక్క రోజులో వస్తాను అని చెప్పి ఇప్పుడు వచ్చి బిడ్డను అడుగుతుంటే ఇన్ని సంవత్సరాలు పెంచిన ప్రేమ ఏమి అవుతుంది స్వామి అని అడగగానే, సాధువు వెంటనే ఇది దైవ కార్యం వర్ష ని పంపండి అని అన్నాడు.
వర్షని పూజారి గారు పిలిపించి ఎందుకు ఏమిటి అని నన్ను అడగకుండా ఈ సాధువు గారితో నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చేయి నా దగ్గరకు అని చెప్పి వర్ష ను పంపించేసాడు పూజారి గారు. సాదువుతో నడుస్తూ చేయి పట్టుకుని వెళ్తూ ఉండగా తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి వర్షకి, మన సాధువు గారు ఎక్కడ ఉన్నారు అని వర్ష అడిగితే నీ కోసం ఆ వనం కోసం అక్కడే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇద్దరూ కలిసి అలా దారిలో వెళ్తూ ఉండగా ప్రకృతి మొత్తం విలయతాండవం చేస్తుంది, అయిన అవేమి పట్టించుకోకుండా వనం కోసం వెళ్తూ ఉన్నారు.
పూజారి గారు దీనంగా మొహం పెట్టి ఉండగా ఏమైంది మావయ్య అని వర్షిణి వచ్చి అడగగా, పూజారి గారు జరిగింది మొత్తం వర్షిణికి చెప్పారు. బావ లేని జీవితం నా వల్ల కాదు నేను వెళ్లి బావను తీసుకు వస్తా అని చెప్పి ఒక్కసారిగా ఇంటి తలుపులు తీసి తన బావ ఇచ్చిన రుద్రాక్ష ని తీసుకుని బయటకు వచ్చింది. బయటకు వర్షిణి రాగానే తూనీగలు అన్ని చుట్టుముట్టాయి. వర్షిణి వాటితో నన్ను వర్ష ఉన్న చోటుకు తీసుకు వెళ్ళండి అని అన్నది. తూనీగలు గాలిలో వర్షిణి ని వర్ష ఉన్న చోటుకి తీసుకు వెళ్తున్నాయి.
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
వర్ష సాధువు ఉన్న చోటుకు వచ్చేసాడు, సాధువుకి నమస్కరించి బాగున్నారా అని అడగగా సాధువు మన వనం లేనిదే మనం ఎలా బాగుంటాము అని అడగగా. వర్ష కి ఎలా అయినా వనంలో ఉన్న నీరుని బయటకి పంపాలి అని చూసాడు, ఎటువంటి ప్రయత్నం చేసినా నీరు ఇంకా ఇంకా పెరుగుతుంది. ఏమి చేయాలో తెలియక మనసులో ఆలోచించాడు అసలు జరిగింది ఏంటి అని శివుని నామస్మరణ చేస్తూ.
అసలు వనం ఇలా అవడానికి కారణం వరుణ దేవుడుకి వచ్చిన అసూయ వల్ల ఇదంతా జరిగింది, ఒకసారి వాయు దేవుడు వరుణ దేవుడు మాట్లాడుతూ ఉండగా వాయు దేవుడు పచ్చని వనాలు లేకపోతే అసలు నువ్వే లేవు, చెట్లు ఎక్కువగా ఉంటేనే వర్షాలు ఎక్కువ పడతాయి, వనాల అందం ముందు మీ మేఘాల అందం ఎంత అన్నాడు. ఇది అంత మనసులో పెట్టుకుని భూమి మీద ఉన్న వనాల మీద జోరున వర్షం కురిపించి మొత్తం నీటితో నింపేసాడు వరుణ దేవుడు. దీనికి పరిస్కారం కూడ వరుణ దేవుడు దగ్గరే ఉంది అని తెలిసింది.
ఇంతలో వర్ష ఉన్న చోటుకు వర్షిణి వచ్చింది, వర్షిణి ఆ చోటుకు రాగానే మబ్బులు కమ్ముకున్నాయి, వనం మొత్తం చీకటి అయిపోయింది. వరుణ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, తన కూతురు వర్షిణి ని వచ్చేయి వర్షిణి నా దగ్గరకు మనం మన లోకానికి వెళ్లిపోదాం అనగానే, నేను రాను నేను వర్ష తో ఉన్న అన్నది వర్షిణి. వెంటనే వరుణ దేవుడు సాదువుతో నేను ఇక్కడ వర్షం కురిపిస్తున్నపుడు ఇంతకు ఇంత అనుభవిస్తావు అని శాపం ఇచ్చాడు సాధువు. నా బిడ్డను ఇలా నాకు దూరం చేయడం తప్పు కాదా, ఆవేశంలో నువ్వు ఇచ్చిన శాపానికి నేను నా బిడ్డను దూరం చేసుకున్న. నా బిడ్డను నాకు ప్రసాదించు అని సాధువు ని అడుగుతూ ఉండగా.
అప్పుడు సాధువు నీకు నీ బిడ్డ దూరం అయితే ఇలా బాధపడుతున్నావు, తల్లిలా పూజించే మా వన దేవతను మాకు దూరం చేసావు. నీ బిడ్డను నీకు తిరిగి ఇస్తాను నా తల్లిని నాకు తిరిగి ఇచ్చేయి అన్నాడు సాధువు వరుణ దేవునితో.
Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8
వెంటనే వరుణ దేవుడు తప్పు అయింది అని వనంలో ఉన్న నీరుని మొత్తం ఆవిరి చేసి వనం మొత్తం తిరిగి వచ్చేలా చేసాడు. వన దేవత ప్రత్యక్షమయి మంచి చేసిన మీకు మంచి జరుగును అని మాయం అయిపోయింది. అనుకున్న ప్రకారం వర్షిణి ని వరుణ దేవుడుకు అప్పచెప్పాడు సాధువు. వర్షిణి వర్ష ను వదలలేక తన తండ్రి వరుణ దేవుడు వద్దకు వెళ్ళింది.
వర్ష ఎవరు అన్నది సాధువుకు ఇన్నాలకి తెలిసింది, వర్ష మట్టి దేవుడు కుమారుడు అని. మట్టి లేనిదే మొక్కలు నాటడం కుదరదు కదా అని అనుకున్నాడు సాధువు ఇది అంత ఒక శివుని లీల లాగా కనపడింది సాదువుకు. తనని పెంచిన పూజారి గారిని మరియు వాళ్ళ కుటుంబాన్ని కూడ వనంలోకి తీసుకు వచ్చేసాడు వర్ష. సాధువు గారు వనంలో ఉన్న ఒక చెట్టు క్రింద ధ్యానం చేస్తూ కాలం గడిపేస్తున్నారు. వర్ష మొక్కలను నాటుతు వనాన్ని పెంచుతూ వనంలో ఉన్న జీవాలను ఆహారం ఉండేలా చేస్తున్నాడు.
A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ
వర్ష ఎంత పనిలో ఉన్న వర్షిణి ని మర్చిపోలేక పోతున్నాడు. ఏ పని చేసిన పక్కన వర్షిణి ఉంది అనుకుని తనలో తాను మాట్లాడేసుకుంటున్నాడు వర్ష. ఇంతలో తూనీగలు వర్ష మీద వాలుతూ ఉన్నాయి, తూనీగలు మొత్తం వర్ష చుట్టూ తిరుగుతూ వర్షని మొత్తం చిన్న చిన్న నీటి తుంపరలు వర్ష మీద పడుతున్నాయి. వర్ష వెంటనే వర్షిణి నువ్వు నా కోసం వచ్చావ మళ్ళీ అనగానే, నేను ఎక్కడికి వెళ్ళలేదు బావ నీతోనే నా జీవితం అని అన్నది వర్షిణి…
Written By Mr. Ramesh Akula…