Tiger man puli manishi telugu lo stories kathalu పులి-మనిషి
ఒకరోజు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఒక బ్రాహ్మణుడు. ఇంకా పూర్తిగా తెల్లవారలేదేమో, అంతా మసక చీకటిగా ఉంది. అయితే అతనికి ఆ దారి అంతా కొట్టినపిండే- రోడ్డుమీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు. అందుకని, అతను మామూలుగా వెలుతురులో నడిచినట్లు నడిచి పోతున్నాడు. ఊరుదాటి నాలుగడుగులు వేశాడో,
లేదో అతనికొక గొంతు వినిపించింది-"అయ్యా! బ్రాహ్మణోత్తమా! దేవుడిలాగా వచ్చావు. దాహంతో నా నోరు పిడచకట్టుకు పోతున్నది. కొంచె సాయం చెయ్యి. ఒక్కసారి నన్ను బయటికి వదులు. నీకు పుణ్యం ఉంటుంది" అని.
బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా కలయజూశాడు. శబ్దం దగ్గరనుండే వచ్చినట్లున్నది- చూస్తే ఏమున్నది, అక్కడ?! గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది, ఒక పెద్ద పులి!
"పులీ, నా దగ…