Pavithra vanam Telugu lo stories kathalu, పవిత్ర వనం

Pavithra vanam telugu lo stories kathalu పవిత్ర వనం

 

దక్షిణ దేశంలో ప్రచారంలో ఉన్న రామాయణ గాధ ఇది.

లక్ష్మణుడు యుద్ధంలో గాయపడి, మూర్చపోయి పడి ఉన్నాడు. వానర సైన్యంలోనే ఉన్న ‘సుషేణుడు’ అనే వైద్యుడు ఆయన్ని పరిశీలించాడు. “లక్ష్మణుడు స్పృహలోకి రావాలంటే, సూర్యోదయం లోగా ‘సంజీవని’ అనే ఔషధిని తేవాలి” అన్నాడు.

కానీ సంజీవని అన్ని చోట్లా పెరగదు. కేవలం హిమాలయాల్లోనే దొరుకుతుంది. అంత దూరం నుండి లంకకు ఆ మూలికను తేవాలి. -అదీ సూర్యోదయంలోగా! అసంభవమైన ఈ పనిని ఇంకెవరు చేయగలరు, పవన పుత్రుడు హనుమంతుడు తప్ప?!

PACI Website – Civil ID Appointment

Digital Civil ID – How to Install in Mobile

 

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu

హనుమంతుడు బయలుదేరి వెళ్లాడు. చాలా వేగంగా ఎగురుతూ కైలాస పర్వతం చేరుకున్నాడు. అక్కడ కనబడింది- సంజీవనీ పర్వతం. ఆ కొండ నిండుగా దట్టమైన అడవి ఉంది. లెక్కలేనన్ని మొక్కలు, మూలికలు ఉన్నాయి. “వీటిలో ఏది, సంజీవని?” హనుమంతుడికి అర్థం కాలేదు. ఆ మొక్కను ముందుగా ఏనాడూ చూసి ఉండలేదు, మరి! కానీ సమయం తక్కువ ఉన్నది. నాలుగే గంటల్లో లంకను చేరుకోవలసి ఉన్నది. క్షణక్షణం ఎంతో విలువైనది. “ఏం చేయాలి?”

మహా బలశాలి అయిన హనుమంతుడు ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు- “ కొండను మొత్తాన్నీ ఎత్తుకెళ్తాను” అని. ఆ కొండ మొత్తం ఒక అద్భుతమైన తోట. లక్షలాది ఓషధులు విరాజిల్లు తున్నై, ఆ వనంలో. దానిని ఎత్తుకొని, హనుమంతుడు సూర్యోదయంలోగా లంకకు చేరుకున్నాడు.
సంజీవని ప్రభావంతో లక్ష్మణుడు కళ్లు తెరిచాడు.



కొండనెందుకు తెచ్చావని అడిగితే హనుమంతుడు ” మందు మొక్కను గుర్తుపట్ట లేకపోయాన”న్నాడు నిజాయితీగా. అందరూ నవ్వారు.

కథ ముగియలేదు.

లక్షలాది మొక్కల సమాహారం, ఆ అద్భుత వనం. ఆ కొండను ఏం చేయాలి? చాలా భక్తి శ్రద్దలతో, ఎంతో ఆర్భాటంగా, ఆ పవిత్ర వనాన్ని, మహత్తరమైన మూలికలతో సహా, లంకలోనే ప్రతిష్ఠించి, దానికి ‘దేవారణ్యం’ అని పేరు పెట్టారు. ఆ వనంలోని ఒక్కొక్క ఆకూ పవిత్రమైనదే. ఆ వనం ఏ ఒక్కరి సొంత ఆస్తీ కాదు; అది అందరిదీ! మొక్కల సంరక్షణకు, వాటి వారసత్వ సంపదల పరిరక్షణకూ ఆ ప్రదేశం పూర్తిగా అంకితం చేయబడింది. ఆ వనంలో ఒక గుడి నిర్మితం అయింది. దాన్ని నడిపేందుకొక వ్యవస్థ ఏర్పడింది.

లంకలో వనాన్ని ఉదాహరణగా తీసుకొని, భరత ఖండంలోని పల్లె పల్లెలోనూ అలాంటి పవిత్ర వనాలు నెలకొల్పబడ్డాయి. హనుమంతుడు మొదలు-పెట్టిన సంప్రదాయాన్ని అందరూ కొనసాగించారు. అలా మొదలైన ఆ పవిత్ర వనాల సంస్కృతి ఈ శతాబ్దపు ఆరంభం వరకూ వర్దిల్లింది. పారిశ్రామిక సంస్కృతి నేపధ్యంలో అటువంటి పవిత్రవనాలెన్నో మన నిర్లక్ష్యానికి గురై నశించాయి. అవి నిలచిన పవిత్ర భూమి కబ్జాదారుల చేతుల్లో పడిపోయింది.

అయినా అలాంటి అద్భుత వనాలు కొన్ని ఈనాటికీ పవిత్రంగా అలానే మిగిలి ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో పెరుంబవూర్ దగ్గర అట్లాంటి వనం ఒకటి ఇంకా నిలిచి ఉన్నదని చెబుతారు. హనుమంతుడు పుట్టింది అక్కడేనట!

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu

A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ



friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu,

Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష


సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories


కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story


Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8

 

Spread iiQ8