గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
ఆశ్రమంలోని శిష్యులంతా అడవికెళ్ళిన శిష్యుని రాకకోసం ఎదురు చూస్తున్నారు. అతడు కొమ్మలు తెస్తే, అవి రాటలుగా ఉపయోగించి గుర్రానికి సాల నిర్మించాలని వారి యోచన.
శిష్యుడు వచ్చీరావడంతోనే, గురువుగారి పాదాలు పట్టుకొని “గురుదేవులు మన్నించాలి, ఈ రోజు చాలా దుర్ధినం. నేను నిజానికి మరణించాల్సింది” అంటూ జరిగిన సంగతంతా చెప్పి, “అ ప్రకారం ఆ మహానుభావుడు గొప్ప జ్యోతిష్యుడని నా బుద్ధి కుశలత వల్ల తెల్సుకోబట్టి మీ గురించి కూడా ఆయన్ను అడిగాను. వారు ఇలా చెప్పారు” అంటూ “కాళ్ళూ చేతులూ చల్లబడిపోతే మీరు మాకు దక్కరు గురువుగారో” అంటూ శోక్తాలు తీయసాగాడు.
ఆ మాటలు వింటూనే ఆయన స్పృహతప్పి పడిపోయారు. శిష్యులంతా గురువుగారి ముఖంమీద నీళ్ళుకొట్టి లేవదీశారు.
కాస్త తెప్పరిల్లాక గురువుగారు “నాయనలారా! ఆ మహానుభావుడెవరో నిజమే చెప్పి ఉండొచ్చు! ఎంతటి వారికైనా మరణాన్ని తప్పించుకో శక్యమా? అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! “శిరః పాద శీతలం" అని ఆయన చెప్పినందు చేత ఈరోజు నుంచీ తలకు స్నానం మానేస్తాను. తలమీద ఎటూ…
Read more
about గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu