Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి
Tenali Ramakrishna Stories in Telugu, Kapi - Kavi, కపి-కవి
తెనాలి అగ్రహారంలో - జక్కమాంబ, రాయనిమాత్యుల పుత్రుడయిన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయీ, రణపెంకీ. చదువంటే శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు. భయమన్నది ఎరుగడు. అమ్మానాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.
ఒకరోజు తననొక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది. దగ్గరకు పిలిచాడు.
“నీకు కాళికాదేవిని చూడాలనుందా?” అని అడిగాడు.
“లక్షసార్లు చూశానా గుడిలో రాతిబొమ్మని. మళ్లీ చూసేందుకేముంది?” నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు.
“బొమ్మనికాదు, అమ్మనే. నిజంగా కాళీమాతని . చూస్తే నువ్వు తట్టుకోలేవులే. భయంకరంగా ఉంటుంది కాళి. జడుసుకుంటావు” కవ్విస్తున్నట్లే అన్నాడు సన్యాసి.
“భయమా! జడుపా! నాకా?” పౌరుషంగా చూశాడతను సన్యాసి వైపు. “ఆ దేవిని చూబెట్టు. ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను” అన్నాడు సవాలు అంగీకరిస్తున్నట్లు.
ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తూందతనికి. పట్టుదల వచ్చింది. “జగదాంబ అలా తేలికగా కనపడిపోతుందేమిటీ?” నవ్వాడు. …
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి