Sri Vyuha Lakshmi Om Namo Vekateshaya
శ్రీ వ్యూహ లక్ష్మి 🙏 Sri Vyuha Lakshmi Om Namo Vekateshaya
తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన మూలవిరాట్టు వక్ష స్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది. అందుకే వైకుంఠ నాధుడ్ని శ్రీనివాసుడు గా పిలుస్తారు.ఈ శ్రీ మహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని తంత్ర శాస్త్ర విశేషమైన కార్యక్రమం..
ఒకానొక సంధర్భంలో స్వామి వారు ఎవరు అనే ధర్మసందేహం కలిగిన రోజుల్లో భగవత్ రామానుజుల వారే స్వామి వారు సాక్షాత్తు వైకుంఠ నాధుడని, వైకుంఠంనుండి భూలోకంలో అర్చవతార మూర్తిగా అవతరించారని, స్వామి వారికి శంఖు చక్రాలను ఏర్పాటుచేసిపచ్చకర్పూరంతో నామంపెట్టి వక్షస్థలంలో వ్యూహాలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి.
7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History | iiQ8
వక్షః స్థలంలో మహాలక్ష్మి ఉండటం వల్లే శుక్రవారాలలో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని కూడా రామనుజులవారే ఆరంభించారని శిలాశాసనాలలో పేర్కొనబడ్డాయి. అంతే కాకుండా జియాంగార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, శ్రీవారి కైంకర్యంకోసం తొలి జీయర్ మఠాన్ని కూడా ఆనాడే స్థాపించారని, ఈ సంప్రదాయం. ఇది నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అలా శ్రీవారి వక్షస్థలంలో ఈ వ్యూహాలక్ష్మి ఉండటం వల్లే స్వామివారి కి జన, ధన ఆకర్షణ విశేషంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే.
ఈ వ్యూహ లక్ష్మిని వర్ణిస్తూ విభుజా అంటారు.. సాధారణంగా చతుర్భుజాలతో దర్శన భాగ్యం కలిగించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉండగా మూడు భుజాలతోనే దర్శనం ఇస్తారు కనుక త్రిభుజా అని పిలుస్తారు. శ్రీవారితో ఉన్నప్పుడు నాలుగు భుజాలతో పద్మాలు అలంకరించుకుంటే పద్మాసనంగా పద్మంలో కూర్చున్నట్టుగా మనకు దర్శనమిస్తారు ఈ వ్యూహలక్ష్మి కి ప్రతి శుక్రవారం నాడు పసుపుతో అభిషేకం జరుగుతుంది.
Sri Vyuha Lakshmi Om Namo Vekateshaya
అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు, స్వామి వారికి కూడా అభిషేకం తర్వాత పచ్చకర్పూరం అలంకరిస్తారు. అనంతరం స్వర్ణాభరణాలు. పుష్పమాలలతో అలంకరిచిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు, ఈ వ్యూహలక్ష్మి ని దర్శించుకొనే భక్తులకు కోరినన్నికోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
Full Details of Tirumala Temple Consturction, 12 BC Lord Venkateswara
ఈ వ్యూహాలక్ష్మినే స్వర్ణ లక్ష్మిగా పూజిస్తారు, మహాలక్ష్మి అమ్మవారు మాంగల్యం తో మనకు దర్శనమిస్తారు అందుకే శ్రీవత్సమని అని పిలుస్తారు.
మహాలక్ష్మికి అంటే ఈ ప్రతిమకు కూడా శుక్రవారం నాడు స్వామి వారి ఏకాంతంగా శ్రీ సూక్తం గా సుగంధ ద్రవ్యంతో , చందనంతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలను ధరింపజేసి స్వామి వారికి మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనల తరువాత కర్పూర హారతి ఇస్తారు.
ఈ విధంగా పూజాలందుకుంటున్న వ్యూహాలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
|| ఓం నమో వెంకటేశాయ ||
7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History | iiQ8
Sri Vyuha Lakshmi Om Namo Vekateshaya
Find everything you need.
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.