Paropakaram Kids Moral Story | *ధర్మాత్ముడు* | 3

Paropakaram Kids Moral Story 3

 

Dear Kids, we will read the story of Paropakaram Kids Moral Story.

 

*ధర్మాత్ముడు:*

 

🌹ఓరాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. “ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను” అన్నాడు ఆ రాజు తన కొడుకులతో.

రాకుమారులు నలుగురూ తమ గుఱ్ఱాలు తీసుకుని నాలుగు దిక్కులకూ బయలుదేరారు.

 

కొన్నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓవ్యాపారిని నిలబెట్టి, “ఈ శేఠ్ గారు వేలాది రూపాయలు దానం చేస్తుంటారు. ఎన్నో గుళ్లూ గోపురాలు కట్టించారు. చెరువులు తవ్వించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. నిత్యం పురాణ శ్రవణం చేస్తుంటారు. గోపూజలు చేస్తుంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు.” అన్నాడు.

Paropakaram Kids Moral Story 3

Paropakaram Kids Moral Story 3

Sons and children born with due relationship – కొడుకులు బిడ్డలు బాకీ సంబంధం తో పుడతారు

 

’ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడే!’అని పలికిన రాజు, ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు.

రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకువచ్చి “ప్రభూ! ఈ బ్రాహ్మణుడు నాలుగు ధామాలకు, సప్తపురాలకు కాలినడకన వెళ్లి యాత్రలు చేసివచ్చాడు. సదా వీరు చాంద్రాయణ ప్రతం చేస్తుంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపగించడం ఎవరూ, ఎన్నడూ చూడలేదు. నియమబద్దంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తరువాతే జలపానం చేస్తారు. త్రికాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈకాలంలో యీవిశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ట ధర్మాత్ములెవరూ లేరు.” అన్నాడు.

 

రాజు బ్రాహ్మణ దేవతకు నమస్కరించి అధిక దక్షిణలిచ్చి, వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు.

 

మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. ఆబాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుండి పోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంతో ఆయన కనిపిస్తున్నాడు. అందరూ ఆసీనులైన తరువాత మూడవ కొడుకూ “ప్రభూ! వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. వీరు మహా తపస్వులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యంలో ఉంటారు. శీతకాలంలో జలాలలో నిలబడుతారు. సదా భగవంతుని ధ్యానంలో వుండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించడం దుర్లభమే…” అన్నాడు.

 

Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 

 

రాజు ఆమహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు.. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు.

అందరి తరువాత చిన్నకొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెలో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండియే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు ముగ్గురూ తమ్ముని మూర్ఖత్వానికి పకపక నవ్వారు. అప్పుడా చిన్నకొడుకు… ” ప్రభూ! ఓకుక్కకు గాయం అయ్యింది. ఇతను అది చూసి దాని గాయం కడిగాడు. అందుకే నేనితణ్ణి తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి” అన్నాడు.

రాజు “ఏమయ్యా! నువ్వు ఏంధర్మం చేస్తుంటావు?”

 

MAHABHARATA Day 3 | Episode 3 – Pandavas & Kauravas Arrival





భయపడుతూనే రైతు పలికాడు… “ప్రభూ! నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది, ఎవరైనా జబ్బుపడితే సేవ చేస్తాను. ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను”

అంతట రాజు, “ఇతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు” అన్నాడు.

అది విని కొడుకులందరూ అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు, “దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యమాడక పోవడం క్రోధంగా ఉండక పోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనం పూజాదులు కొనసాగించడం కూడా ధర్మమే. తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే, కానీ సర్వాధిక ధర్మమేమంటే అర్థించక పోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం, రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనీయడం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంతతానుగా సహాయం అందుతుంది. త్రిలోక నాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణునిపై ప్రసన్నుడై ఉంటాడు” అని అన్నాడు.

అందుకే పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించే వాడే ధర్మాత్ముడు.🌹

🙏 ఓం నమః శివాయ 🙏

Paropakaram Kids Moral Story 3

*Good soul:*

🌹A king had four sons. The king said to his sons, “Whoever can find Dharma who is the supreme ruler, I will give the kingdom to him.”
The four princes took their bags and left for the four directions.

After a few years, the elder son came back and made the businessman stand in front of his father and said, “This Sheth garu will be donating thousands of rupees.” Many temples and towers were built. The ponds have been dug up. Cooling stations have been set up. Many Vratas are performed in pilgrimage places. Always listening to the myth. They will be doing cow poojas. There will be no one more righteous than these people in the world. “He said.

True Friendship Story In Telugu, ఇద్దరు సైనిక స్నేహితులు, స్నేహం మరియు నమ్మకం

 

‘He is definitely a righteous man! The king who spoke, felicitated that businessman and sent him off.
The second son brought a crooked Brahmin and said “Lord! This Brahmin went to four Dhamas and Saptapuras on foot and did pilgrimage. These people always do

Chandrayana pratam.

 

Paropakaram Kids Moral Story 3

They are afraid of the lie. No one has ever seen him angry. As a rule, only after completing the mantra chants, they will drink water. They will take bath in tricala and do evening prayer. In this world, there are no more righteous people than these people. “He said.

The king bowed down to the Brahmin Goddess and gave her extra Dakshina and sent her away saying that they are good dharmaaths.

The third son also brought a babaji. As soon as Ababaji came, they sat with their eyes closed and left. He looks like a skeleton with digested clothes. After all became Aseen, for the third son “Lord! These people are here when I pray so hard. These guys are great philosophers. Milk is only done once a week. Panchagni will be in the middle of the summer. Standing in the waters in the winter. It is very rare to get greater Dharma than these people who are always in the meditation of God… “He said.

The king did prostration to the Amahatma and took their blessings and bid farewell.. Then he said that they are righteous.

The little boy came after everyone. There is a farmer who lives in the village who has tied the same clothes with him. That farmer came and stood up fearing the king from a distance.

The three brothers laughed at the foolishness of the younger brother. He was a little boy back then.. ” Lord! One of the dogs has been injured. He saw it and healed its wound. That’s why
I brought her. He said, you ask and find out whether he is righteous or not.
King “What man! What the hell do you do? ”

The farmer spoke out of fear… “Lord! I am not an educated person. I don’t know what Dharma is, I serve someone who is sick. If someone asks, I will give you a bunch of pillows”

Paropakaram Kids Moral Story 3

 

The king himself said, “He is the greatest righteous man of all”.

After hearing that, all the sons were staring at it. The king then said, “To perform charity, to perform Gopuja, not to lie, not to be angry, to continue pilgrims, evening rituals are also dharma. Doing penance is a necessary dharma, but the universal dharma is to help the helpless, serve the patient, lend a hand to those in need. Those who help others will get help automatically. Trilokanath, Paramatma will be happy on Atti Paropakara Parayana” he said.

That is why charity is the greatest virtue. The righteous is the one who performs it. 🌹

🙏 Hail Lord Shiva 🙏

Friendship Story In Telugu, స్నేహం మరియు డబ్బు, నిజమైన స్నేహితుడు

Spread iiQ8

May 6, 2023 9:58 PM

803 total views, 0 today