Pilli dhairyam telugu lo kathalu stories పిల్లి ధైర్యం
పిల్లి ధైర్యం : -
{ బింకం ప్రభావం ఎలా ఉంటుందో ఈ పిల్లుల కథ చదివితే తెలుస్తుంది. పులులు పిల్లులకు భయపడ్డాయట! }
సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo storiesఒక అడవిలో పులుల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబసభ్యులు ముగ్గురు: `తండ్రి పులి, తల్లి పులి, పిల్ల పులి'. ఒక సారి తండ్రి పులి ఒక మంచి వేటను ఇంటికి తీసుకొచ్చి తల్లిపులి చేతికిస్తూ, "బాగా బలిసిన ఈ అడవి దున్న మాంసాన్ని మనం వండి తిందాం. మన చంటోడికి అది బాగా నచ్చుతుందనుకుంటున్నాను నేను. దీన్ని చక్కగా వండిపెట్ట"మని చెప్పింది.
తల్లి పులి సరేనని ఆ మాంసం వండింది. అడవంతా వాసనలు ఘుమఘుమలాడాయి. వండిన కూరను మూడు వేరు వేరు పాత్రల్లోకి వడ్డించింది తల్లి పులి. కానీ ఆ కూర ఇంకా చాలా వేడిగా ఉంది. "దీన్ని తినడానికి వీలవ్వటం లేదమ్మా- చాలా వేడిగా ఉంది! కాసేపాగి తింటే బాగుంటుంది" -అన్నది పిల్ల పుల…