Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు - राजा - मछुआरों - Rājā - machu'ārōṁ
Dear All, here is the Raju - Bestha Vaadu రాజు - బెస్తవాడు | iiQ8 Kids Stories. తలుపుల రాజ్యాన్ని పాలిస్తున్న పరమ పిసినారి రాజుగారు ఒకనాడు ఒక చాటింపు వేయించారు. ఆనాటి రాత్రి విపరీతమైన చలి పెట్టడమే రాజు గారి చాటింపుకు కారణమట!ఇంతకీ చాటింపు ఏమిటంటే, కార్తీక పౌర్ణమినాటి రాత్రి మొత్తం చల్లని నీటిలో గడపగలిగిన వాళ్లకు వంద బంగారునాణేలు బహుమానంగా ఇస్తారట రాజుగారు.
అంతలో కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. రాజుగారి చాటింపు విన్న ప్రజానీకంలోంచి కొందరు సాహస యువకులు ఆ రాత్రిని చన్నీటిలో గడుపుతామని వచ్చారు.
వచ్చిన వాళ్లకు పోటీ మొదలైంది. పోటీదార్లందరినీ ఒక పెద్ద చన్నీటి కొలనులోకి దిగి కూర్చోమన్నారు. ఆ కొలనులోని నీళ్ల చల్లదనానికి తట్టుకోలేక ఒక్కరొక్కరుగా యువకులు అందరూ అక్కడనుండి బయటకొచ్చేశారు. కొందరైతే రాజుగారినీ, రాజు గారి చాటింపునీ, ఆ కొలనులో…