Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

Hair fall dandruf white hair telugu lo home healthy tips

 

Hair fall dandruf white hair telugu lo home healthy tips

 

జుట్టు రాలిపోకుండా ఉండడం…. తీసుకోవలసిన జాగ్రత్తలు …. hair fall dandruf white hair telugu lo home healthy tips

మాములుగా రాలే జుట్టు సహజమైన శిరోజాల జీవిత సైకిల్ లో భాగమే . జుట్టు ఎదుగుదల దశ ఏడాది నుంచి మూడేళ్ళు సాగవచ్చు . ఇది 90% జుట్టుకు వర్తిస్తుంది . తరువాత దశ తాత్కాలికం . ఇది ఆరు వారలు ఉంటుంది . తుది దశ విశ్రాంత దశ . ఇది పది శాతం జుట్టుకు వర్తిస్తుంది . జుట్టు ఊడి కొత్తది రావడానికి కొద్ది నెలలు సమయం పడుతుంది . తోలి దశను వైద్య భాషలో ” ఎనాజేన్ ” (గ్రోత్ స్టేజ్) అని , మోడో దశకు ” తెలోజేన్ ” (రెస్తింగ్ స్టేజ్) అని అంటారు . ఈ ఎనాజేన్ దశ నుండి తెలోజేన్ దశ కు కదులుతున్నప్పుడు జుట్టు ఊడుతూ ఉంటుంది .

 

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga

 

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెరటిన్‌ అనే పదార్థంతో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటున్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి. శరీరం మాదిరి వాటికీ పోషక విలువలు అవసరం. సహజంగా రోజుకు యాభై నుంచి వంద వెంట్రుకలు రాలుతాయి. అయితే అంత కంటే ఎక్కువ రాలినపుడే సమస్యగా భావించాలి.

 

Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?

సహజ కారణాలు

* వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జుట్టు పొడిబారి తెగిపోయే అవకాశం ఉంది. తేమగా ఉన్నపుడు చిక్కుపడి రాలిపోతాయి.

* సూర్య కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు.

* మానసిక ఒత్తిడి, వృత్తి, వ్యక్తిగత సమస్యలు, విద్యార్థులకైతే పరీక్షల భయం.

* వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్‌ డ్రయ్యర్ల వాడకం.

* స్ట్రెయిటెనింగ్‌, రింగులు చేయించుకోవడం.

ఇతరకారణాలు
బట్టతల లేదా జట్టు రాలిపోవడం ప్రస్తుత ఆధునిక జన జీవన సమస్య. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలిలో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా ఎవరైనా సరే ఒత్తిడికి లోనుకాని వారుండరు. ఒకప్పుడు నడి వయసు వ్యక్తులకు బట్టతల వచ్చేది.

 

అది వంశపారంపర్యంగా వచ్చేదని సరిపెట్టుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.

 

పాతికేళ్ల యువతీ యువకులు కూడా బట్టతల, జుట్టురాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు.

 

 

కంప్యూటర్‌తో సహ జీవనం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఫాస్ట్‌ఫుడ్‌ నూడుల్స్‌, పిజ్జా, బర్గర్‌… ఇలా నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, ఖర్జూరం తదితర పౌష్టికాహారం తగ్గించుకోవడంతో శరీరానికి తగినంత పోషక ఆహారం లభించడం లేదు. ఈ పోషకాహారలోపానికి మరోవైపు మానసిక ఒత్తిడి తోడవడంతో ఆరోగ్యం దెబ్బతిని జుట్టురాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 

Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana

ఆధునిక యువతలో కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే వారే ఎక్కువ ఉన్నారు. రేడియేషన్‌ ప్రభావంతో జుట్టురాలిపోయే అవకాశం ఉందని కొందరంటున్నారు. చిన్న వయసులోనే యువతీ, యువకులలో విపరీతమైన ఆందోళన చోటు చేసుకుంటోంది.మరి రాలిపోయిన జుట్టును తిరిగి తలపైకి తెచ్చుకోగలగడం సాధ్యమా? అవును.

 

* హార్మోన్‌ లోపం.. హైపోథైరాయిడిజం, రక్తాల్పత.. ఇనుము, విటమిన్‌ బి12 లోపం, ఇన్‌ఫెక్షన్‌, డైటింగ్‌ , ఒత్తిడి , హార్మోన్ల అసమతుల్యం వల్ల , పోశాకాహారలోపము వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటంది . జుట్టు రాలడం లో 30 నుంచి 40 రకాలు ఉన్నాయి . ప్రధానము గా రెండు రకాలు కనిపిస్తాయి .

 

అవి నడినెత్తిపై ఊడడం

: ఈ రకము హెయిర్ లాల్ ప్రధానము గా హార్మోనుల అసమతుల్యము వల్ల కలుగు తుంది . మెనోపాజ్ , పాలిసిస్తిక్ ఒవేరియన్ డిసీజ్ , థైరాయిడ్ సమస్యలు కారణము కావచ్చును .

పూర్తిస్థాయి హెయిర్ లాస్ : ఏదో ఒక ప్రదేశం లో కాకుండా తలబాగామంతా జుట్టు ఊడిపోతుంది . Diffused అంటారు .

మరికొన్ని కారణాలు — బాగా డైటింగ్ , సంతాన నిరోధక మాత్ర చేడుప్రభావము , ఐరన్ స్థాయి రక్తం లో తగ్గిపోవుటవలన .

జాగ్రత్తలు

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

* ముందుగా జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి రెండు సార్లు షాంపూ చేయాలి. నూనెతత్వం ఉన్న శిరోజాలైతే రెండు రోజులకోసారి తప్పనిసరి.

* కండిషనర్‌ తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి.

* సమతులాహారంతో జుట్టుకు తగిన పోషణ అందుతుంది. అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమినులు, మినరల్స్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, గుడ్లు, పప్పులు, డైరీ ఉత్పత్తుల్లో అవి సమృద్ధిగా దొరుకుతాయి.

* అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వైద్యులను సంప్రదించి ఫ్లూయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.

చికిత్సా చిట్కాలు :

మారుతున్న కాలానికి తగ్గట్లు అందానికి గల ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. స్త్రీలే గాక పురుషులు కూడా అందం పట్ల మక్కువ చూపిస్తున్నారు. అందానికి మరింత వన్నె తెచ్చేది శిరోజాలు. కురులు అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడంకోసం అనేక రకాలైన పద్ధతులు నేడు అందుబాటులోకి వచ్చాయి.

 

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

తేనెలోని విటమిన్లు, ఖనిజ లవణాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. తేనె చక్కని కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. జట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే, తలస్నానం చేశాక మగ్గు నీటిలో అరకప్పు తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం కలిపి జుట్టును తడిపి, రెండు నిమిషాల తరువాత తలపై నుంచి చల్లటి నీటిని ధారలా పోయాలి.

 

* తలస్నానం చేసిన అరగంట తరువాత కప్పు తేనెకు పావుకప్పు ఆలీవ్‌నూనె కలిపి, తలకు మర్దనా చేయాలి. పావుగంట అయ్యాక కడిగేస్తే కురులు పట్టుకుచ్చులా మెరుస్తాయి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేస్తే మంచిది. కప్పు ఆలీవ్ నూనెకు, అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి మర్దనా చేసి, అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

 

శిరోజాలు దట్టంగా పెరిగి నిగనిగలాడాలంటే కోడిగుడ్డులోని తెల్లసొనకు ఒక చెంచా ఆలివ్ లేదా బేబీ నూనె, కప్పు నీళ్లు కలిపి శిరోజాలకు దట్టించండి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో శుభ్రపరచాలి. అరగంట తరవాత షాంపూతో తలస్నానం చేస్తే అది జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.

 

తేనె, బాదం నూనె, పెరుగు ఒక్కో చెంచా చొప్పున కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తరవాత చల్లటి నీళ్లతో కడిగితే శిరోజాలు పట్టుకుచ్చులా మెరుస్తాయి. ఈ ప్యాక్ జుట్టుకు మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

 

మీ శిరోజాలు కాంతివిహీనంగా కనిపిస్తుంటే కొబ్బరిపాలను తలకు పట్టించి అరగంట పాటు మర్దన చేయాలి. దీనివల్ల శిరోజాలు పట్టుకుచ్చుల్లా జాలువారతాయి. కొత్త నిగారింపును సంతరించుకుంటాయి.

Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు

మీ వెంట్రుకలు తెల్లబడుతుంటే కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజూ మీ శిరోజాలకు రాసుకుంటే అవి నిగనిగలాడుతూ ఏపుగా పెరగడమేకాకుండా, తెల్లబడకుండా వుంటాయి. అలాగే వెంట్రుకులు రాలిపోకుండా పటిష్టంగావుంటాయని ఆయుర్వేద వైద్యనిపుణులు పేర్కొన్నారు.

 

తెల్లబడిన జుట్టుకు హెన్నాను వాడితే మిగిలిన జట్టు తెల్లబడకుండా ఉంటుంది. పెరుగు, మజ్జిగను అధికంగా వాడటంతో పాటు కరివేపాకును ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరిన ప్యాక్‌ను వాడటంతో పాటు మందారం ఆకులను నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది.
జుట్టు బాగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి.

 

 

తలస్నానం చేసిన రోజులు తప్ప మిగిలిన రోజుల్లో గోరు వెచ్చటి నూనెతో కుదుళ్లను తాకే విధంగా రాసి మునివేళ్లతో 15 నిమిషాల పాటు మర్ధన చేస్తే జట్టు పెరుగుతుంది. జుట్టు చిక్కును కింది నుంచి పైకి తీయాలి. అనుదిన తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు అధికంగా ఇండేవిధంగా చూసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

 

ఎండిన ఉసిరికాయ పొడిలో, ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు, మెంతులపొడిని కలపండి. ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిపాలను కలపండి. షాంపూలా ఈ మిశ్రమాన్ని కలుపుకుని శిరోజాలను పట్టించి ఒక గంటపాటు ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే రెండు నెలల్లో నల్లటి, దట్టమైన, అందమైన శిరోజాలు మీ సొంతం.

 

చలికాలం శిరోజాల రక్షణకు మొదటి షరతు నీరు తగినంత తాగడమే. శరీరంలో నీరు లేకపోతే శిరోజాలు పిడచబారి పోవడం ఖాయం దప్పిక వేయదు అని సాకు చూపి తగినన్ని నీళ్లు తాగకపోతే చర్మంతోపాటు శిరోజాలు కూడా పొడిబారిపోతాయి.

 

శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన సమయం కాబట్టి జుట్టు కొసలను తరచు కత్తిరించుకుంటూ ఉండాలి.
చలికాలంలో డ్రయర్లను వాడొద్దు. మెత్తని తువాలుతో తుడుచుకుని, గాలికి ఆరనివ్వడం మంచిది.

తీవ్రంగా చలువ చేసే హెర్బల్ నూనెలు వేసవికి పనికొస్తాయి తప్ప చలికాలానికి అనువుగా ఉండవు. కాబట్టి తలకు నూనెలు పట్టించేవారు చలికాలంలో ఎక్కువ సేపు నూనెను అలాగే ఉంచుకోరాదు.

వారంలో కనీసం రెండు సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే శిరోజాలు జవజీవాలు సంతరించుకుంటాయి.
చల్లగాలులు శిరోజాలను పొడి బారేటట్లు చేస్తాయి కాబట్టి అలోవెరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి.

 

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

శీతాకాలంలో బయటకు వెళ్లవలసి వస్తే తలకు ఊలు స్పార్క్ కంటే సిల్క్ స్పార్క్‌లో మంచివి.
శిరోజాలే ముఖారవిందాన్ని పెంపొందిస్తాయనడంలో సందేహంలేదు. ఆ శిరోజాల అందం కోసం రకరకాల రంగులు వాడుతుంటారు. కాని ముఖ్యంగా కొందరు హెయర్ డై వాడుతుంటారు. ఈ హెయర్ డైని వాడకూడదు .

 

** హెయర్ డైని వాడుతుంటే మీ శిరోజాలు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఇవి రాలిపోతాయి .

** నెలకు రెండుసార్లు హెయర్ స్పాకు వెళ్ళి చికిత్స చేసుకుంటుండండి. దీంతో మీ శిరోజాలు మెరుపుతోపాటు బలిష్టంగాను తయారవుతాయి.

 

** మీరు స్విమ్మింగ్ ప్రియులైతే స్విమ్మింగ్ క్యాప్‌ను తప్పక ధరించండి. ఇలా చేస్తే స్విమ్మింగ్ పూల్‌లోనున్న నీటిలో కలిపే క్లోరిన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. స్విమ్మింగ్ ‌పూల్‌లో కలిపే క్లోరిన్ కారణంగా మీ శిరోజాలు పాడైపోయే ప్రమాదం ఉంది.

 

** ముఖ్యంగా యువత వెంట్రుకలకు హెయర్ కలర్ వేస్తున్నారు. హెయర్ కలర్ వేసే అలవాటుంటే వెంటనే మానుకోండి.

** కొందరు తలను మాటిమాటికి దువ్వుతుంటారు. ఇలా చేయడం వలన వెంట్రుకలు బలహీనంగా మారి రాలిపోయే ప్రమాదం ఉందంటుంది .

శిరోజాలకు సంబంధించి ఎన్నో సమస్యలు. తలలో చుండ్రు, జుట్టు రాలడం, పేను కొరుకుడు, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం.. ఇలా ఏన్నో సమస్యలు ఆడా మగా అనే తేడా లేకుండా వేధిస్తుంటాయి. వీటిని ఎదుర్కొని శిరోజాల పెరుగుదలకు ఉపయోగపడే మంచి తైలం ఉందని ఆయుర్వేదం తెలియజేస్తోంది. ఈ తైలాన్ని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం…

తైలం తయారీకి కావల్సినవి: పావుకిలో చొప్పున గుంటగలగరాకు, ఉసిరికాయలు, 200 గ్రాముల మందారపూలు, ఒక చెంచా అతిమధురం, కొబ్బరినూనె, తగినన్ని నీళ్లు

 

తయారుచేసే విధానం :

ముందుగా గుంటగలగరాకు, ఉసిరికాయలు, మందార పువ్వులను దంచి ఆ ముద్దను మందపాటి అడుగుకల ఓ వెడల్పాటి పాత్రలో వేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి గరిటతో కలబెడుతూ బాగా మరగేవరకూ వేడిచేయాలి. పాత్రలోని ద్రవం బాగా మరిగి సుమారు నాలుగోవంతు వచ్చిన తర్వాత కొబ్బరినూనెను పోసి సన్నని సెగపై మళ్లీ వేడి చేయాలి.

కొంతసేపటికి నీరు పూర్తిగా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలి పైకి తేలుతుంది. దీనిని బాగా చల్లార్చాలి. ఆ తర్వాత నూనెను దళసరి వస్త్రం ద్వారా మరోపాత్రలోకి వడకట్టాలి. అంతే.. మీకు కావలసిన తైలం సిద్ధమైనట్లే. ఈ తైలం సుమారు ఏడాది వరకూ నిల్వ ఉంటుంది.

ఈ తైలంతో మర్దన చేస్తే… తలనొప్పి, పార్వ్శపు నొప్పి, ఒత్తిడితో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

అలవాట్లు :జుట్టు పై ప్రభావము >

దూమపానము :

దీనివల్ల రక్తనాళాలు మందముగా మారి జుట్టుకుడుల్లకు రక్త సరఫరా సరిగా జరగదు . క్రమము గా జట్టు సహజరంగును కోల్పోతుంది . కుదుళ్ళు బలహీనపడి చవరికి రాలిపోతాయి. అందుకే ఆ అలవాటు మానెయ్యాలి .

నిద్ర :

మనిషికి రోజుకు ఎనిమిది గంటలు నిద్ర అవసరము ( కనీసము ఆరు గంటలు) ఆ పాటి నిద్ర లేకపోతే ఒత్తిడి పెరిగి హార్మోన్లు హానికర రసాయనాలు గా మారుతాయి . జుట్టు బలహీనమై , తెల్లబదదము , రాలిపోవడము జరుగుతుంది ,

వ్యాయామము :

శరీరములోని విషపదార్ధాలను సమ్ర్ధవంతం గా బయటికి పంపే ఏకైక మార్గము వ్యాయామము . రోజు చెమటలు పట్టేలా వ్యాయామము చేస్తే చర్మానికి జుట్టుకుడుల్లకు రక్తసరఫరా బాగా జరిగి ఆరోగ్యము గా ఉంటాయి .

వాతావరణము :

డైరెక్ట్ గా ఎ.సి కింద కూర్చొని చేసే ఉద్యోగమా … అయితే మీ జట్టుకు రోజులు మూడినట్లే . అధిక వేడి , అదిక చల్లదనము రెండు కురులకు శత్రువులే . . ఎ.సి. లో పనిచేసే వారు ఉలు తో తయారుచేసిన టోపీలు ధరించడం మంచిది .

ఆహారపదార్థాలు విషయంలో వీటితో జాగ్రత్త ->

అందమైన కురుల కోసం రకరకాల సౌందర్యసాధనాలు వాడటం కద్దు. వాటితో పాటు ఆహారం విషయంలోనూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అందంతోపాటు ఆరోగ్యాన్నీ సంతరించుకుంటాయట కేశాలు. ప్రత్యేకించి కొన్ని రకాల ఆహారపదార్థాలు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లలో మార్పులు కలగజేసి హానికర రసాయనాలుగా మారుస్తాయి. ఆ రసాయనాలు కేశగ్రంథులను బలహీనపరచి జుట్టురాలిపోయేలా చేస్తాయి.

 

కాబట్టి అలాంటి ఆహారపదార్థాలను అతిగా కాకుండా ఒక పరిమితిలో తీసుకోమని చెబుతారు సౌందర్యనిపుణులు. అవేంటంటే…

 

వేపుళ్లు, రెడ్‌మీట్‌(కోడి, మేక, చేప తప్ప మిగిలిన మాంసాలు), ఉప్పు, పంచదార అధికంగా ఉండే బేకరీ ఉత్పత్తులు, స్వీట్లు, పాస్తా, నూడుల్స్‌, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, బఠానీలు. ఎప్పుడన్నా ఒకసారైతే ఫర్వాలేదు కానీ వీటిని తరచుగా పరిమితికి మించి తింటే జుట్టుకే కాదు, మిగతా శరీరభాగాల ఆరోగ్యానికీ ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.

జాలువారు కురుల కోసం..

జుట్టు రాలుతోంది.. చుండ్రు ఇబ్బందిపెడుతోంది.. తలనెరుస్తోంది… ఇలా కేశ సంబంధ సమస్యలు.. ఈ రోజుల్లో చాలామందిని ఏదో ఒక రూపంలో బాధిస్తూనే ఉన్నాయి. జీవన విధానంలో మార్పులు, నిర్లక్ష్యం, కేశసంరక్షణపై అవగాహన లేకపోవడం.. ఈ సమస్యల్ని మరింత పెంచుతున్నాయి. అయితే.. వీటిల్లో చాలామటుకు సొంతంగానే నివారించవచ్చు.

 

Hair fall dandruf white hair telugu lo home healthy tips

 

ఒత్తిడి వద్దు: జుట్టు ఆరోగ్యాన్నీ దెబ్బతీయడంలో ఒత్తిడిది కీలకపాత్ర. ఇది పెరిగే కొద్దీ హార్మోన్ల అసమతూకం తప్పదు. జుట్టూ విపరీతంగా రాలడం మొదలవుతుంది.

 

దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటనల వల్ల ఒత్తిడికి లోనవుతుంటాం కొన్నిసార్లు. దీనివల్ల జుట్టు ఎదుగుదల ఆగిపోతుంది. మారుతున్న జీవన విధానం వల్ల ఒత్తిడి తప్పదు కాబట్టి రోజులో కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.

 

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

అలాగే యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తలలో రక్తప్రసరణ వేగవంతమై కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

అనారోగ్యాలు: నిపుణుల ప్రకారం.. రోజులో 50-100 వరకు కురులు రాలవచ్చు. ఇది మరింత పెరిగినా.. విపరీతంగా రాలుతున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. థైరాయిడ్‌, పీసీఓడీ వంటివి.. కొన్నిసార్లు పోషకాల లోపాలూ ఇందుకు కారణం కావచ్చు. అలాగే టైఫాయిడ్‌, మలేరియా.. వంటి జ్వరాలు వచ్చినా శిరోజాలు వూడిపోతాయి. వైద్యుల్ని సంప్రదిస్తే.. పరీక్షలు చేసి.. చికిత్స సిఫారసు చేస్తారు. పోషకాల లేమి కారణమైతే.. వాటి సప్లిమెంట్లు సూచిస్తారు.

 

వాతావరణంలో మార్పులూ శిరోజాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. రాలిపోతాయి. తల, ముఖం విపరీతంగా దురదపెడుతుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఇందుకు చుండ్రు కారణం కావచ్చు. అదే వాస్తవమైతే.. చికిత్స తీసుకోవాలి. లేదంటే కుదుళ్ల చుట్టూ చుండ్రుపేరుకుంటుంది. దాంతో ప్రాణవాయువు అందక.. రాలిపోతాయి.

 

ఆహారంలో కొన్ని పోషకాల లేమి కూడా శిరోజాల ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. అందుకే కొన్ని పోషకాలు లోపించకుండా చూసుకోవాలి.

 

మాంసకృత్తులు: ఇవి జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంచుతాయి. ఇది లోపిస్తే.. జుట్టు నిర్జీవంగా మారుతుంది. కొంతకాలానికి విపరీతంగా పొడిబారి.. నెరిసిపోతుంది. అందుకే మన ఆహారంలో మాంసకృత్తులు తప్పనిసరి. ఇందుకోసం మాంసం, చేపలు, కోడిగుడ్లు తినాలి. శాకాహారులైతే.. పాలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, సోయా, చిక్కుడు జాతి గింజలు సమృద్ధిగా తీసుకోవాలి.

 

ఇనుము: ఈ పోషకం తగ్గితే రక్తహీనత తప్పదు. శరీరానికి ప్రాణవాయువును అందించే రక్తకణాల సంఖ్యా తగ్గుతుంది. దాంతో జుట్టుకూ ప్రాణవాయువు అందక ఎదుగుదల ఆగిపోతుంది. ఇనుము ఆధారిత పోషకాలు ఎక్కువగా తీసుకుంటే… ఈ సమస్యను నివారించవచ్చు. పాలకూర, మెంతికూర, తోటకూర వంటి తాజా ఆకుకూరలు, బీట్‌రూట్‌వంటివన్నీ ఇనుము ఆధారిత పదార్థాలే.

 

జింక్‌: జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కణజాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ పోషకం గుమ్మడిగింజలు, నట్స్‌, ఓట్స్‌, కోడిగుడ్లు, పాల నుంచి ఎక్కువగా లభిస్తుంది.

 

బయోటిన్‌: బి7గా పరిగణించే ఈ విటమిన్‌ లోపిస్తే.. చర్మం పొడి బారుతుంది. జుట్టూ పొడిబారి రాలిపోతుంది. గుడ్డులోని పచ్చసొన, చిక్కుడుజాతి గింజలు వంటివన్నీ బయోటిన్‌ను అందిస్తాయి. అయితే కోడిగుడ్డును ఉడికించి తీసుకోవాలి.

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

 

ఒమెగా త్రీ ఫ్యాటీఆమ్లాలు: ఇవి సరిగ్గా అందకపోతే.. తలలో పొట్టు లాంటిది మొదలై.. జుట్టు విపరీతంగా రాలుతుంది. అందుకే అవిసె గింజలు, వాల్‌నట్లు.. మన ఆహారంలో ఉండాలి.

 

ఇవీ తప్పనిసరి

 

* వెడల్పాటి దంతాలున్న చెక్క దువ్వెనను వాడాలి. అప్పుడే కురులు దువ్వెనకు పట్టుకోవు. ఎక్కువగా వూడవు.

 

* జుట్టుకు పోషణ అందాలంటే.. తలస్నానం ఒక్కటే సరిపోదు. అదనంగా కండిషనింగ్‌ కూడా తప్పనిసరి.

 

* రోజూ తలస్నానం చేయడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయనుకోవడం పొరబాటు. దీనివల్ల జుట్టులోని సహజనూనెలు తగ్గుతాయి. ఫలితంగా పొడిబారి, చిట్లుతుంది. చుండ్రు సమస్య గనుక లేకపోతే.. వారంలో మూడుసార్లకు మించి తలస్నానం చేయకపోవడమే మంచిది.

 

* ప్రతిరోజూ రెండుపూటలా.. మునివేళ్లతో తలంతా సున్నితంగా మర్దన చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ చురుగ్గా సాగుతుంది.

 

* తల తడిగా ఉన్నప్పుడు టోపీ, హెల్మెట్‌లు పెట్టుకోవడం.. స్కార్ఫ్‌ చుట్టుకోవడం వంటివి చేయకూడదు. తడిగా ఉన్నప్పుడు జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. వీటిని ధరించడం వల్ల త్వరగా వూడుతుంది.
, జుట్టు రాలకుండా ఉండాలంటే

 

జుట్టుని ఆరోగ్యంగానే కాదు, అందంగానూ కనిపించేలా చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని లేదు. కొన్ని వస్తువుల్ని ఇంట్లో అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఉసిరి జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. అలాంటి సమస్యలున్నప్పుడు పెరుగులో ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.

 

జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు. దీన్ని నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే తేనె, నిమ్మరసం లాంటి ఇతర పదార్థాలతో కలిపీ తలకు పట్టించుకోవచ్చు.

 

పెరుగును తలకు రాసుకుని అరగంట తరవాత తలస్నానం చేయాలి. కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసి మర్దన చేయడం వల్లా ఫలితం ఉంటుంది. తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగని రోజూ నూనె రాసుకోవాలని లేదు.

 

తలస్నానానికి గంటా, రెండు గంటల ముందు నూనె రాసుకుంటే చాలు. జుట్టు సంరక్షణకు సంబంధించి గోరింటాకు పొడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారం, పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.

 

జుట్టు విపరీతంగా రాలుతుంటే ఉడికించిన మందాల పువ్వుల్ని వాడితే ఎంతో మార్పు ఉంటుంది. అయితే ఆ పూతను నేరుగా కాకుండా పెరుగు లేదా గుడ్డులో కలిపి రాసుకోవాలి. కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.

 

 

Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana


Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?

 

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు

Hair fall dandruf white hair telugu lo home healthy tips | iiQ8 జుట్టు రాలిపోకుండా ఉండడం

 

Spread iiQ8

March 5, 2016 8:16 PM

132 total views, 0 today