Great Heart Moral Story – గొప్ప మనసు

గొప్ప మనసు❤️🙏 – Great Heart Moral Story

 

*నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది. పని చురుకుగానే సాగుతున్నది.*
*ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే “పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?” అని అడిగాను.”ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు”.. అన్నాడు.*

*అంతలో ఒక వ్యక్తి వచ్చాడు.నాకు నమస్కారం చేసి “అయ్యా! నా పేరు రాజయ్య.*

*పొరుగూరు నుంచి కుటుంబం తో వచ్చాను.*

*వారం నుండి పని కోసం తిరుగుతున్నాను.*

*ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయచూపించి పని ఇప్పించండి” అని ప్రాధేయ పడ్డాడు.*
*అక్కడే ఉన్న మేస్త్రి ” నీవెవరివో తెలీకుండా… నీపనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. *వెళ్ళు! వెళ్ళు!” అని కసురుకున్నాడు.*

*అతను నా వైపు జాలిగా చూస్తూ” ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయచూపండి” అని ప్రాధేయ పడ్డాడు.*
*నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ… కన్నుల్లో ఆకలి కనిపించింది.*
*మేస్త్రితో ” తెలిసిన పనే అంటున్నాడుగా!*

*ఈ రోజుకు పెట్టుకు చూద్దాం” అన్నాను.*
*మేస్త్రీ అయిష్టంగా “సరే! మీ ఇష్టం” అన్నాడు.*

Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O

*అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు. మధ్య మధ్యలో అతని వంక చూసాను. కష్టపడి పనిచేయడం గమనించాను. “పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది” అని మనసులో సంతోషించాను.*
*మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు.*

*రాజయ్య వంక చూసాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను.*

*మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను.* *రాజయ్య మాత్రంమంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు.*

*అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది.* *మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు.*
*రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. “నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి” అన్నాను.*
*”నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ దయవల్ల ఈ పూట గడుస్తుంది” అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను.*
*అతను బయలు దేరిపోయాడు. ఎందుకో తెలీదు… రాజయ్య వంకే చూడసాగాను. వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురు పడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటి పోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు.*

 

Moral Story Old Age Father Real Katha for Kids and Youth, Couple- * ఓ తండ్రి ఆవేదన.. తన మాటల్లోనే.. *




Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!


Job Hunting, Telugu Moral Stories, ఉద్యోగ వేట

*అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి.*
*రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థం అయిపోయింది. ఈపూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు….*

*అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది.*
*”ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు” ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది.*
*బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ” చాలా రుచిగా ఉంటాయి. మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు” అన్నాడు.*

*రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయసాగాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ” ఈ పని ఇంటి దగ్గర చేయి. లేకపోతే ఎగిరి పోతాయి”.. అన్నాడు.*
*రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు.*

*స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడ సాగాడు.*

*ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి.*
*రాజయ్య చేసినపనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు.*

*ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా.*
*”ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?” అన్నాడు.*
*”డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు” అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవినపడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు.*

*అతని ఆకలి… ఎదురుచూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధ పడింది.*
*అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి… రాజయ్యతో అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్టకోటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!”*

*అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు.*

*రాజయ్య అతన్ని వారిస్తూ” డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు” అని ముందుకు కదిలాడు.*
*కొంచెం సేపు అలానే ఉండిపోయాను.*

*తరువాత బైక్ స్టార్ట్ చేసి… రాజయ్య దగ్గరకు పోనిచ్చి “ఎక్కు” అన్నాను.*

*”వద్దు అయ్యగారూ!” అన్నాడు.” మరేం ఫర్లేదు. నేనూ అటేవెళ్తున్నాను” అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను.*
*ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.*
*”అదేంటి అయ్యగారూ!మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం” అన్నాడు రాజయ్య.*

*”డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు. మనసున్న వాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది. రేపు పనిలోకి వచ్చేయి!” అనిబైక్ స్టార్ట్ చేసాను.*

*బైక్ డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది.*

*నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు!!🙏

 

Bethala Kathalu Telugu, భేతాళ కథలు – మారిన నిర్ణయం


Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!

Spread iiQ8

May 5, 2023 10:21 AM

217 total views, 0 today