Friendship Story | స్నేహానికి నియమాలు సరిహద్దులు లేవు – తెలుగు చిన్నారుల కథ 2

Friendship Story 2

 

Hey Reader, Friendship Story in this page you will find Friendship Story in Telugu language, read and motivate.

 

స్నేహానికి నియమాలు సరిహద్దులు లేవు-తెలుగు చిన్నారుల కథ!

 

Friendship Story

Friendship Story

 

ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ, కోతుల గుంపుని చూసి, “మీరు నాతొ స్నేహం చేస్తారా?” అని అడిగింది.

 

కోతులు, “అబ్బో! నువ్వెంత పెద్దగా ఉన్నావో? మా లాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాల ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు,” అన్నాయి.

 

True Friendship Story In Telugu, ఇద్దరు సైనిక స్నేహితులు, స్నేహం మరియు నమ్మకం2

 

ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. “హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా?” అని ఆశగా అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావ్, నాలాగా చిన్న బొరియలలో, కన్నాలలో దూరగలవా? మనకి స్నేహం ఎలా కుదురుతుంది?” అంది.

 

Friendship Story

 

ఆ తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్నికూడా స్నేహం కోసం అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు. నీతో స్నేహం కుదరదు,”అని చెప్పింది.

 

Friendship Story In Telugu, స్నేహం మరియు డబ్బు, నిజమైన స్నేహితుడు

 

దారిలో నక్క కనిపిస్తే, దానిని కూడా అడిగి, కాదనిపించుకుంది. ఈలోగా, అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి.

“ఏమైంది?

అంత భయంగా పారిపోతున్నారు?” అని ఒక ఎలుగుబంటి ని అడిగింది.

“అయ్యో పులి జంతువుల్ని వేటాడుతోంది.” అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనందర్నీ కాపాడాలని అనుకుంది. పులి కెదురుగా నిలబడి, “దయచేసి నా స్నేహితులని చంపద్దు,” అంది.

 

“నీ పని నువ్వు చూసుకో …నీ కెందుకు వాళ్ళ గోల?” అంది పులి.

 

తన మాట వినేట్టు లేదని, ఏనుగు పులి ని గట్టిగా కొట్టి బెదరకొట్టింది.

 

పులి నెమ్మదిగా అక్కడినించి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. “నీ ఆకారం సరైనదే.

 

ఇప్పట్నించీ నువ్వు మా అందరి స్నేహితుడివని ” ఎంతో మెచ్చుకున్నాయి.

 

నీతి : స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం,ఆకారం లో ఉన్నా స్నేహం స్నేహమే!

 

Paropakaram Kids Moral Story | *ధర్మాత్ముడు* |

 




 

True Friendship Story In Telugu, ఇద్దరు సైనిక స్నేహితులు, స్నేహం మరియు నమ్మకం

 

Friendship Story | Best Friends మంచి స్నేహితులు:

 

పొట్ట ముత్తయ్య, పొడువు కనకయ్య మంచి స్నేహితులు. చిన్న చిన్న పనులవలన కుటుంబ పోషణ కష్టం అవుతుంది.

 

కావున ఏదైనా స్థిరమైన ఆదాయం వచ్చేటట్టు మార్గము చూపమని ఊరి పెద్ద ఈశ్వరయ్య దగ్గరకు వెళ్ళారు ఇద్దరు. మీరు ఇద్దరు మంచి స్నేహితులు కదా! ఏదైనా వ్యాపారం చేసుకోండీ. కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను అన్నాడు ఈశ్వరయ్య.

 

Paropakaram Kids Moral Story | *ధర్మాత్ముడు* | 3

 

సరే అంటూ ఈశ్వరయ్య దగ్గర అప్పుచేసి కిరాణ దుకాణం పెట్టారు. గల్లాపెట్ట దగ్గర ముత్తయ్య కూర్చుంటే, కొనడానికి వచ్చేవారికి సరుకులు ఇచ్చే బాద్యత కనకయ్యదిగా ఒప్పుకున్నారు.

 

కొన్నిరోజులలోనే ఈశ్వరయ్య అప్పు తీర్చేశారు. తక్కువ సమయంలో వారి వ్యాపారం బాగా అబివృద్ది చెందడంతో ఎదురుగా ఉన్న దుకాణదారుడు చంద్రయ్యకు అసూయ కలిగింది. ఎలాగైనా స్నేహితుల మద్య గొడవ పెట్టి వ్యాపారాన్ని దెబ్బ తీయాలనుకున్నాడు.

 

ఒక రోజు ముత్తయ్య దుకాణంలో లేని సమయం చూసి కనకయ్యతో “ నువ్వు రోజంతా నిలబడి పొట్లాలు కట్టివ్వాలి, ముత్తయ్య మాత్రం చక్కగా కూర్చొని డబ్బులు వసూలు చేస్తాడు అంటూ కల్పించి చెప్పాడు చంద్రయ్య. మరునాటి నుండి కనకయ్య, ముత్తయ్యతో పోట్లాడి గల్లాపెట్ట వద్ద కూర్చున్నాడు. పాపం ముత్తయ్యకు అల్మారాలో (సెల్ఫ్) సరుకు అందక కింద పడుతున్నాయి, డబ్బులు తీసుకొని చిల్లర ఇవ్వడానికి గాబరా పడి లెక్కలో తప్పులు జరిగాయ.

 

దీంతో వారి దుకాణానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొన్ని రోజులకు దుకాణం మూతపడే పరిస్తితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరయ్య ఆ ఇద్దరి స్నేహితులను పిలిపించాడు.

 

మీలో భేదాలు రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. కనకయ్యతో, చంద్రయ్య చెప్పిన మాటలు చెప్పాడు. “అసూయతో చంద్రయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారాన్ని చెడగొట్టుకున్నారు. అలా కాకుండా ఎప్పటిలాగే ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేసుకొండి.

 

ఇతరుల మాటలని వినకండి అని బెదిరించి పంపాడు ఈశ్వరయ్య. స్నేహితులు ఇద్దరు తమ తప్పును తెలుసుకొని ఎప్పటిలాగే ఎవరి పని వారు చేసుకుంటున్నారు. దుకాణం మంచి లాబాలతో నడుస్తుంది.

 

నీతి : ఎవరు ఏమి చెప్పినా ఆలోచించకుండా వినకూడదు.

 

Friendship Story

MAHABHARATA Day 8 | Episode 8 – The fight for the CROWN

Friendship Story | స్నేహానికి నియమాలు సరిహద్దులు లేవు - తెలుగు చిన్నారుల కథ 2


Sons and children born with due relationship – కొడుకులు బిడ్డలు బాకీ సంబంధం తో పుడతారు

Friendship Story పొడుపు కథలు Podupu Kathalu:

1. తెల్లని పోలీసుకు నల్లని టోపీ.
2. రెండిల్లకు ఒకే దూలం.
3. తోకలేని పిట్ట తొంబై ఆమడ పోవును.
4. ముడిస్తే మొగ్గ, విప్పుతే పువ్వు.
5. తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నాలు.
6. నోరు లేని పిట్ట తోకతోని నీల్లు తాగును.
7. కాళ్ళు ఉండి కదలలేనిది.
8. కళ్ళు ఉండి చూడలేనిది.
9. రెక్కలుంటాయి కానీ ఎగురలేదు.
10. అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరూ తినరు.
11. నేను శుబ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికి పడితే తెల్లగా ఉంటాను.
12. అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, మీ ఇంటికి వచ్చాను తైతక్కలాడాను.
13. కిట కిట తలపులు కిటాయి తలపులు ఎంత మూసిన తెరచిన చప్పుడు కావు ఏంటవి?
14. పండ్లు ఉంది కూడా నమలలేనిది.
15. ఊపుతే ఊగుతాయి కాని పీకుతే రావు ఏంటవి?
16. అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరం పోతాయి.
17. గదినిండా ముత్యాలు గదికి తాళము.
18. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం.
19. నాలో దేశాలు ఉంటాయి కాని మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కాని నీల్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కాని వాహనాలు ఉండవు, ఎవరు నేను?
20. పొట్టివానికి పుట్టెడు అంగీలు.

జవాబులు Podupu Kathalu with answers :
1. అగ్గిపుల్ల
2. ముక్కు
3. ఉత్తరం
4. గొడుగు
5. పనస పండు
6. దీపం
7. కుర్చి
8. కొబ్బరికాయ
9. ఫ్యాను
10. పల్లెము
11. బ్లాకు బోర్డు
12. చల్లకవ్వము
13. కనురెప్పలు
14. దువ్వెన
15. చేతివేళ్ళు
16. పెదవులు
17. దానిమ్మ పండు
18. తేనెతెట్టే
19. ప్రపంచ పటము
20. ఉల్లి గడ్డ


Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 

Spread iiQ8

August 13, 2023 9:09 AM

785 total views, 1 today