Yudha Kanda Sampoorna Ramayanam | iiQ8 సంపూర్ణ రామాయణం | యుద్ధకాండ

Yudha Kanda Sampoorna Ramayanam | iiQ8 సంపూర్ణ రామాయణం | యుద్ధకాండ   Yudha Kanda Sampoorna Ramayanam | iiQ8 సంపూర్ణ రామాయణం | యుద్ధకాండ   యుద్ధకాండ హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి ” హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు. సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉ…
Read more about Yudha Kanda Sampoorna Ramayanam | iiQ8 సంపూర్ణ రామాయణం | యుద్ధకాండ
  • 0

Sundara Kanda Sampoorna Ramayanam | iiQ8 సుందరకాండ – సంపూర్ణ రామాయణం

Sundara Kanda Sampoorna Ramayanam | iiQ8 సుందరకాండ - సంపూర్ణ రామాయణం    Sundara Kanda Sampoorna Ramayanam | iiQ8 సుందరకాండ సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ: సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి: సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. రాముడు సుందరాతి సుందరుడు, సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది? సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటె పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది. తతొ రావణనీతాయాహ్ సీతాయాహ్ శత్రుకర్షనహ్ | ఇయెష్హ పదమన్వెష్హ్టుం చారణాచరితె పథి || రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు(భూమికి దెగ్గరగా ఉండి, సర్వకాలములయందు సుభవార్తలను చెప్పే…
Read more about Sundara Kanda Sampoorna Ramayanam | iiQ8 సుందరకాండ – సంపూర్ణ రామాయణం
  • 0

Kishkindha Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం – కిష్కింధకాండ | iiQ8

Kishkindha Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం – కిష్కింధకాండ | iiQ8     Kishkindha Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం – కిష్కింధకాండ | iiQ8కబంధుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు. ఆ పంపా నదిలో అరవిసిరిన పద్మాలు, పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపలని చూసి రాముడు బాధపడ్డాడు. ఆయనకి వాటిని చూడగానే సీతమ్మ ముఖము, కన్నులు గుర్తుకొచ్చి భోరున విలపించాడు. అప్పుడాయన లక్ష్మణుడితో ” చూశావ లక్ష్మణా! ఈ ప్రాంతం ఎంత బాగుందో, ఈ చెట్లకి విశేషంగా పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కిందకి పడుతున్నాయి, ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటూ కదులుతూ ఉన్నాయి. అలా కిందకి పడుతున్న పువ్వులని, కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయుదేవుడు ఎవ్వరికీ కనపడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా! అనిపిస్తుంది. ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఇవన్నీ చూస్తుంటే, సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను నా స్వస్థతని కోల్పోతున్న…
Read more about Kishkindha Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం – కిష్కింధకాండ | iiQ8
  • 0

Aranya Kanda Sampoorna Ramayanam | iiQ8 అరణ్యకాండ సంపూర్ణ రామాయణం

Aranya Kanda Sampoorna Ramayanam | iiQ8 అరణ్యకాండ సంపూర్ణ రామాయణం   Dear All, here we will find Aranya Kanda Sampoorna Ramayanam | iiQ8 అరణ్యకాండ సంపూర్ణ రామాయణం. అయోధ్యకాండలొ ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక, 14 సంవత్సరముల తరువాత రాముడు తిరిగి రాకపోతే, నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. రాముడు ఆ అరణ్యంలో తాపసులు ఉండేటటువంటి ప్రదేశం వైపునకు వెళ్ళాడు. పుణ్యైః చ నియత ఆహారైః శోభితం పరమ ఋషిభిః | తత్ బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మ ఘోష నినాదితం | బ్రహ్మ విద్భిః మహా భాగైః బ్రాహ్మణైః ఉపశోభితం || ఆ ఆశ్రమాలలో ఉండేటటువంటి ఋషులు ఆకలిని జయించి నియమముతో కూడిన ఆహారమును తినేవారు, అందరూ వేదం చదువుకున్నారు, ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేద ధ్వని వినపడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే, ఆ ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఆశ్రమము దెగ్గర యజ్ఞములలో వాడే సృక్కు, స్రువము మొదలైన పరికరాలు ఉన్నాయి, అలంకారం కోసం సిద్ధం చెయ్యబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, లాజలు, అక్షతలు మొదలైనవి…
Read more about Aranya Kanda Sampoorna Ramayanam | iiQ8 అరణ్యకాండ సంపూర్ణ రామాయణం
  • 0

Ayodhya Kanda Sampoorna Ramayanam | అయోధ్యకాండ Part 2 | iiQ8 సంపూర్ణ రామాయణం

Ayodhya Kanda Sampoorna Ramayanam | అయోధ్యకాండ Part 2 | iiQ8 సంపూర్ణ రామాయణం   Ayodhya Kanda Sampoorna Ramayanam | అయోధ్యకాండ అయోధ్యకాండ దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు. దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతులవంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చేసేవారు. కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే….. తేషామపి మహాతేజా రామో రతికరః పితుః | స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః || రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి …
Read more about Ayodhya Kanda Sampoorna Ramayanam | అయోధ్యకాండ Part 2 | iiQ8 సంపూర్ణ రామాయణం
  • 0

Baala Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం – బాలకాండ | iiQ8

Baala Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం - బాలకాండ | iiQ8   Baala Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం - బాలకాండ | iiQ8 ఉపోద్ఘాతం: రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, “దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ “, నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంత…
Read more about Baala Kanda Sampoorna Ramayanam | సంపూర్ణ రామాయణం – బాలకాండ | iiQ8
  • 0