Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం)
Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
భగవానుడు:
మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు.
మూడుగుణాలు కల్గిన "మాయ" అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది. అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి, నేనే తండ్రి.
ప్రకృతి సత్వ, రజో, తమోగుణాలచే కూడి ఉంటుంది. నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కల్గినప్పుడు ఈ గుణాలకు బద్దుడవుతున్నాడు.
సత్వ గుణం పరిశుద్దమైనది. అది పాపాలనుండి దూరం చేస్తుంది. ఈ గుణం కలిగినవారు సౌఖ్యం,జ్ఞానం చే బంధితులు అవుతారు.
రజోగుణం కామ, మోహ, కోరికల కలయిక చేత కలుగుతోంది. ఈ గుణం కల్గిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు.
అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది.సోమరితనం,నిద్ర,పొరపాటు అనేవాటితో బంధితులను చేస్తుంది.
సత్వగుణం జీవున్ని సుఖబద్దుడిగా,రజోగుణం పనిచేయువానిగా,తమోగుణం ప్రమాదకారిగా చేస్తుంది.
ఒక్కొక్కప్పుడు ఒక్కో గుణం ఆధిపత్యం వహిస్తుంది.
…
Read more
about Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu