అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం.
యోగా యోగాసనాలు – :
యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.
ఆసనాలు వేయమన్నారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. ఉదయం లేవగానే నిరాహారంగానే ఆసనాలు వేయటం, యోగసాధన చేయటం శ్రేష్టం. అలాగే మధ్యాహ్నం భోజనానంతరం మూడు, నాలుగు గంటలు ఆగి ఆసనాలు వేయవచ్చు. పాలు మొదలగు పానీయాలు సేవిస్తే ఆతరువాత అరగంట ఆగి ఆసనాలు వేయవచ్చు. యోగసాధన చేయవచ్చు.
ఏ మనిషైనా తన తీరికను బట్టి తన పనులు, అవసరాలను బట్టి ఆసనాలు వేయటానికి, యోగసాధన చేయటానికి సమయం నిర్ణయిచుకోవాలి. అంతేకాని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఆసనాలు వేయాలని కానీ, యోగసాధన చేయాలని గాని నియమం లేదు. అవకాశాన్నిబట్టి ఇవి చూసుకోవాలి. ఆరోగ్యాన్ని అనుసరించి రోజుకు రెండు మూడు సార్లైనా ఆసనాలు వేయవచ్చు. యోగసాధన చేయవచ్చు.
The common side effect of the COVID-19 vaccine, iiQ8, World Health Organization WHO
ఎప్పుడైనా సరే ఆసనాలు వేసినా, యోగసాధన చేసినా నేల మీద మాత్రమే చేయాలి. అంతేకాని పరుపులు, దిండ్లు మొదలైన మెత్తని ఆసనాలు వేసుకొని చేయకూడదు. ఒకే గదిలో ఆసనాలో, యోగసాధనలో చేస్తూ ఉంటారనుకోండి. అలాంటప్పుడు ఆగది పరిశుభ్రంగా ఉండాలి. తుమ్ములు, దగ్గులు, పిల్లలగోల, మనుషుల అరుపులు మొదలైనవి ఉండకూడదు. వీలైనంత నిశ్శబ్దంగా ఉండాలి. మనస్సుకు ఏకాగ్రత ఎంతైనా అవసరం. మరీ అంతగా ఇబ్బందిగా ఉంటే ఆసనాలు వేసేచోట, లేదా యోగసాధన చేసే ప్రదేశంలో నేల మీద ఉన్ని రగ్గులుకానీ, నాలుగు మడతలు వేసిన నూలు వస్త్రంకానీ పరుచుకొని సాధన చేయవచ్చు. దీనిని బట్టి నేల మీద కూడా ఆసనాలు వేయకూడదని తెలుస్తోంది. గాలి, వెలుతురు ధారాళంగా గదిలోనికి వచ్చేటట్లు చూసుకోవాలి. ఆరుబయట ప్రదేశంలోనూ, మేడ, డాబాలపైనా ఆసనాలు వేయవచ్చు. యోగసాధన చేయవచ్చు.
యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఒక్కసారి చూద్దాం… ఉదయం పూట మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తాజాగా అన్పించినప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని ముఖం బాగా కడుక్కోవాలి. నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగి కొన్ని నిమిషాలు తర్వాత యోగాను మొదలుపెట్టాలి. ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగావల్ల డప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కానీ నీరసించకూడదు. యోగాసనాలు వేసేటపుడు సుదీర్ఘంగా, లయబద్ధంగా శ్వాస పీల్చుకోవడం మంచిది. శ్వాస పీల్చుకునేటప్పుడు నో రు మూసుకునే ఉండటం మంచిది.
పద్మాసన భంగిమ తామరపువ్వును పోలి ఉంటుంది. పద్మాసనం అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. పద్మ అంటే తామరపువ్వు అని, ఆసనా అంటే భంగిమ లేక స్థితి అంటారు. ఆసనాలు ప్రారంభించే ముందుగా.. నేల మీద చాపను గాని మందపాటి కాస్తంత మెత్తటి వస్త్రాన్ని పరుచుకోవాలి.
నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి.