Aadhi Bikshuvu Song Lyrics – సిరివెన్నెల (1986) చిత్రం –
ఆది భిక్షువు వాడినేది కోరేదీ
Aadhi Bikshuvu Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by KV Mahadevan, and sung by SP Balu from the Telugu movie ‘Sirivennela‘.
Aadhi Bikshuvu Song Credits
Sirivennela Cinema Released Date – 20 May 1986 | |
Director | K Viswanath |
Producers | Ch Ramakrishna Reddy, N Bhaskara Reddy, Ujjuri Chinaveerraju |
Singer | S P Balasubramanyam |
Music | KV Mahadevan |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Baby Meena |
Music Label |
ఆది భిక్షువు వాడినేది కోరేదీ Song Lyrics in Telugu:
ఆది భిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడినేది అడిగేదీ
ఆది భిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడినేది అడిగేదీ
ఏది కోరేది… వాడినేది అడిగేది
ఏది కోరేది… వాడినేది అడిగేది
తీపి రాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపి రాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది… వాడినేది అడిగేది
ఏది కోరేది… వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది… వాడినేది అడిగేదీ
ఏది కోరేది… వాడినేది అడిగేదీ
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు
మన్మధుని మసి చేసినాడు, వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు
దనుజులను కరుణించినాడు, వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కోరేటి
ఉగ్గు శంకరుడు, వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది… వాడినేది అడిగేది