Gundello Emundo Song Lyrics in Telugu, గుండెల్లో ఏముందో

Gundello Emundo Song Lyrics in Telugu, గుండెల్లో ఏముందో

 

 

Paripoke Pitta Song Lyrics in Telugu, పారిపోకే పిట్టా

 

గుండెల్లో ఏముందో – Gundello Emundo Song Lyrics:

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం
నువు ఎదురుగ నిలబడితే

కదలదు కద సమయం
నీ అలికిడి వినకుంటే

కలవరమో తొలివరమో
తెలియని తరుణమిది

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా…
మనసా మనసా మనసా…
మనసా మనసా మనసా… ఓ మనసా!

పువ్వులో లేనిది…
నీ నవ్వులో ఉన్నది…
నువ్వు ఇపుడన్నది…
నేనెప్పుడూ విననిది…

నిన్నిలా చూసి పయనించి
వెన్నెలే చిన్న బోతోంది
కన్నులే దాటి కలలన్నీ
ఎదురుగా వచ్చి నట్టుంది…
ఏమో, ఇదంతా
నిజంగా కలలాగే ఉంది!

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది…
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది…

ఎందుకో తెలియని…
కంగారు పడుతున్నది…
ఎక్కడా జరగని…
వింతేమి కాదే ఇది…

పరిమళం వెంట పయనించి
పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ
పరిచయం తోడు కోరింది

దూరం… తలొంచే…
ముహూర్తం ఇంకెపుడొస్తుంది!

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం
నువు ఎదురుగ నిలబడితే…

కదలదు కద సమయం
నీ అలికిడి వినకుంటే…

కలవరమో తొలివరమో
తెలియని తరుణమిది!
మనసా మనసా మనసా…
మనసా మనసా మనసా…
మనసా మనసా మనసా… ఓ మనసా!

 

 

Janaki Kalaganaledu Song Lyrics In Telugu, జానకి కలగనలేదు


Yemi Cheyamandhuve Song Lyrics In Telugu, Priyuralu Pilichindi, ఏమి చేయమందువే –

Gundello Emundo Song Lyrics in Telugu, గుండెల్లో ఏముందో


Gelupu Thalupule Song Lyrics In Telugu గెలుపు తలుపులే


Erraani Kurradaanni Song Lyrics in Telugu, ఎర్రాని కుర్రదాన్ని గోపాల

Gundello Emundo Video Song || Manmadhudu Movie || Nagarjuna, Sonali Bendre, Anshu

Spread iiQ8

December 21, 2022 9:00 AM

571 total views, 1 today