Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

విభూతి యోగము(10 వ అధ్యాయం)
Sri Bhagavad Gita Part10, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
కృష్ణుడు:
నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను.
నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు.ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం.నాకు మొదలుచివరా లేవు.సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు.
అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి.
సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు.
నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు.
నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు.
నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను.
అర్జునుడు:
నువ్వు శాశ్వతుడని,పరమాత్ముడనీ, ఆది అనీ ఋషులు, వ్యాసుడు అందరూ, నువ్వూ అంటున్నారు.నేనూ నమ్ముతున్నాను. నిన్ను నువ్వుతప్ప ఇతరులు తెలుసుకోలేరు. ఏఏ వస్తువులందు ఏ విధంగా నిన్ను ధ్యానిస్తే నిన్ను తెలుసుకోగలవో చెప్పు. వివరంగా చెప్పు.
కృష్ణుడు:
నా విభూతులు అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు.ఎందుకంటే అవి అనంతం.కొన్ని ముఖ్యమైనవి చెప్తాను విను.
అన్ని ప్రాణుల ఆత్మను,సృష్టిస్థితిలయాలు,ఆదిత్యులలో విష్ణువును,జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను, మరుత్తులలో మరీచి, చంద్రుడను, వేదాలలో సామవేదం, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియాలలో మనసును, ప్రాణుల చైతన్యశక్తిని, రుద్రులలో శంకరుడు, యక్షరాక్షసులలో కుబేరుడను, వసువులలో పావకుడు,పర్వత శిఖరాలలో మేరువు,పురోహితులలో బృహస్పతి, సేనాధిపతులలో కుమారస్వామిని, సరస్సులలో సముద్రాన్ని, మహర్షులలో భృగువు, వ్యాకరణంలో ఒంకారం, యజ్ఞాలలో జపయజ్ఞం, స్థావరాలలో హిమాలయం,వృక్షాలలో రావి, దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్దులలో కపిలుడు,గుఱ్ఱాలలో ఉచ్చైశ్శ్రవం,ఏనుగులలో ఐరావతం, మానవులలో మహారాజు, ఆయుధాలలో వజ్రాయుధం, గోవులలో కామధేనువు,ఉత్పత్తి కారకులలో మన్మథుడు, పాములలో వాసుకి నేనే.
నాగులలో అనంతుడు, జలదేవతలలో వరుణుడు, పితృదేవతలలో ఆర్యముడు,శాసకులలో యముడు, రాక్షసులలో ప్రహ్లాదుడు, కాలం, మృగాలలో సింహం, పక్షులలో గరుత్మంతుడు,వేగము కల వాటిలో వాయువు, శస్త్రధారులలో శ్రీరాముడు,జలచరాలలో మొసలి, నదులలో గంగానది, సృష్టికి ఆదిమధ్యాంతాలు నేనే. వాదాలు కూడా నేనే.
అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వసమాసం, సర్వకర్మ ఫలప్రదాత, మ్రుత్యువూ, సృజనా, స్త్రీ శక్తులలో కీర్తీ, లక్ష్మిని, వాక్కును, స్మృతీ, మేధ, ధృతి, క్షమ నేనే.
సామములలో బృహత్సామం,ఛందస్సులలో గాయత్రి,నెలలలో మార్గశిరము,ఋతువులలో వసంతమూ నేనే.
వంచనలలో జూదాన్ని,తేజోవంతులలో తేజం,విజయం,కృషి చేయువారి ప్రయత్నం,సాత్వికుల సత్వగుణం,యాదవులలో వాసుదేవుడను,పాండవులలో అర్జునుడను,మునులలో వ్యాసుడు,కవులలో శుక్రుడను నేనే.

దండించేవారి దండనీతిజయించేవారి రాజనీతిరహస్యాలలో మౌనంజ్ఞానులలో జ్ఞానం నేనే.

nae986

 

సర్వభూతాలకు బీజకారణం నేనే.నేను కానిది ఏదీ లేదు.
నా విభూతులు అనంతం.కాబట్టి సంగ్రహంగా చెప్పాను.
ఐశ్వర్యంతోను, కాంతితోను, ఉత్సాహంతోను కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశలని తెలుసుకో.
ఇన్ని మాటలు దేనికినా తేజస్సులోని ఒకేఒక్క కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదని గ్రహించు.

 

************




Spread iiQ8

December 24, 2015 8:45 PM

337 total views, 1 today