అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo
అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo
Healthy Tips … అందం-ఆరోగ్యం
జుట్టుకు, తలకు సంబంధించి కొన్ని చిట్కాలు
1. రెండు అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. రెండుటేబుల్‌స్పూన్ల తేనెను అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం. ఇలా చేస్తే మీ జూట్టు పట్టులా మెరుస్తుంది.
2. వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
3. ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.
4. కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి
5. ఉసిరి పొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటి మీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.
అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo | iiQ8
6. ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పు డు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.
7.ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
8. ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
9. ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.
10. కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.
11. శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటిన్నిటిని గాలికి ఆరబెట్టి, ఎండిపోసిన తరువాత విడివిడిగా పొడిచేసుకొని ఒకటిగా కలిపి తలస్నానచూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.
12. జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.
13. జుట్టుకి మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ద తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి కొంతమందిని. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.
14. తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.
అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo | iiQ8
15. పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.
16. పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు తలా పావుకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగేయాలి.
17. పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.
Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?
Find everything you need.
iiQ8 indianinQ8.com
List of Countries in the World | iiQ8 info
Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం
అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo | iiQ8
18. బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
19. వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.
20. కేశ సౌదర్యం ద్విగిణీకృతం కావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని తెలుసు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నదే చాలామందిలో తలెత్తే సందేహం. మీదీ ఇదే అభిప్రాయమైతే ఇది చదవండి. ఒక్కమాట… ఈ అహార ప్రణాళిక రూపొందించుకునే ముందు మీకు రక్తహీనత, ధైరాయిడ్, చుండ్రు సమస్యలు ఉన్నయేమో పరీక్ష చేయించుకోవడం మేలు.
21. రక్తహీనత వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే ఇనుము సమృద్దిగా లభించే ఆహారం తప్పనిసరి. మాంసం, గుడ్డు, కీమా, తాజా ఆకుకూరలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఓట్స్, గోధుమలు, ఫిగ్స్, ఆప్రికాట్ తదితరాల ద్వారా ఇనుము పుష్కలంగా అందుతుంది.
Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana
22. అన్ని రకాల నిమ్మజాతి పండ్ల ద్వారా విటమిన్ ‘సి’ సమృద్ధిగా లభిస్తుంది. ఇనుము ఆధారిత ఆహారపదార్ధాలు తీసుకుంటున్న శాకాహారులు మాత్రం వాటితోపాటు విటమిన్ ‘సి’ ఉండే వస్తువులూ తప్పనిసరిగా తీసుకోవాలి.
23. దువ్వెన, హెయిర్‌బ్రష్‌ల బ్రిసిల్స్ పెళుసుబారినట్లు అనిపిస్తే వాడకం ఆపేయాలి, లేదంటే వెంట్రుకలు పాడైపోతాయి. దువ్వెనలను అధిక వేడి ఉన్న హెయిర్ డ్రయర్ సమీపాన ఉంచకండి, వేడికి దువ్వెన పళ్లు దెబ్బతింటాయి.
అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo | iiQ8
Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?
అందం-ఆరోగ్యం Hair fall hair care treatment Telugu lo | iiQ8