Telugu Moral Stories for Kids, Cities need everything from Villages, పట్నాలకు అన్నీ పల్లె ల నుండి కావాలి
మా భాషే ఇంత, మా పేమ కూడ ఇంతే.మా అనుబంధాలు ఎప్పుడు పెనవేసుకుని చాలా గట్టిగా ఉంటాయి. Telugu Moral Stories for Kids, Cities need everything from Villages, ఎవరు అయిన చుట్టం వచ్చారు అంటే చుక్కలు చూపించేము మా ఆప్యాయతలతో ఆతిధ్యంతో. పచ్చని చెట్లు పొలాలు, అందమైన చెరువు గట్లు, మనసు పులకరించే పిల్ల కాలువలు, మట్టి సువాసనలు, రుచికర వంటలు ఇలా ఒకటి ఏంటి ఎన్నో అందమైన మజిలీలు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా ఆయ్..
…………. ఇవన్నీ గోదావరి పరిసర ప్రాంత ప్రజల సంపద అండి ఇక మనం కథలోకి దూరేద్దాం అండి.
పచ్చని పొలాల నడుమ అందమైన ప్రకృతిలో గోదారమ్మ ఆశీర్వాదంతో గోదారమ్మ గట్టుకు ఆనుకుని రెండు కిలోమీటర్ల దూరంలో “మాఊరు” అనే ఊరిలో అందమైన పెద్ద పెద్ద లోగిలిలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు.
ఆ ఉమ్మడి కుటుంబాలలో ఒకరు అయిన వెంకటరావు గారు ఊరి పెద్దగా ఉండేవారు, ఆయనకి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు. తమ్ముళ్లకు చెల్లెలకు అన్నయ్య అంటే పంచ ప్రాణాలు. ఆయన మాటే వేదంగా ఉండేవారు.
వ్యవసాయమే ఆధారంగా బ్రతికే కుటుంబాలు ఆ ఊరిలో, పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. తన ఊరిలో ఎవరు అయిన చదువుకోవాలి అంటే పెద్ద ఆసక్తి కనబర్చేవారు కాదు అని వెంకటరావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు.
వెంకటరావు గారి స్నేహితుడు శ్రీనివాసరావుకి కబురు పంపాడు తన దగ్గరకు రమ్మని. శ్రీనివాసరావు తన దగ్గరకు రాగానే మనం ఇద్దరం పట్నంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గరకు వెల్దాము. మూసివేసిన మన స్కూలుని మళ్ళీ తెరిపిద్దాం అని ఇద్దరు సైకిల్ మీద పట్నానికి బయలుదేరారు.
Best friends Telugu lo stories kathalu Ramu – Somu , రాము – సోము
Telugu Friendship Stories, Varsham Varshini Varsha, వర్షం – వర్షిణి – వర్ష Rain katha
కలెక్టర్ గారితో వెంకటరావు గారు మాట్లాడుతూ మా ఊరికి సదుపాయాలు అడగడం లేదు పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ ని తెరిపించండి అని అడగగా. మనం ఇప్పుడు 1980లో ఉన్నాము, రేపటి తరానికి చదువులు చాలా ముఖ్యం వెంకటరావు గారు. తప్పకుండా మీ ఊరిలో ఉన్న స్కూల్ ని ప్రారంభిస్తాం అని కలెక్టర్ మాట ఇవ్వగానే వెంకటరావు గారు తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యారు.
అనుకున్న సమయానికి స్కూల్ ప్రారంభం అయింది, ఊరిలో ఉన్న పిల్లలే కాకుండ చుట్టుపక్కల ఊరిలో ఉన్న పిల్లలు కూడ స్కూల్ కి వెళ్లడం మొదలు అయింది. మురళి మాస్టారు గారు ఆ స్కూల్ కి వచ్చారు పిల్లలకు పాఠాలు చెప్పడానికి.
స్కూల్ పిల్లలలో వెంకటరావు గారి అబ్బాయి రవి కూడ అదే స్కూల్ లో చదివేవాడు.రవికి స్కూల్ లో ఉన్న ప్రతి ఒక్కరు స్నేహితుడే. రవి ఎప్పుడు మురళి మాస్టర్ తో ఏంటి మాస్టర్ మీరు రాక ముందు ఎప్పుడు ఆడుకునే వాళ్ళము, మీరు వచ్చాక చదువు చదువు అని చంపుతున్నారు.మా పొలాలు గట్లు ఏమైపోవాలి, చెరువులో చేపలు ఎవరి మాటలు వింటాయి, పైరు గాలిలో పాటలు ఎవరు పాడతారు, మీరు అందరిని ఇక్కడికి తీసుకు వచ్చి బుక్స్ తిరగేయండి అని చంపుతున్నారు అనగానే మురళి మాస్టర్ నవ్వుకుని పోయి బుక్స్ తీసి చదువుకోరా వెధవ అనగానే రవి వెళ్ళిపోయి తల కొట్టుకుని చదువుకుంటున్నాడు.
Telugu Moral Stories for Kids, Cities need everything from Villages,
ఊరు అంత ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది, ప్రతి నెల ఏదో ఒక పండగ జరుగుతూనే ఉండేది. పిల్లల ఆటలు అన్ని ఇన్ని కాదు కళ్ళు కూడ సరిపోవు అన్నేసి ఆటలు ఆడుతూ ఉండేవారు. ఆడపిల్లలు ఏమో తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మా ఇలా ఆడుతూ ఉంటే అబ్బాయిలు దొంగా పోలీస్, కరెంట్ షాక్, కబడ్డీ ఆటలు ఆడుతూ ఉండేవారు. రవి ఒక రోజు ఇలా దొంగా పోలీస్ ఆట ఆడుతూ ఉండగా పరిగెడుతూ అక్కడే తొక్కుడు బిళ్ళ ఆడుతూ ఉన్న ప్రసన్న ని బలంగా గుద్దేశాడు. పాపం ఇద్దరు పడిపోయారు, ప్రసన్న కి ఏమో చాలా కోపం చిన్న పిల్లల కాదు చిన్న రాకాసి లాగ ఉండేది.
ఆటని మధ్యలో వదిలేసి ప్రసన్న రవి మీదకి వెళ్తుంది, ఇలాంటి హఠాత్తు పరిణామాన్ని ముందుగా గమనించిన రవి కాలికి దెబ్బ తగిలిన ప్రసన్న నుండి కాపాడుకోవడానికి ఒంటి కాలుతో పరిగెడుతూ ఉన్నాడు.పాపం రవి ప్రసన్న కి దొరికిపోయాడు, రవి ప్రసన్న తో నీకు దండం పెడతాను నన్ను వదిలేయి రేపు మా అమ్మ చేసిన మిఠాయి స్కూల్ కి తీసుకు వస్తాను అని బ్రతిమి లాడితే ఏమి చేయకుండా ప్రసన్న రవిని వదిలేసింది.అలా అనుకున్నట్టే స్కూల్ కి తరువాత రోజు మిఠాయి తీసుకుని వెళ్ళి ప్రసన్నకి ఇచ్చేసాడు.
Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8
గోదారమ్మ హోయాలో ఊగిసిలాడుతూ వెళ్తున్న ఆ ఊరిలో ఒక్కసారిగా పెను తుఫాను లాగ వర్షం వచ్చింది, గోదారమ్మ ఉగ్రరూపం దాల్చుతుంది. ఇన్ని రోజులు బాగానే ఉన్న ఎప్పుడు ప్రకృతిని ఇలా చూడలేదు ఆ ఊరి ప్రజలు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు ఎప్పుడు వరద వచ్చి తమ ప్రాణాలు కొట్టుకుని పోతాయా అని. చాలా మంది ఆ ఊరిలో ప్రజలు ప్రాణం అయిన వదిలి పెడతాము గాని ఊరిని మాత్రం వదిలి పెట్టము అని గుండెల్లో నిండిన ప్రేమతో బాధగా ఆ మాటలు అంటున్నారు. ఇది కదా ఊరి మీద మమకారం అంటే అక్కడే ఉన్న మురళి మాస్టర్ కన్నీరు పెట్టుకున్నాడు. దేవుడు కరుణించి గోదారమ్మ ఉగ్రరూపం మానేసి ఎప్పుడు ఉండే గోదావరిలా అయిపోయింది. ఒక్కసారిగా కుదిపేసిన గోదావరికి పూజలు చేయడం మొదలు పెట్టారు, తమ ఊరు తప్ప పక్కన ఉన్న ఊరులన్ని కొట్టుకుని పోయాయి.1986 గోదావరి అంటే ఎవరు మర్చిపోలేనంతగా ఆ ప్రళయం వచ్చింది.
కాలం గడుస్తూ వస్తుంది, రవి పెద్ద వాడు అయ్యాడు. పదవ తరగతిలోకి అడుగు పెట్టాడు. స్కూల్ చాలా మార్పు వచ్చింది, చదువుకునే పిల్లల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. రవి పదవ తరగతి రావడంతో వాళ్ళ నాన్న గారు చాలా క్రమశిక్షణ మొదలు పెట్టారు. నిత్యం చదువు అని చెప్పడం వల్ల రవి కి చాలా కోపం వచ్చేది, కానీ పెద్ద వారికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండేవాడు.
రవి , ప్రసన్న , చందు, సాహితీ, మరియు ప్రసాద్ ఈ ఐదుగురు మాత్రమే 10 వ తరగతి చదివేవారు. రవి మరియు ప్రసన్న ఒక్క నిమిషం పడేది కాదు, రవి ఏమన్నా అంటే ప్రసన్న కొడతాకి వచ్చేది. రవి ఎప్పుడు ప్రసన్న ని ఏదో ఒకటి అని పారిపోతు ఉండేవాడు.
మురళి మాస్టర్ ఇంట్లో వీళ్లు లాంతరు వెలుగులో చదువు కుంటు ఉండేవారు, అప్పట్లో ధనవంతులు ఇంట్లోనే కరెంట్ ఉండేది. కిరోసిన్ దీపాలలో చదువుకుంటూ ఉత్తములు అయిన వారు చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యంగా మన అంబేద్కర్ గారు ఉన్నారు అని చెప్పేవాడు మురళి మాస్టర్ గారు పిల్లలతో.
ఇక ఊరిలో చంద్రయ్యకి ఒక కిరాణా కొట్టు ఉండేది, ఆ చుట్టుపక్కల ఊరిలో ఉన్న ఏకైక కొట్టు అది. చంద్రయ్య కొట్టులో సామానులు కొనే దాని కన్నా జనాలు కొట్టేసేవి ఎక్కువ ఉండేవి,చంద్రయ్య ఈ బాధ తట్టుకోలేక తలపిక్కొనే వాడు. మళ్ళీ ఇంకొక బోనస్ చంద్రయ్యకి సామానులు కొన్న వాళ్ళు వెళ్లే అప్పుడు కొంచెం బెల్లం పెట్టండి కొంచెం పప్పు పెట్టండి అని తినడానికి అని చుక్కలు చూపించేవారు అక్కడ ఉన్న జనం.
ఊరిలో సుబ్రమణ్యం స్వామి షష్ఠి వచ్చింది, ఊరు అంత హడావిడి ఉండేది. గుడికి జనం చాలా మంది వచ్చేవారు, గుడి బయట సామానులు అమ్ముకునే వాళ్ళకి మళ్ళీ చుక్కలే ఊరి జనాలతో. కొనేది ఉండదు చచ్చేది ఉండదు ఇది ఎంత అది ఎంత అని నస పెట్టి వాడిని చంపి చివరికి వాడి చేత ఉచితంగా ఇప్పించుకుని తీసుకుని వెల్లవారు ఆ ఊరి జనాలు. ఇక ఆ అయిదు రోజులు రోజుకు ఒక సినిమా చొప్పున అయిదు రోజులు పెద్ద తెర కట్టి సినిమా వేసేవారు. ఊరు వాడ మొత్తం కలిసి వచ్చేవారు సినిమాలు చూడడానికి. లేకపోతే ఎడ్ల బండి కట్టుకుని 10 మైళ్ళు వెళ్ళాలి సినిమాకి అని అందరూ వచ్చేవారు. చివరి రోజున అందరికి అన్న సందర్పణ చేసేవారు.
ఇక గోదారోళ్ళు అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి
కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story
కొ..కో.. అండి ఒకటి కొబ్బరి చెట్లు రెండు కోడి పందాలు. కొబ్బరి చెట్ల అందాలు అలాంటివి, కోడి పందాలు వ్యసనం ఇంకో లాంటిది.
రవి ఇంట్లో వాళ్ళ నాన్న గారు వెంకటరావు గారు ఇక ఇక్కడ చదువులు అయ్యాక, పెద్ద చదువులు కోసం పట్నం వెళ్ళాలి అక్కడ నువ్వు చదువుకుని ప్రయోజకుడివి అవ్వాలిరా అని చెప్పారు. ఇక తప్పదు అని మొహం పెట్టాడు రవి. రవి వాళ్ళ అమ్మతో ఇంట్లోకి వెళ్ళాక నేను వెళ్లను అమ్మ నువ్వు చెప్పు నాన్నకి అంటే అలా కాదురా మీ నాన్న నలుగురికి చదువు విలువ గురించి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు, నీ భవిష్యత్తు గురించి కదరా చెప్పేది నా మాట విను అంది. ఇక రవి కక్కలేక మింగలేక పోనీ నాతో ఆవకాయ పచ్చడి నెయ్యి పంపించండి, మళ్ళీ అక్కడ ఈ రెండు లేకపోతే ముద్ద దిగదు అని స్కూల్ కి వెళ్ళిపోయాడు.
కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story
ఇంకో వారంలో పదవ తరగతి పరీక్షలు, అందరూ బాగానే ఉన్నారు ఒక రవి తప్ప. దిగులుగా ఉన్నాడు రవి అది చూసిన మురళి మాస్టారు వచ్చారు రవి దగ్గరకు. రవి బాధపడకు చదువులు ఇప్పుడు ఉన్న కాలంలో చాలా అవసరం. చూసావు కదా మన ఊరిలో ఉన్న జనాల బ్రతుకులు వర్షం కరుణిస్తే రైతుల పంటలు పండుతాయి, ఏ మాత్రం తేడా వచ్చినా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.కాలం మారుతుంది మొన్నటి దాక కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నాము ఇప్పుడు కరంట్ దీపాల వెలుగులో చదువుతున్నాము. మీ నాన్న గారికి చదువుకోవాలి అని ఉన్న చదువుకోలేకపోయారు, తనలా నువ్వు అవకూడదు అని ఆయన కోరుకుంటున్నారు, చదువు చాలా ముఖ్యం దానితో పాటు సంస్కారం కూడ ముఖ్యం. ఊరు దాటి వెళ్ళాక విజ్ఞత మర్చిపోకూడదు, ఊరి మూలాలు మర్చిపోకూడదు. అలాగే మాస్టారు మీ అందరి నమ్మకం కాపాడుతాను అని చెప్పాడు.
పరీక్షలు అయిపోయాయి, గోదారమ్మ గట్టు మీద ఆటలు ఎక్కువ అయిపోయాయి. పడవలు వేసుకుని వెళ్లి వల వేసి సరదాగా చేపలు పట్టడం. నిలువునా తడుస్తూ ఈత కొడుతూ ఇది కదా మా గోదారి అని నవ్వుతూ నావను చూస్తూ మళ్ళీ చదువులకు వెళ్లి తిరిగి వస్తాన అని బాధ పడుతూ రవి ఇంటికి వెళ్తున్నాడు గోదారమ్మ ఒడిలో నుండి. తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ ఉంది గోదారమ్మ ఒడిలో వదిలి వెళ్ళాలి అంటే ఏడుపు తన్నుకుని వస్తుంది అని రవి తన స్నేహితుడు ప్రసాద్ కి చెప్తూ ఉన్నాడు.
Telugu Moral Stories for Kids, Cities need everything from Villages,
రవి ప్రసాద్ తో ఒకసారి చంద్రయ్య కొట్టుకు వెళ్దాం పదరా అన్నాడు, ఇద్దరు కలిసి చంద్రయ్య దగ్గరకి వెళ్ళి నీకు తెలియకుండా నీ కొట్టులో చాలా కొట్టేసాము ఇవిగో డబ్బులు అని ఇచ్చేసాడు. ఇంతలో ప్రసన్న వచ్చింది నాకు మిఠాయి ఇవ్వవా ఇక వెళ్లిపోతున్నారు అంట కదా ఈ ఊరు వదిలేసి మీ నాన్నగారు కూడ నీతో పాటే వచ్చేస్తారు అంట కదా, మొన్నటి దాకా నువ్వు ఒక్కడివే వెళ్తాను అన్నావు కదా మీ కుటుంబం మొత్తం వెళ్ళిపోతుంది అంట కదా అంటే, రవి ప్రసన్న తో అవును మొత్తం అందరం వెళ్లిపోతున్నాము. మళ్ళీ వస్తాము అని నమ్మకం అయితే నాకు లేదు, మేము పట్నం లో ఉంటాము అంట. ఆ పట్నం లో నా చదువు అయ్యేదాక ఉండి మళ్ళీ వచ్చేస్తాను ప్రసన్న అని చెప్పి తనలో దుఃఖాన్ని మింగుకుని వెళ్ళిపోయాడు.
Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష
వెంకటరావు తన స్నేహితడు శ్రీను తో కలిసి సరదాగా చెరువు గట్టు మీదకు వెళ్ళి, ఈ 30 సంవత్సరాల స్నేహం వదిలి వెళ్లక తప్పడం లేదు, అందులోనూ గోదావరి ప్రేమ వదిలి వెళ్ళాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు. పిల్లలను మంచిగా చదివించాలి అంటే ఇక్కడ ఉన్న ఆదాయం సరిపోవడం లేదు. మొన్ననే మా చిన్న తమ్ముడు అప్పులు బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు కదరా. నా పిల్లలు బాగుండాలి అంటే నాకు వేరే మార్గం లేదు, ఊరు వదిలి వెళ్తే ప్రాణం పోయేలా ఉంది. ఇక్కడ ఉన్న పొలాలు మన భాష మన యాస ఎక్కడ ఉంటాయిరా. ఆప్యాయంగా పిలిచే ప్రేమలు ఎక్కడ వెతుక్కోవాలో ఆ పట్నంలో, సంక్రాంతి పండగకి తప్పకుండా వస్తాము. నా పొలం నువ్వు చూసుకో, పట్నం వెళ్ళాక నీకు ఉత్తరం రాస్తాను. రవి గాడిని ఒక్కడినే పంపుదాము అనుకున్న కానీ వాళ్ళ అమ్మ బెంగతో కూడ తట్టుకోలేదు. మన ప్రేమలు ఇంతేరా, ఎక్కువ ప్రేమను కూడ తట్టుకోలేము. ఎంతరా కాలం ఇట్టే గడిచిపోతుంది, మళ్ళీ వచ్చేస్తాను రవి గాడి చదువులు అయిపోయిన వెంటనే అనగానే ఇక వాళ్ళ స్నేహం పాపికొండల సాక్షిగా బరువెక్కిన గుండెలతో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వెళ్తున్నారు గట్టిగా.
వెంకటరావు గారు ఊరు వదిలి వెళ్తున్నారు అంటుంటే చాలా మంది వద్దు అండి మన ఊరు మనకోసం ఉంది అండి, ఊరి మీద జాలి లేకుండా ఎలా వెళ్తారు మీరు అని ప్రతి ఒక్కరు అనేవాళ్లే.ఇంత అభిమానము చూసి వెంకటరావు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఇంతలో ఊరి జమీందారు శేషాద్రి గారు వచ్చి నీకు ఏమి తక్కువ చేసాము నీకు ఏమి కావాలో చెప్పు కాకినాడ కాజా తెప్పించాల, ఆత్రేయపురం పూతరేకులు తెప్పించామంటావ, పులస చేప వండించమంటావ లేక హరికథలు చెప్పించమంటావ చెప్పు అని బాధలో ఉన్న వెంకటరావుని నవ్వించి హత్తుకుని ఇది కదా మన వెటకారం అని నువ్వు వస్తు ఉండు ఊరికి, మీ లోగిలి మా లోగిలి ఏది మర్చిపోకు ఇక్కడ అని వెంకటరావుని భారంగా పంపించేశారు.
కాలం గడుస్తూ ఉంది, ఊరి లో ఉన్న ప్రసన్నకి ప్రసాద్ కి మురళి మాస్టర్ కి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు రవి.వెంకటరావు గారు కూడ బాగ స్థిరపడ్డారు పట్నంలో,రవి చదువు కూడ అయిపోయింది. రవికి పట్నంలో మంచి జాబ్ వచ్చింది. ఎక్కడ ఉన్న తన గుండెల్లో ఉన్న బాధ మామూలుగా లేదు తన ఊరి కోసం తపన గోదారమ్మ ఒడి కోసం చూస్తూ ఉన్నాడు. పట్నం వచ్చి 15 సంవత్సరాలు అయింది నాన్న గారు ఒక్కసారి కూడ మన ఊరు తీసుకుని వెళ్ళలేదు అంత కక్ష ఏంటి నాన్న గారు మరి ఇంత ఉండకూడదు. డబ్బులు ఎక్కువ అయితే మనము చచ్చే అప్పుడు ఏమి తీసుకుని వెళ్లము కదా మీరు ఊరు వదిలి వచ్చే అప్పుడు ఎందుకు అలా ఏడ్చారు ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారు అని అడగగా, నువ్వు చిన్నపిల్లోడివిరా లోపలకి పోయి అన్నం తిని పడుకో అన్నాడు.
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories
ఇక రవికి కోపం వచ్చి లోపలకి వెళ్ళి ఊరు ఎలా ఉంది వచ్చిన రెండు సంవత్సరాల వరకు అందరూ ఉత్తరాలు బాగానే రాసేవారు కదా తరువాత ఎవరు ఏమి రాయలేదు, ఎన్ని ఉత్తరాలు రాసిన ఎవరు ఏమి తిరిగి ఉత్తరాలు రాయలేదు.ఇక ఏమి చేయాలో తెలియక ఉండపట్టలేక ఇంట్లో చెప్పకుండా తన ఊరు బయలుదేరాడు, తన స్నేహితులని చూడవచ్చు అని ఆశతో గోదారమ్మ గట్టుపక్కన ఇంకోసారి ఆడుకోవచ్చు అని ఆశతో వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఊరు వెళ్ళాక అక్కడ ఊరు లేదు పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. ఇక్కడ ఊరు ఉండేది కదా అని అమాయకంగా అక్కడ ఉన్న వేరే జనాలను అడిగాడు. వాళ్ళు పట్నం లో ఉన్న జనాలకి దాహం తీర్చడానికి ఇక్కడ నుండి కాలువలు తీసి పట్నాలకి నీళ్లు తరలిస్తున్నారు, వేరే జిల్లాల కోసం నీరు ఇక్కడ నుండే తరలించాలి అంట అందుకే ఇక్కడ ఉన్న గ్రామాలను పొలాలను ప్రభుత్వం తీసేసుకుని ప్రభుత్వ పనులు చేపట్టింది. ఇక్కడ ఉన్న ఊరి జనాలు వలసలు పెట్టి వెళ్లిపోయారు అని చెపుతూ ఉంటే రవి ఒక్కసారిగా బరువెక్కిన గుండెతో క్రింద పడిపోయాడు. రవి వాళ్ళ నాన్నకు ఈ విషయం తెలిసినా చెప్పలేదు రవి బాధ పడతాడు అని. అందుకే వాళ్ళ నాన్న చెప్పలేదు అని అనుకున్నాడు.ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇక నుండి అందరిని వెతకాలి అని బయలుదేరాడు.
పట్నాలకు పల్లెలు నుండి జనాలు కావాలి పనిచేయడానికి, పల్లెలు నుండి రైతులు కావాలి వ్యవసాయం చేసి పంటలు పండించి పంపాలి వాళ్ళు తినడానికి, చివరికి వారు త్రాగే నీళ్లు కూడ పల్లెల నుండే పంపాలి వారి పొలాలు ఊర్లు త్యాగం చేసి. కానీ ఒక్కడు కూడ పట్నం వదిలి పల్లెకు రాడు ఇవన్నీ చేయడానికి తు దీనెమ్మ పట్నం బతుకు అని రవి తన తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు గోదారమ్మ తల్లికి నమస్కరించి..
Written By Mr. Ramesh Akula …
Find everything you need.
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu