Paramacharya Paripoorna Kataksham, పరమాచార్య పరిపూర్ణ కటాక్షం

పరమాచార్య పరిపూర్ణ కటాక్షం - Paramacharya Paripoorna Kataksham   చాలా ఏళ్ళక్రితం ఒకరోజు మాకు పరమాత్మ కంచి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం లభించింది. ఒకసారి నేను నా భార్యా కూతురుతో కలిసి కాంచీపురం వెళ్ళాము. పరమాచార్య స్వామి, పుదు పెరియవ, బాల పెరియవ ముగ్గురిని దర్శించాము. రాత్రి చంద్రమౌళీశ్వర పూజ చూశాము. మరుసటి రోజు ఉదయం మహాస్వామివారి విశ్వరూప దర్శనం, మరియు గోపూజ తిలకించాము. అమ్మవారి దేవస్థానంలో అప్పుడే కొత్తగా విడుదల చేసిన ముగ్గురు ఆచార్యులూ కలిగి ఉన్న చిత్రపటాలను రెండింటిని తీసుకున్నాము. వాటిని పరమాచార్య స్వామివారికి ఇచ్చి వారి అనుగ్రహం పొందాలని శంకర మఠానికి వెళ్ళాము. స్వామివారిని దర్శించుకుని ఆ చిత్రపటాలను ఇచ్చి ఆశీస్సులు కోరాము. వాటిని తీసుకుని స్వామివారు, “వీటిని ఎక్కడ కొన్నారు?” అని అడిగారు. బహుశా వీటిని స్వామివారు మొదటిసారి చూస్తున్నారు కాబోలు. ఒక పరిచారికుణ్ణి పిలిచి, వాటికి ఫ్రేము కట్టి మఠంలో రెండు చోట్ల వాటిని పెట్టమని ఆదేశించారు. మేము ఇచ్చిన చిత్రపటాలు శ్రీమఠం గోడలపై ఉంటాయని మాకు ఎల్లలు లేని ఆనందం కలిగింది. ఏమి పరమాచార్య స్వామి కరుణ! మఠంలో వేయడానిక…
Read more about Paramacharya Paripoorna Kataksham, పరమాచార్య పరిపూర్ణ కటాక్షం
  • 0

Don’t Damage Tirumala Culture, తిరుమల జోలికి వెళ్లొద్దు

Don't Damage Tirumala Culture,తిరుమల జోలికి వెళ్లొద్దు   దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తితిదే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యుల కలిసి ఒక పథకం ఆలోచించారు. మామూలుగా జయవిజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమందపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటినుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన. దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సులోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే, “ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు? ఈ నిర్ణయం మ…
Read more about Don’t Damage Tirumala Culture, తిరుమల జోలికి వెళ్లొద్దు
  • 0