Matarani Mounamidi మాటరాని మౌనమిది Maharshi
Matarani Mounamidi [మాటరాని మౌనమిది] song lyrics in Telugu and English.
Song: Mataraani Mounamidi
Movie: Maharshi
Lyrics: Vennelakanti
Music: Illayaraja
Singer(s): SP Balu, S Janaki
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములొ నా ప్రాణమిది… ప్రాణమైన మూగగుండె రాగమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
ముత్యాలపాటల్లొ కోయిలమ్మా.. ముద్దారపోసేది ఎప్పుడమ్మా
ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా.. దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం.. నీకేల ఇంత పంతం
నింగి నేల కూడేవేళ.. నీకు నాకు దూరాలేలా…
అందరాని కొమ్మ ఇది… కొమ్మచాటు అందమిది..
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
చైత్రాన కూసేను కోయిలమ్మా… గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నేలమ్మా… నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం… కోరింది ప్రణయ వేదం
వేశారు గుండెల్లొ రేగే గాయం.. పాడింది మధురగేయం
ఆకాశానా తారాతీరం.. అంతేలేనీ ఎంతో దూరం
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది… కొమ్మచాటు అందమిది..
కూడనిదీ జతకూడనిదీ.. చూడనిదీ మదిపాడనిదీ.. చెప్పరాని చిక్కుముడి వీడనిదీ
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది… కొమ్మచాటు అందమిది..
English lyrics Matarani Mounamidi మాటరాని మౌనమిది Maharshi
mATarAni mounamidi mounavINa gAnamidi
mATarAni mounamidi mounavINa gAnamidi
gAnamidi nI dhyAnamidi dhyAnamulo nA prANamidi… prANamaina mUgaguMDe rAgamidi
mATarAni mounamidi mounavINa gAnamidi
mATarAni mounamidi mounavINa gAnamidi
mutyAlapATallo kOyilammA.. muddArapOsEdi eppuDammA
A pAlanavvullo vennelammA.. dIpAlu peTTEdi ennaDammA
I mounarAgAla prEmAvESaM EnADO okari soMtaM
AkASadIpAlu jAbili kOsaM.. nIkEla iMta paMtaM
niMgi nEla kUDEvELa.. nIku nAku dUrAlElA…
aMdarAni komma idi… kommacATu aMdamidi..
mATarAni mounamidi mounavINa gAnamidi
chaitrAna kUsEnu kOyilammA… grIShmAnikApATa eMdukammA
rEyaMta navvEnu vennElammA… nIreMDakAnavvu dEnikammA
rAgAla tIgallO vINAnAdaM… kOriMdi praNaya vEdaM
vESAru guMDello rEgE gAyaM.. pADiMdi madhuragEyaM
AkASAnA tArAtIraM.. aMtElEnI eMtO dUraM
mATarAni mounamidi mounavINa gAnamidi
aMdarAni komma idi… kommacATu aMdamidi..
kUDanidI jatakUDanidI.. cUDanidI madipADanidI.. cepparAni cikkumuDi vIDanidI
mATarAni mounamidi mounavINa gAnamidi
aMdarAni komma idi… kommacATu aMdamidi..
Matarani Mounamidi మాటరాని మౌనమిది Maharshi