IPL 2023 Schedule, 4 Matches will be held in Hyderabad

The schedule of IPL 2023 has arrived.. 4 matches will be held in Hyderabad!

IPL 2023 Schedule, 4 Matches will be held in Hyderabad

 

The much awaited IPL 2023 schedule is here for the cricket fans. The tournament will begin on March 31 and conclude with the final on May 21. However, this time the IPL management is going to organize the matches in a new way. 10 teams will be divided into two groups and matches will be held.

The Indian Premier League 2023 schedule is here to provide real entertainment for the cricket fans. The cash rich league will start on March 31 and will end with the final on May 21. Although the venues have been shortened in the past few seasons due to Corona, this time matches will be held in 12 stadiums across the country. The matches will be held in Ahmedabad, Lucknow, Mohali, Hyderabad, Bangalore, Chennai, Delhi, Kolkata, Jaipur, Mumbai, Guwahati and Dharamshala. Each team will play seven matches at home and seven away matches.

A total of 70 league matches will be played in the 16th season, including 18 double headers. Matches will start at 3.30 pm and 7.30 pm on the days of double headers (Saturday and Sunday). On other days it starts at 7.30 pm. However, this time, 10 teams will be divided into two groups and the matches will be organized. Knockout matches will be held between the top-2 placed teams in both the groups.

 

Two groups

Group A:

Mumbai Indians, Rajasthan Royals, Kolkata Knight Riders, Delhi Capitals, Lucknow Super Giants.

Group B:

Chennai Super Kings, Punjab Kings, Sunrisers Hyderabad, Royal Challengers Bangalore, Gujarat Titans.

 

SRH Schedule

SRH will play a total of 14 league matches in this tournament. In this, 4 matches will be held at Hyderabad venue (Rajiv Gandhi Stadium). Ami Tumi will face Rajasthan Royals on April 2, Punjab Kings on April 9, Mumbai Indians on April 18 and Delhi Capitals on April 24. Meanwhile, it is known that Gujarat Titans were the winners in the last season. Pandya-led Titans won the final match against Rajasthan Royals by 7 wickets.

 

IPL 2023 Schedule, 4 Matches will be held in Hyderabad

 

IPL 2023 Schedule, 4 Matches will be held in Hyderabad

IPL 2023 Schedule, 4 Matches will be held in Hyderabad


Cricket Stadiums in India for IPL Cricket Matches, Stadium Address Location

 

ఐపీఎల్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది.. హైద‌రాబాద్‌ వేదిక‌గా 4 మ్యాచ్‌లు!

 

క్రికెట్ అభిమానులలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 2023 షెడ్యూల్ రానే వచ్చింది. ఈ టోర్నీ మార్చి 31న ప్రారంభం కానుండగా, మే 21న జరుగబోయే ఫైనల్ పోరుతో ముగియనుంది. అయితే, ఈసారి ఐపీఎల్ యాజమాన్యం కొత్త తరహాలో మ్యాచులు నిర్వహించబోతోంది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభ‌జించి మ్యాచులు నిర్వహించనున్నారు.

క్రికెట్ అభిమానుల‌కు అసలైన వినోదాన్ని అందించే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది. పది టీంలు పోరాడబోయే ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 31న ప్రారంభం కానుండగా, మే 21న జరుగబోయే ఫైనల్ పోరుతో ముగియనుంది. కరోనా దృష్ట్యా గతం కొన్ని సీజన్లలో వేదికలను కుదించిన్నప్పటికీ.. ఈసారి దేశ‌వ్యాప్తంగా 12 స్టేడియాల్లో మ్యాచులు నిర్వ‌హించ‌నున్నారు. అహ్మ‌దాబాద్, ల‌క్నో, మొహాలీ, హైద‌రాబాద్, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌క‌తా, జైపూర్, ముంబై, గువ‌హ‌టి, ధ‌ర్మ‌శాల‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌తి జ‌ట్టు సొంత మైదానంలో ఏడు మ్యాచులు, బ‌య‌టి వేదికల్లో ఏడు మ్యాచులు ఆడనున్నాయి.

16వ సీజన్ లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు జరగనుండగా, ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. డబుల్ హెడర్స్ (శని, ఆదివారాలలో) ఉన్న రోజుల్లో మ్యాచులు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. అయితే, ఈసారి కొత్తగా 10 జట్లను రెండు గ్రూపులుగా విభ‌జించి మ్యాచులు నిర్వహించనున్నారు. ఇరు గ్రూపుల్లోని టాప్-2 ప్లేసుల్లో నిలిచిన జట్ల మధ్య నాకౌట్ మ్యాచులు జరగనున్నాయి.

 

రెండు గ్రూపులు

గ్రూప్ ఏ:

ముంబై ఇండియ‌న్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్.

గ్రూప్ బి:

చెన్నై సూప‌ర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైట‌న్స్.

 

ఎస్‌ఆర్‌హెచ్ షెడ్యూల్

ఈ టోర్నీలో ఎస్‌ఆర్‌హెచ్ మొత్తం 14 లీగ్ మ్యాచుల్లో తలపడనుంది. ఇందులో హైద‌రాబాద్ వేదిక‌గా(రాజీవ్ గాంధీ స్టేడియం) 4 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 2న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో త‌ల‌ప‌డ‌నుండగా, ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్‌, ఏప్రిల్ 18న ముంబై ఇండియ‌న్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ తో అమీ తుమీ తేల్చుకోనుంది. కాగా, గ‌త సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. పాండ్యా సారథ్యంలోని టైటాన్స్ జ‌ట్టు ఫైన‌ల్ పోరులో 7 వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై విజయం సాధించింది.

 

IPL 2023 Schedule, Team, Venue, IPL Cricket 2023 Time Table pdf download

Image


IPL 2023 Groups, IPL 2023 All Team Captain List, FAQ

 

Spread iiQ8

February 17, 2023 5:33 PM

299 total views, 0 today