House building problems ఇంటి నిర్మాణంలో ఆటంకాలు తొలగించే విష్ణు స్మరణ………!!
ఇంటి నిర్మాణంలో ఆటంకాలు తొలగించే విష్ణు స్మరణ………!!
ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు వచ్చే ఆటంకాలు తొలగడానికి, ఇల్లు కట్టడానికి, కర్మాగార నిర్మాణం కోసం, అంతే కాకుండా నిర్మాణంలో దోషాలు, అనుమానాలు, ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ నామ స్మరణ ఉపకరిస్తుంది.
ప్రతి రోజు ” ఓం క్షేత్రజ్ఞాయ నమః ” 108 కి తగ్గకుండా పఠించాలి. 1000 మార్లు పఠించడం ద్వారా ఉత్తమ ఫలం.
దంపతుల మధ్య కలహాలు నివారణ కావాలంటే……..!! Between wife and husband iiQ8
Find everything you need.
iiQ8 indianinQ8.com
List of Countries in the World | iiQ8 info
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
House building problems
గుంటూరులో మా సొంతింటిని మా నాన్నగారు 1991లో కొన్నారు.
ఆ ఇంటి పూర్వపు యజమాని ఒక క్రిస్టియన్. ఆ ఇంటిలో వేరే క్రిస్టియన్ కుటుంబం అద్దెకుండేవారు మేము కొన్నప్పటికి. మేము కొనడానికి కొన్ని నెలల ముందే వారి ఒక్కగొకానొక కొడుకు పడక గదిలో ఉరి వేసుకుని పోయాడు పాపం. ఆ కోడలు మనవడిని పెద్దావిడకి వదిలేసి వెళ్ళిపోయింది.
ఇక ఆ ఇంటి వాస్తు గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. వాస్తు ప్రకారం ఏవైతే ఉండకూదదో అవన్నీ ఉన్నాయి. ఉదా: వెనకవైపు ఆ దిక్కు ప్రకారం ఎక్కువ ఉండకూడదు, కానీ ఒక 20 గజాలన్నా ఎక్కువ ఉంది – అంటే మా స్థలం దీర్ఘ చతురస్రం కాదు.
పట్టింపులు ఎక్కువున్న సంప్రదాయుడైన మా తాతగారు మరియు మా చుట్టాలు ఎంత చెప్పినా, నాస్తికవాది అయిన మా నాన్నగారు లక్ష్య పెట్టలేదు. అప్పటికే బ్యాంకు ఉద్యోగంలో ఊళ్ళు పట్టుకొని ఆ ఇల్లూ-ఈ ఇల్లూ మారి, ఒక ఏడాది నుండి సొంత ఇల్లు కొంటానికి వెతికి విసిగి ఉన్న నాన్న, ఈ ఇల్లు కొనేశారు.
అప్పటికీ మా తాతగారు కొంచెం మార్పులు-చేర్పులు చేయ ప్రయత్నించారు. వెనక వాస్తు ప్రకారం ఎక్కువున్న భాగాన్ని వదిలేసి, ఒక గట్టు కట్టారు. ముందర ఉన్న రెండు కొబ్బరి చెట్లు నరికించారు. బోరు వాస్తు ప్రకారం వేస్తే అక్కడ బండరాయి అడ్డం పడింది.
అప్పుడు మా నాన్న మళ్ళీ రంగంలోకి దిగారు – గట్టు కొట్టించి, ఎక్కువున్న స్థలంలో అదనపు స్నానపు గది, దొడ్డి కట్టిచ్చారు. బావి/నీరు ఉండకూడని వైపు బోరు వేయించారు. మా సందులో బోరులన్నీ ఎండాకాలం ఎండిపొయినా మా బోరులో నీరు వచ్చేవి. ఇప్పటికీ వస్తున్నాయి.
ఆ ఇంటికి గృహప్రవేశం జరపలేదు. మా నాన్న నాస్తికుడు కనుక సత్యనారాయణ వ్రతం కూడా లేదు. ఆ ఇంట్లో సత్యనారాయాణ వ్రతం రెండు దశబ్దాల తరువాత మా అన్న పెళ్ళప్పుడు జరిగింది.
ఇక ఫలితాల విషయానికి వస్తే మాకు ఇప్పటివరకు ఏ సమస్యలూ రాలేదు. అన్నయ, నేను ఇద్దరం బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో (ఆయన ప్రభుత్వ గెజిటేడ్ ఉద్యోగి, నేను ఐటీ) స్థిరపడ్డాము. కోడళ్ళూ మంచివారే. అమ్మా-నాన్న వారి వానప్రస్థాన్ని హాయిగా గడుపుతున్నారు అదే ఇంట్లో. మా తాతగారు – 95 ఏళ్ళు – ఆయనా అదే ఇంట్లో ఉన్నారు ఇపుడు. ముప్పై ఏళ్ళు అవుతుంది ఇల్లు కొని.
ఆ ఇంటికి కొత్తగా ఎవరు వాస్తు పరిచయం ఉన్నవారు వచ్చినా ఆశ్చర్యపోతారు.
చివరిగా ఎవరి నమ్మకాలు వారివి. మీకు వాస్తు అనే కాదు, దేనిపైనైనా నమ్మకం ఉంటే, ఆ విధంగానే వెళ్ళండి. లేకపొతే జరగరానిది కాకతాళీయంగా జరిగినా దానికే ముడి పెట్టుకుంటార. కాకపొతే దేనినీ గుడ్డిగా నమ్మకండి.
ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి …….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం