పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
Dussala : దుస్సల —
ధృతరాష్ట్రుడు , గాంధారి ల ఏకైక కుమార్తె .
ధుర్యోధనాదుల సోదరి . ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది.
కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు
Dusshaasanudu : దుశ్శాసనుడు –
సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
దుశ్శాసనుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు.
దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభ లో ద్రౌపతి వస్త్రాపహరణం నకు పూనుకున్నాడు.
కానీ శ్రీ క్రిష్ణుడి అభయ హస్తం తో ద్రౌపతి గౌరవం కాపాడబడింది.
Dushyanthudu : దుష్యంతుడు–
హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు మహారాజు . శకుంతల భర్త . భరతుని తండ్రి .
Daaxaayani : దాక్షాయణి —
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, బద్రకాళి , శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Durvaasudu : దుర్వాసుడు –
దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము), దుర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి , అనసూయ ల పుత్రుడు.
ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి.
అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.