Forum

ఇరువురు సెక్యులరిస్...
 
Notifications
Clear all

Please - NO HATE Speech, NO Abuse (Only Knowledge Sharing & Awake People)

ఇరువురు సెక్యులరిస్టులు రాసినటువంటి The Bible Handbook - @everyone దయచేసి పూర్తిగా చదవండి ప్లీజ్!!

1 Posts
1 Users
0 Likes
420 Views
Forum 1
Posts: 42
Admin
Topic starter
(@hr)
Estimable Member
Joined: 6 years ago

@everyone దయచేసి పూర్తిగా చదవండి ప్లీజ్!!

1880 లలో G. W. Foote, W. P. Ball, అనే ఇరువురు సెక్యులరిస్టులు రాసినటువంటి "The Bible Handbook" అనే పుస్తకం ఒక సంచలనాత్మకమైన విప్లవాత్మకమైన ఆ కాలంలో ఐరోపాను కుదిపేసినటువంటి పుస్తకం. ఏమిటి ఈ పుస్తకం యొక్క గొప్పతనం అంటే... స్కాలర్ లెవెల్ లో కాకుండా పాపులర్ బుక్కుగా సామాన్య ప్రజలకు బైబుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అవివేకాన్ని మూఢత్వాన్ని ఇంగితానికి కూడా హాస్యాస్పదమనిపించే విషయాలను విడమరిచి చెప్పడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం.

బైబిల్ దైవ గ్రంథం కాదు. ఒక గొప్ప ఫిలాసఫికల్ గ్రంథం కూడా కాదు.. నీతి పుస్తకం కూడా కాదు.. కనీసం సాహిత్యపు విలువలు ఉన్నటువంటి కథల పుస్తకం కూడా కాదు.. అదొక అజ్ఞాన యుగపు అంధ రచయితల అనాగరిక పుస్తకం. ప్రశ్నించేవారు లేక దాని పెత్తనం శతాబ్దాలు తరబడి ప్రజల్ని బతుకులను కమ్మేసింది. దాని "వెన్ను విరిచి వేర్లు పీకి నేలమట్టం చేసిన" అనేక పుస్తకంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుస్తకం ఇది.

క్రైస్తవులు గొప్పగా... క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని చూసిన ఎన్నో సామ్రాజ్యాలు నేల మట్టమయ్యాయి.. ఎందరో సామ్రాట్లు దాని ముందు నాశనమైపోయారు అంటూ ఉంటారు.. కానీ అవన్నీ ఉత్త రేకు డబ్బా తప్పెట్లు.. మీ అందరికీ నేడు బాగా తెలుసు శ్వేత జాతీయులలో అనగా విద్యాపరంగా వైజ్ఞానికంగా మేధోపరంగా శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన యూరప్ అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాలలో ఒరిజినల్ క్రిస్టియన్స్ మధ్య నేడు క్రైస్తవ్యం మట్టి కొట్టుకుపోయింది. ఆ శ్వేత జాతి ప్రజలందరూ కూడా మన భారతీయ క్రైస్తవ స్త్రీ వలే నెత్తిన గుడ్డేసుకుని మూసుకొని మౌనంగా కూర్చోదు. వాళ్ళ నాగరికత మారిపోయింది వారి జీవన విధానం మారిపోయింది వారి విలువలు, లైంగిక విలువలు కూడా మారిపోయాయి వారి యొక్క వలువలు కూడా మారిపోయాయి.. హద్దులు లేని విచ్చలవిడి స్వేచ్ఛ శృంగార భౌతిక జీవనంలో జీవిస్తూ ఉన్నారు.

ఇలా పతనం అవ్వడానికి కారణం ఏమిటంటే ఇలాంటి పుస్తకాల కొట్టినటువంటి చావు దెబ్బలే.. అయితే ఇలాంటి పుస్తకాలను చదవాలంటే కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ప్రజలు ఇటువంటి పుస్తకాలు చదివితే క్రైస్తవ్యం యూరప్ లో పతనమైనట్లు పతనమవుతుంది.

ఈ రచయితలు చాలా సరళంగా బైబుల్లో ఉన్నటువంటి లోపాలను దోషాలను అజ్ఞానాన్ని అయిదు విభాగాలుగా విభాగించి వాటిల్లో వందలాది బైబిలు వచనాలను పొందుపరిచారు.

♦️పర విరుద్ధమైన రెండు, అంతకంటే ఎక్కువ అంశాలను ఒకే చోట చేర్చివి అసంబద్దాలుగా,

♦️అసంభవం అనిపించే విషయాలను అసంభావ్యాలుగా,

♦️అనవసరమైన హింస, అధర్మమైన హింస, నీతి లేని అనాగరికమైన హింస, మతోన్మాదం, మత అసహనం, స్త్రీల వివక్ష, బానిసత్వం జాతుల తుడిపివేత, ఇతర అనేక అత్యాచారాలను, అత్యాచారాలు అనే విభాగంలోనూ,

♦️ దేవుళ్ళు ప్రవక్తలు అని చెబుతున్న వారు పలికిన బూతులను అశ్లీలమైన పదజాలాన్ని జుగుప్సాకరమైన లైంగిక వర్ణనలను తప్పుడు మాటలను వావివరసలు లేని శృంగార కవితలను, వర్ణనలను అశ్లీల విభాగం కింద..

♦️దేవుడు స్వయంగా ఇచ్చిన అబద్ధపు హామీలను, నెరవేరని హామీలను, బూటకపు హామీలను, నెరవేరని హామీలను, నెరవేరని ఆశీర్వాదాలను దీవెనలను వాగ్దానాలను మరియు నెరవేరని శాపాలను.... అపశృతుల కింద పొందుపరిచారు.

ఈ పుస్తకాన్ని తెలుగులో ఎన్ వి బ్రహ్మం పి సుబ్బరాజు అనే ఇరువురు వేరువేరుగా అనువాదం చేశారు. వీరి ఇరువురు పుస్తకాలలో నుంచి text ని డిజిటలైజేషన్ చేసి ఒక్కొక్క అంశాన్ని విడివిడిగా ఏ అంశానికి ఆ అంశం ప్రతి ఒక్కరూ కాపీ పేస్ట్ చేసి ఒక పోస్ట్ పెట్టుకునే లాగా, లేదా ఎవడైనా సరే ఏదైనా పోస్ట్ పెడితే దానికి కౌంటర్ గా కామెంట్ పెట్టడానికి అనువుగా, లేదా చర్చలో కౌంటర్ రికౌంటర్ ఇవ్వడానికి ఉపయుక్తంగా ఉండేలా అనేక ట్యాగులతో keywords తో అతి త్వరలో మీ ముందు ఉంచ బోతున్నాను. బూతు అని కొట్టారంటే బైబుల్లో దేవుడే పరికిన బూతులు హింస అని టైప్ చేస్తే దేవుడే స్వయంగా చేసిన అకృత్యాలు, మతోన్మాదం అని కొడితే దేవుడే ఇచ్చినటువంటి చంపండి నరికేయండి అనే మతోన్మాద ఆజ్ఞలు వంటివి వచ్చేలాగా సుమారు 500 kaywords తో మీకు డిబేట్ చేయడానికి కౌంటర్ చేయడానికి ప్రశ్నించడానికి సులువుగా వేగంగా వెతుక్కునే విధంగా అనుకూలంగా ఉండేలా పెట్టబోతున్నాను.

ప్రస్తుతానికి కాంట్రాడిక్షన్స్ అనే మొదటి విభాగం తప్ప మిగిలినవన్నీ సంపూర్ణంగా పూర్తయ్యాయి. అది పూర్తి చేసి కేవలం ఆన్లైన్లో పెట్టడమే మిగిలింది.

 

Credits to - SHIVAJI SENA

Please Subscribe & Share   https://www.youtube.com/@sarinodu2021      

 

మరిన్ని పోస్ట్‌లు కాపీ చేసి షేర్ చేయవచ్చు   https://indianinq8.com/Hindu



What is FORUM ?

Forum is an online discussion forum where youth or even the experienced professionals discuss their queries related to and get answers for their questions from other talented individuals. An online discussion can be started by asking questions, helping others with answers. The best part is that it is very simple and is free of cost.

Spread iiQ8