Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము | Jgnana Karma Sanyasa Yogam
Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
Om Namo Vasudevaya ! Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
4వ అధ్యాయము: జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
నాలుగవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, తను ఉపదేశించే ఈ జ్ఞానంపై, దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియచేయటం ద్వారా, అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును, తన ప్రియ మిత్రుడు, భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళెదురుగా ఉన్న శ్రీ కృష్ణుడు, ఎన్నో యుగాల క్రితం సూర్య భగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా, శ్రీ కృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుకలేని వాడు అయినా, తన యోగమాయా శక్తిచే, ధర్మాన్ని పరిరక్షించటానికి, ఈ భూలోకం లోకి దిగివస్తాడని చెప్తాడు. కానీ, ఆయన జన్మ, కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసినవారు…
Read more
about Bhagavad Gita 4 జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము | Jgnana Karma Sanyasa Yogam
