పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
BaaNaasuruDu : బాణాసురుడు —
వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని వంశపరంపర->
* బ్రహ్మ కుమారుడు పరిచుడు
* పరిచుని కుమారుడు కాశ్యపుడు
* కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
* హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు
* ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు
* విరొచుని కుమారుడు బలి చక్రవర్తి
* ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు
* ఆ బాణాసురుని భార్య కండల.
Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు
వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణ గా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది.
ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి , మూర్ఖత్వానికి చింతించి నీ రధం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.
Daakini : డాకిని —
మంత్రాలను వల్లించడం ద్వారా అద్భుతాలు చేసే స్త్రీ . హిందూ పురాణాలలో చెప్పబడిన స్త్రీ .
Damayanthi : దమయంతి –
‘దమనుడు‘ అను ముని వరము వలన జన్మించినది.
2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
భీమమహారాజు కుమార్తె , నిషధ రాజా నలునితో వైభవోపేతంగా వివాహం జరిగింది.
కుమార్తె ఇంద్రసేన, కుమారుడు ఇంద్రసేనుడు .