Butter Milk majjiga for good health
• ఆరోగ్యానికి అమృతం మజ్జిగ…..!!
Butter Milk majjiga for good health • ఆరోగ్యానికి అమృతం మజ్జిగ…..!!
• ఆరోగ్యానికి అమృతం మజ్జిగ…..!!
మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది. మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి
* ఎక్కుళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.
* వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేంచిన జిలకర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
* కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్యనుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తుంది.
* వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది.
* ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది.
* మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతుంది. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంటుంది.
Butter Milk majjiga for good health
Find everything you need.
iiQ8 indianinQ8.com
List of Countries in the World | iiQ8 info
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
దుశ్శకునాలు బాధించకుండా ఉండుటకు ……….!! Bad Events
మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం.
కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు మజ్జిగను తీసుకునేందుకు ప్రయత్నించండి..!