Panchadara Bomma Bomma Song Lyrics in Telugu, పంచదారా బొమ్మా

Panchadara Bomma Bomma Song Lyrics in Telugu, పంచదారా బొమ్మా

 

 

Gundello Emundo Song Lyrics in Telugu, గుండెల్లో ఏముందో

 

పంచదారా బొమ్మా – Panchadara Bomma Bomma Song Lyrics

పంచదారా బొమ్మా బొమ్మా
పట్టుకోవద్దనకమ్మా
మంచుపూలా కొమ్మా కొమ్మా
ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే
చెంతకే రావొద్దంటే
యేమవుతానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువ్ అందకపోతే వృధా యీ జన్మ

నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువ్ అందకపోతే వృధా యీ జన్మ

పువ్వు పైన చెయ్యేస్తే
కసిరి నన్ను తిట్టిందే
పసిడిపువ్వు నువ్వని పంపిందే

నువ్వు రాకు నా వెంట
ఈ పువ్వు చుట్టు ముళ్లంటా
అంటుకుంటే మంటే వొళ్లంతా

తీగపైన చెయ్యేస్తే
తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే

మెరుపు వెంట ఉరుమంటా ..
ఉరుము వెంట వరదంటా
నే వరద లాగా మారితే ముప్పంటా

వరదైనా వరమని వరిస్తానమ్మా
మునకైనా సుఖమని వుడేస్తానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువ్ అందకపోతే వృధా యీ జన్మ

గాలి నిన్ను తాకింది
నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా

గాలి ఊపిరయ్యింది
నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్ప

వెలుగు నిన్ను తాకింది
చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైన

వెలుగు దారి చూపింది
చినుకు లాలి పోసింది
వాటితోటి పోలిక నీకేలా

అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువ్ అందకపోతె వృధా యీ జన్మ

 

Paripoke Pitta Song Lyrics in Telugu, పారిపోకే పిట్టా

Director: S.S.Rajamouli
Producer: Allu Aravind
Music Director: M.M. Keeravani
Artists :Ram charan,Kajal Agarwal .


Janaki Kalaganaledu Song Lyrics In Telugu, జానకి కలగనలేదు

Panchadara Bomma Bomma Song Lyrics in Telugu, పంచదారా బొమ్మా


Yemi Cheyamandhuve Song Lyrics In Telugu, Priyuralu Pilichindi, ఏమి చేయమందువే –


Gelupu Thalupule Song Lyrics In Telugu గెలుపు తలుపులే

Spread iiQ8

December 21, 2022 9:03 AM

599 total views, 0 today