New Delhi: 1st February 2023
బడ్జెట్ 2023: ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో తెలుసుకోండి!Union Budget 2023, Cheaper Items, Costlier Items
‘బడ్జెట్‘ దీని గురుంచి వార్తలు రాసేవారికి, వ్యాపారస్తులకు తప్ప మిగిలిన ప్రజానీకానికి అనవసరం. ప్రయోజనాలు ఉన్నా అర్థం కాని పరిభాషలో ఉంటుంది కనుక అనవసరం అన్నట్లుగా భావిస్తారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కోటి ఆశలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘కేంద్ర బడ్జెట్ 2023-24‘ను ప్రవేశపెట్టారు. ఇందులో వేతన జీవులకు వరాలు(ఏడు లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు), మహిళల కోసం ప్రత్యేక పథకం(మహిళా సమ్మాన్ పొదుపు పథకం), పాన్ కార్డుకు జాతీయ కార్డుగా గుర్తింపు, రైల్వేల అభివృద్ధికి రూ.2.4 లక్షల కోట్లు, విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడం.. వంటి హైలైట్స్ ఉన్నాయి. అలాగే, కొన్ని దిగుమతి తీసుకునే వస్తువుల సుంకాలపై రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేశారు. పలితంగా క…