Paramacharya Paripoorna Kataksham, పరమాచార్య పరిపూర్ణ కటాక్షం
పరమాచార్య పరిపూర్ణ కటాక్షం - Paramacharya Paripoorna Kataksham
చాలా ఏళ్ళక్రితం ఒకరోజు మాకు పరమాత్మ కంచి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం లభించింది. ఒకసారి నేను నా భార్యా కూతురుతో కలిసి కాంచీపురం వెళ్ళాము. పరమాచార్య స్వామి, పుదు పెరియవ, బాల పెరియవ ముగ్గురిని దర్శించాము. రాత్రి చంద్రమౌళీశ్వర పూజ చూశాము. మరుసటి రోజు ఉదయం మహాస్వామివారి విశ్వరూప దర్శనం, మరియు గోపూజ తిలకించాము.
అమ్మవారి దేవస్థానంలో అప్పుడే కొత్తగా విడుదల చేసిన ముగ్గురు ఆచార్యులూ కలిగి ఉన్న చిత్రపటాలను రెండింటిని తీసుకున్నాము. వాటిని పరమాచార్య స్వామివారికి ఇచ్చి వారి అనుగ్రహం పొందాలని శంకర మఠానికి వెళ్ళాము. స్వామివారిని దర్శించుకుని ఆ చిత్రపటాలను ఇచ్చి ఆశీస్సులు కోరాము. వాటిని తీసుకుని స్వామివారు, “వీటిని ఎక్కడ కొన్నారు?” అని అడిగారు. బహుశా వీటిని స్వామివారు మొదటిసారి చూస్తున్నారు కాబోలు.
ఒక పరిచారికుణ్ణి పిలిచి, వాటికి ఫ్రేము కట్టి మఠంలో రెండు చోట్ల వాటిని పెట్టమని ఆదేశించారు. మేము ఇచ్చిన చిత్రపటాలు శ్రీమఠం గోడలపై ఉంటాయని మాకు ఎల్లలు లేని ఆనందం కలిగింది. ఏమి పరమాచార్య స్వామి కరుణ! మఠంలో వేయడానిక…
Read more
about Paramacharya Paripoorna Kataksham, పరమాచార్య పరిపూర్ణ కటాక్షం