Forum

Seemantham * సీమంతం...
 
Notifications
Clear all

Please - NO HATE Speech, NO Abuse (Only Knowledge Sharing & Awake People)

Seemantham * సీమంతం ఎందుకు చేస్తారు…? *

1 Posts
1 Users
0 Likes
372 Views
Forum 1
Posts: 42
Admin
Topic starter
(@hr)
Estimable Member
Joined: 6 years ago

* సీమంతం ఎందుకు చేస్తారు…? *

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

హిందూ బంధువులారా 🙏 మన మధ్యలో సెక్యులర్ గా ఉన్న హిందువులకు చైతన్యం రావాలి అనేదే నా ప్రయత్నం.🙏

మన దేశంలో ఉంటూ ఇక్కడే తింటూ స్వదేశాన్నీ సంప్రదాయాల్ని చులకన చేస్తూ విమర్శిస్తూ నీచ భావంతో ఏమైనా నా కంటపడితే. గువ్వలో గునపం దింపుతా. 💪

మీకు నా నుండి ఏమైనా సమాచారం కావాలంటే 👇 వాట్సాప్ నంబర్ కు మేసేజ్ చెయ్యండి. వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లో చేరేవారు ఈ నంబరుకు 9398699797 జై శ్రీ రాం అని మెసేజ్ పెట్టండి

సీమంతం' హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు జరిపించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి ఇది. ఆడవారికి జరిగే 16 జాతక కర్మల్లో ఒకటి సీమంతం. దీనికి మరో పేరే జన్మ సంస్కారం. గర్భవతిగా ఉన్న ఏడో నెలలో కానీ తొమ్మిదో నెలలో కానీ చేయడం జరుగుతుంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి రోజు నుంచీ శిశువు కి ప్రాణ శక్తి ఉన్నా కూడా, మెదడుకు సంభందించిన చైతన్య శక్తి 7 వ నెల నుంచి వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు అన్నీ సరిగ్గా తెలియడం స్టార్ట్ అవుతాయని అంటారు.

ఆ రోజున తల్లి కి చక్కగా మంగళ స్నానం చేయించి ఆ తర్వాత జుట్టు సాంబ్రాణితో ఆరబెట్టి, కాళ్ళకి పసుపు, నుదుట కుoకుమ పెట్టి, తలనిoడా పూలు అలంకరించి, కొత్త చీర కట్టి కూర్చోబెడతారు. కొన్ని చోట్ల హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఆడవారందరూ చేరి, ఆమెకి, గంధం రాసి, కొత్త గాజులు వేసి, తమ వెంట తెచ్చిన కానుకలు అన్నీ ఇస్తారు. చీరలు, తినుబండారాలు ఇందులో ముఖ్యం. తల్లినీ , కడుపు లో ఉన్న బిడ్డని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం అన్నమాట. ఫంక్షన్ పూర్తయిన తర్వాత మంగళహారతి ఇస్తారు.

మానసికం గా తల్లిని ప్రసవానికి సిద్ధం చేయడం ఈ సీమంతం ప్రధాన ఉద్దేశం. అంతమంది ముత్తైదువులు… అందులో పిల్లల తల్లులే ఎక్కువగా ఉంటారు. వారిని చూసి ఆమెకు భయం తగ్గుతుంది. ఇంత మంది ఆడాళ్ళు ప్రసవం తర్వాత కూడా సంతోషంగా ఉన్నారని ఆమెకు ఒక నమ్మకం. ఇక మరో కారణం… సీమంతం చేసే వరకు అమ్మాయి అత్తవారింట్లో ఉంటుంది. ఇక అప్పటి వరకు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు… ఇక నుంచి కొన్ని నెలల పాటు మేము చూసుకుంటామని చెప్తూ పుట్టింటికి తీసుకు వెళ్తారు.

పుట్టింట్లో పిండవంటలు, తీపి పదార్థాలు తెచ్చి తమ సంతోషం బయట పెడతారు. అత్తగారి ఇంటి నుంచి వచ్చే స్వీట్స్ ను అందరికి పంచి… పరోక్షంగా చెప్తారు… మా అమ్మాయి ప్రసవం రెండు కుటుంబాలు కలిపి తీసుకున్న బాధ్యత అని. అప్పుడు అమ్మాయికి ఒక ధైర్యం వస్తుంది నా వెనుక పుట్టినిల్లు, మెట్టినిల్లు ఉన్నాయని. ఈ సమయంలో అమ్మాయి వాళ్ళ అమ్మ, అత్తగారు ఇద్దరూ ఒక్కో చీర కానుకగా ఇచ్చి తమ కృతజ్ఞత బయట పెడతారు.

గర్భిణికి సీమంతం ఎందుకు చేస్తారు?
పూర్వ జన్మ పుణ్యం వల్ల సంక్రమించేదే ఈ మానవ జన్మం. దానికి చేయాల్సిన వాటిని షోడశ సంస్కారాలని అంటారు. అవి జనన పూర్వ సంస్కారాలు, జననాంతర సంస్కారాలని రెండు రకాలు. గర్భంలో ఉండగా పుట్టకముందే జరిపే సంస్కారాలలో ఈ సీమంతమనేది మూడోది. దీనికి మరో పేరే సీమంతోన్నయనం. అంతకుముందు జరిగే రెండు సంస్కారాలు గర్భాదానం, పుంసవనం. సీమంతమనేది కేవలం తొలిచూలప్పుడు, గర్భం దాల్చిన ఐదు గాని, ఏడు గాని, తొమ్మిది నెల గానీ చేయాలని శాస్త్రం చెపుతున్నది. మిగతా పదమూడు సంస్కారాలు జీవితంలోని వేర్వేరు దశల్లో చేస్తారు.

సీమంతం తల్లి సౌభాగ్యాన్నీ, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షునూ కోరుతూ చేసేది. కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలనే ఆశయంతో ఈ వేడుక చేస్తారు. గర్భిణి శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలని కాంక్షిస్తూ దీనిని నిర్వహిస్తారు. 'స్త్రీ సంస్కార రూపం సీమంతోన్నయనాఖ్యం కర్మచ తంత్రేణ కరిష్యే' అనే సంకల్పంతో సీమంతం చేస్తారు.

బలమైన సంతాన సంపదను ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ మేడిపండ్లు, వనస్పతి వంటి పదార్థాలతో హోమం చేసే సంప్రదాయమూ ఉంది కొన్ని ప్రదేశాలలో. గర్భదోషాలను తొలగింపజేసి, గర్భపోషణను అనుగ్రహించాలని హవ్యంతో ఉన్న పాత్రను చూపుతూ భర్తతోపాటు, గర్భిణి కూడా దేవతలను భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలని శాస్త్రం.

 

Credits to - SHIVAJI SENA

Please Subscribe & Share   https://www.youtube.com/@sarinodu2021      

 

మరిన్ని పోస్ట్‌లు కాపీ చేసి షేర్ చేయవచ్చు   https://indianinq8.com/Hindu



What is FORUM ?

Forum is an online discussion forum where youth or even the experienced professionals discuss their queries related to and get answers for their questions from other talented individuals. An online discussion can be started by asking questions, helping others with answers. The best part is that it is very simple and is free of cost.

Spread iiQ8