Forum

*ఆనందం కొనుక్కుంటే ...
 
Notifications
Clear all

Please - NO HATE Speech, NO Abuse (Only Knowledge Sharing & Awake People)

*ఆనందం కొనుక్కుంటే వస్తుందా? అడుక్కుంటే వస్తుందా? మానసిక ఆనందం అంటే డబ్బు కాదు...!!* Buy Happiness -

1 Posts
1 Users
0 Likes
484 Views
Forum 1
Posts: 42
Admin
Topic starter
(@hr)
Estimable Member
Joined: 6 years ago

*ఆనందం కొనుక్కుంటే వస్తుందా? అడుక్కుంటే వస్తుందా? మానసిక ఆనందం అంటే డబ్బు కాదు...!!*

హిందూ బంధువులారా 🙏 మన మధ్యలో సెక్యులర్ గా ఉన్న హిందువులకు చైతన్యం రావాలి అనేదే నా ప్రయత్నం.🙏
మన దేశంలో ఉంటూ ఇక్కడే తింటూ స్వదేశాన్నీ సంప్రదాయాల్ని చులకన చేస్తూ విమర్శిస్తూ నీచ భావంతో ఏమైనా నా కంటపడితే. గువ్వలో గునపం దింపుతా. 💪

మీకు నా నుండి ఏమైనా సమాచారం కావాలంటే 👇 వాట్సాప్ నంబర్ కు మేసేజ్ చెయ్యండి. వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లో చేరేవారు ఈ నంబరుకు 9398699797 జై శ్రీ రాం అని మెసేజ్ పెట్టండి లేదా
 

నేను పరిసరాలను...మనుషులను గమనిస్తే ఎవ్వరిలో ఆనంద ఛాయలు కనబడడం లేదు...ఏదో అసంతృప్తి! బాగా డబ్బు ఉన్న వ్యక్తి తాను ఆనందంగా ఉన్నాడు అనుకొని *మీకేమండి అన్నీ ఉన్నాయి* కారు, బంగ్లా, ఇంటి నిండా పనివాళ్ళు...నిమిషంలో మీ కడుపు నింపడానికి తినే పదార్దాలు అన్ని ఉన్నాయి...కదా అన్నాను...

 

ఆయన నిట్టుర్పు విడచి అన్ని ఉన్నాయి కానీ *నాకు వారసులు లేరు అండి* అన్నాడు..."అయ్యో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు వారసులు కారా?" అన్నాను...అల్లుడు కొడుకు అవుతాడా ? అండి వాళ్ళు యు ఎస్ లో సెటిల్ అయ్యారు...

వాళ్ళు మంచి స్తోమత లో ఉన్నారు...కానీ మేము ఆలుమగలం సిక్ అయితే మాకు ఎన్ని డబ్బులు ఉంటే ఏమి లాభం స్వస్థత అయ్యే వరకు ఎవరో ఒకరం ఏకాకులమే కదా?! అన్నారు...

 

మరి *ఆనందం* గా ఎలా ఉండగలరు మీరు అన్నాను...ఆరోగ్యం సరిగా ఉంటేనే ఆనందం అనే హార్మోన్ పనిచేస్తుంది...కానీ రోజు ఏమవుతుందొ అనే బెంగతో *ఆనందం అనే హార్మోన్* పనిచేయడం లేదు అన్నారు! నిజంగా ఆనందం ఖరీదు కట్ట గలమా?! ప్రతి ఇంట్లో ఆనందం తాండవిస్తుంది అనే భ్రమ పోయింది...ఒక అనుభూతి, దయ, కృతజ్ఞత, ప్రేమ ఇవేవీ మనుషుల్లో కనబడడం లేదు...*హ్యాపీనెస్* అనే పదం ఎక్కడి నుండి తెచ్చుకోవాలి అనే ఫిలాసఫీని ఎన్ని చదివినా ఏదో అసంతృప్తి...ప్రతి మనిషిలో ఏదో అభద్రత భావం...

అయితే నిన్నను సాయంత్రం డ్యూటీ నుండి ఇంటికి వస్తున్నప్పుడు నాకు ఒక *ఆనందం* కనబడింది... ఒక పనిపై NAD కొత్తరోడ్డు దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్లవలసి వచ్చింది.....

.అక్కడ వాచ్ మెన్ గాపని చేస్తున్న (అపార్ట్మెంట్ గ్రౌండ్ లో ఉన్న వాచ్ మెన్ రూమ్ లో )ఇద్దరు ముసలి వాళ్ళు *ఆనందంగా* కనబడ్డారు...వారిలో ఇంత ఆనందం ఎందుకు ఉంది అని ఆసక్తి పెరిగింది...డెబ్భై ఏళ్ళ అతనికి ప్రేమగా కంచంలో ముద్ద కలిపితే ఆయన భార్య నోట్లో పెట్టాడు...ఒక పనివాళ్ళ లో ఇంత *ఆనందం* కనబడడం ఆశ్చర్యం వేసింది... నాకు మంచి అవకాశం దొరికిందని ఇక ఇంటర్వ్యూ మొదలు పెట్టాను...

*సార్ మా పిల్లలకు మేము ఆస్తులు కూడ గట్ట లేదు* వాళ్లకు రెక్కలు వచ్చాయి ఎక్కడో బ్రతుకుతున్నారు...మేము వాచ్ మేన్ లుగా ఇద్దరం ఈ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాం...గత పదిహేను ఏళ్లుగా ఈ అపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నాం...బోలెడు కాపురాలు చూశాం...

ఒక్కరికన్నా ఆత్మ సంతృప్తి ఆనందం పొందలేరు అనే విషయాన్ని మా జీవిత పాఠం లో నేర్చుకున్నాం...అందుకే మా సన్నిహిత సంబంధాలపై మక్కువ విడిచి... "ఇక మనకు ఎవరూ లేరు ఇద్దరమే అని నిర్ధారణ కు వచ్చాం" అప్పుడు కాస్తా ఆనందం దగ్గరయింది...శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి అని అనుకున్నాము.

ఆనందం మరింత సన్నిహితం అయింది...రేపు చనిపోతే ఒక్కరమే మిగిలి ఉంటాము అనే అత్మప్రభోదాన్ని కూడా జీర్ణించుకోన్నాం...మానసిక దృఢత్వం తెచ్చుకున్న తరువాత మరింత ఆనందం పొందాం..కోట్లు పెట్టీ ఇంత లక్షరీ ఆనందం పొందలేని ఈ అపార్ట్ మెంట్ జీవితాలు కన్నా ఒక్క గదిలో ఒకే దుప్పట్లో మేము జీవిత కథలు నెమరేసుకుంటూ పోతున్నాం...

అదే మా ఆరోగ్యంగా బాగుండేలా చేసింది...మనుషుల ఎంత సంపాదించినా చివరికి ఏమీ తీసుకుపోనీ ఈ జీవితం లో భవబంధాల కన్నా ప్రేమైక జీవనం లో ఆశ లేకుండా బ్రతకడం లోనే ఆనందం చవి చూస్తున్నాం సార్" అన్నారు...

ఎక్కడో ఒక దగ్గర చదివిన ఒక కొటేషన్ గుర్తుకు వచ్చింది...తత్వ వేత్తలు..మతపరమైన ఆలోచన పరులు ఆనందాన్ని కేవలం భావోద్వేగంగా కాకుండా *మంచి జీవితాన్ని* గడపడం ద్వారా నిజమైన ఆనందం పొందుతారని ఆ జంట ను చూస్తే అర్థం అయింది!?

 

Credits to - SHIVAJI SENA

Please Subscribe & Share   https://www.youtube.com/@sarinodu2021      

 

మరిన్ని పోస్ట్‌లు కాపీ చేసి షేర్ చేయవచ్చు   https://indianinq8.com/Hindu

 

 



What is FORUM ?

Forum is an online discussion forum where youth or even the experienced professionals discuss their queries related to and get answers for their questions from other talented individuals. An online discussion can be started by asking questions, helping others with answers. The best part is that it is very simple and is free of cost.

Spread iiQ8